MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Automobile
  • Cars
  • Cheapest Diesel MPV India: సేఫ్టీలో తోపు.. మైలేజ్ లో కింగ్.. ఇండియాలోనే చీపెస్ట్ 5 స్టార్ డీజిల్ కారు వచ్చేసింది !

Cheapest Diesel MPV India: సేఫ్టీలో తోపు.. మైలేజ్ లో కింగ్.. ఇండియాలోనే చీపెస్ట్ 5 స్టార్ డీజిల్ కారు వచ్చేసింది !

Cheapest Diesel MPV India : దేశంలోనే అత్యంత చౌకైన డీజిల్ కారు (MPV) కియా కారెన్స్ క్లావిస్. 6, 7 సీటర్ ఆప్షన్లు, 870 కిమీ మైలేజ్, సులభమైన ఈఎంఐ ఆఫర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు పూర్తి వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 19 2026, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లీటరుకు బంపర్ మైలేజ్.. తక్కువ ధరలోనే 7 సీటర్ కియా కొత్త డీజిల్ కారు
Image Credit : X/Gogi Tech (Rajeev)

లీటరుకు బంపర్ మైలేజ్.. తక్కువ ధరలోనే 7 సీటర్ కియా కొత్త డీజిల్ కారు

భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఈవీలకు సరిపడా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అందుకే, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇప్పటికీ డీజిల్ వాహనాలే బెస్ట్ ఛాయిస్ గా మారుతున్నాయి.

డీజిల్ కార్లపై రూల్స్ కఠినంగా మారుతున్నప్పటికీ, మార్కెట్లో కొన్ని బెస్ట్ డీజిల్ ఎంపీవీలు ఫ్యామిలీస్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ లిస్టులో దేశంలోనే అత్యంత చౌకైన డీజిల్ కారుగా కియా కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) నిలిచింది. ఈ కారు ధర, మైలేజ్, ఫీచర్లు, అలాగే ఈజీ ఈఎంఐ ప్లాన్స్ గురించిన పూర్తి వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కియా కారెన్స్ క్లావిస్ ధరల వివరాలు
Image Credit : kia

కియా కారెన్స్ క్లావిస్ ధరల వివరాలు

భారత మార్కెట్లో మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తున్న కియా కారెన్స్ క్లావిస్ ధర రూ. 11.23 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 21.67 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ముఖ్యంగా, ఈ కారు ఎంట్రీ లెవల్ డీజిల్ ఎడిషన్ ఆన్ రోడ్ ధర హైదరాబాద్ లో దాదాపు రూ. 16,36,000 గా ఉంది. ఇందులో ఎక్స్ షోరూమ్ ధర రూ. 13,23,000 కాగా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాదాపు రూ. 2,42,000, ఇన్సూరెన్స్ కోసం రూ. 53,000, ఇతర ఖర్చులు రూ. 17,000 వరకు యాడ్ అవుతాయి.

Related Articles

Related image1
Telangana Goa: హైదరాబాద్‌కు దగ్గర్లోనే తెలంగాణ గోవా.. ఈ సీక్రెట్ ఐలాండ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Related image2
FIFA World Cup 2026 హాఫ్ టైమ్ షో: షకీరా, మడోన్నా, జస్టిన్ బీబర్‌ల పారితోషికం ఎంతంటే?
36
బంపర్ ఈఎంఐ ఆప్షన్స్ ఇవే
Image Credit : kia

బంపర్ ఈఎంఐ ఆప్షన్స్ ఇవే

సాధారణంగా బ్యాంక్ లోన్ ద్వారా కారు కొనాలనుకునే వారు, ఎక్కువ అమౌంట్ డౌన్ పేమెంట్ గా చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే, బ్యాంకులు 7.45 శాతం వడ్డీ రేటుతోనే వెహికల్ లోన్స్ ఇస్తున్నాయి. ఒకవేళ మీరు రూ. 10.36 లక్షలను డౌన్ పేమెంట్ గా చెల్లించి, ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్ ను ఎంచుకుంటే, మిగిలిన రూ. 6 లక్షల మొత్తానికి మాత్రమే లోన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ రూ. 6 లక్షల లోన్ పై 8 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా కేవలం రూ. 9,300 ల ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్లాన్ లో అసలు కాకుండా అదనంగా రూ. 1.85 లక్షలు వడ్డీ రూపంలో చెల్లిస్తారు. అంటే మొత్తంగా రూ. 18.10 లక్షలు పే చేసి ఈ డీజిల్ కార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ డౌన్ పేమెంట్ కావాలనుకుంటే, రూ. 1.60 లక్షల నుండి రూ. 1.81 లక్షల వరకు ముందస్తుగా చెల్లించి, నెలకు రూ. 25,000 వరకు ఈఎంఐ కట్టే ప్లాన్ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

46
870 కిలోమీటర్ల అదిరిపోయే మైలేజ్
Image Credit : kia

870 కిలోమీటర్ల అదిరిపోయే మైలేజ్

ఈ కారులో 1.5 లీటర్ల 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 114bhp పవర్, 250Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 19.54 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వేరియంట్ 17.50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిలోని 45 లీటర్ల డీజిల్ ట్యాంక్ ను ఫుల్ చేస్తే, ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఏకంగా 740 నుండి 875 కిలోమీటర్ల దూరం వరకు హ్యాపీగా ప్రయాణించవచ్చు. హైవేలపై స్పీడ్ మార్చకుండా వెళ్తే మైలేజ్ 1000 కిలోమీటర్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

56
నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు, సీటింగ్ కెపాసిటీ
Image Credit : Kia

నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు, సీటింగ్ కెపాసిటీ

పెద్ద కుటుంబాలకు సరిపోయేలా ఈ కారును 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో విక్రయిస్తున్నారు. ఇందులో అధునాతన 12.25 ఇంచ్ లేదా 12.3 ఇంచ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అంతే సైజు ఉన్న డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ ఉన్నాయి. ఇంకా వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, డ్యూయల్ పాన్ పనోరమిక్ సన్ రూఫ్, 64 కలర్స్ యాంబియంట్ లైటింగ్, 8 స్పీకర్ల బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, కప్ హోల్డర్లతో కూడిన రీట్రాక్టబుల్ సీట్ బ్యాక్ టేబుల్స్, రియర్ సన్ షేడ్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, మల్టిపుల్ ఛార్జింగ్ పోర్టులు వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

66
తిరుగులేని సేఫ్టీ ఫీచర్లు
Image Credit : Kia Motors

తిరుగులేని సేఫ్టీ ఫీచర్లు

ప్రయాణికుల భద్రత కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. వీటితో పాటు ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. దీని ఎలక్ట్రిక్ ఎడిషన్‌లో స్టాప్ అండ్ గో ఫీచర్‌తో కూడిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ అయాడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 20 అటానమస్ ఫీచర్లు గల లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టమ్ కూడా ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Telangana Goa: హైదరాబాద్‌కు దగ్గర్లోనే తెలంగాణ గోవా.. ఈ సీక్రెట్ ఐలాండ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Recommended image2
FIFA World Cup 2026 హాఫ్ టైమ్ షో: షకీరా, మడోన్నా, జస్టిన్ బీబర్‌ల పారితోషికం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved