MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Automobile
  • Cars
  • బంపర్ ఆఫర్.. ఈ కార్ల పై ₹2.25 లక్షల వరకు డిస్కౌంట్ !

బంపర్ ఆఫర్.. ఈ కార్ల పై ₹2.25 లక్షల వరకు డిస్కౌంట్ !

Diwali Car Offers : దీపావళి సందర్భంగా ప్రముఖ కార్ల కంపెనీలు భారీ తగ్గింపులు ప్రకటించాయి. టాటా, హ్యుందాయ్, మారుతి, హోండా, వోక్స్‌వ్యాగన్, స్కోడా సెడాన్ కార్లపై రూ.2.25 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 19 2025, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దీపావళి సందర్భంగా సెడాన్ కార్లపై ప్రత్యేక ఆఫర్లు
Image Credit : Honda

దీపావళి సందర్భంగా సెడాన్ కార్లపై ప్రత్యేక ఆఫర్లు

దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో ముందుకొస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. బడ్జెట్ కార్ల నుంచి లగ్జరీ సెడాన్‌ల వరకు ప్రతి బ్రాండ్ ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తోంది. అయితే నగరాలవారీగా, డీలర్లవారీగా ఆఫర్లు మారవచ్చు. కానీ, మొత్తంగా అయితే, గతంలో కంటే తక్కువగా కార్ల ధరలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాటా టిగోర్ పై ₹30,000 వరకు డిస్కౌంట్
Image Credit : our own

టాటా టిగోర్ పై ₹30,000 వరకు డిస్కౌంట్

టాటా మోటార్స్ తమ టిగోర్ (Tigor) సెడాన్‌పై రూ.30,000 వరకు ఆఫర్ ఇస్తోంది. ఈ కారు ధర రూ.5.49 లక్షల నుంచి రూ.8.74 లక్షల వరకు ఉంది (ఎక్స్‌షోరూమ్). ఇందులో 86 హెచ్‌పి సామర్థ్యం గల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్‌లలో సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది.

Related Articles

Related image1
9 కొత్త ఫీచర్లు, సూపర్ డిజైన్ తో న్యూ మహీంద్రా బొలెరో 2025
Related image2
సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న నిస్సాన్ టెక్టాన్ SUV
36
హ్యుందాయ్ ఆరా పై ₹43,000 వరకు ఆఫర్
Image Credit : Getty

హ్యుందాయ్ ఆరా పై ₹43,000 వరకు ఆఫర్

హ్యుందాయ్ ఆరా (Aura) పై ₹43,000 వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు 83 హెచ్‌పి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. కొన్ని వేరియంట్‌లలో ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్జీ కిట్ కూడా ఉంది. వివిధ వేరియంట్లను బట్టి ధరలు రూ.5.98 లక్షల నుంచి రూ.8.42 లక్షల వరకు ఉన్నాయి.

46
మారుతి సుజుకీ సియాజ్ పై ₹45,000 వరకు తగ్గింపు
Image Credit : our own

మారుతి సుజుకీ సియాజ్ పై ₹45,000 వరకు తగ్గింపు

మారుతి సియాజ్ (Ciaz) ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ, పలువురు డీలర్ల వద్ద ఇంకా స్టాక్ ఉంది. దీపావళి ఆఫర్ కింద ఈ కారు మీద రూ.45,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇందులో 105 హెచ్‌పి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది. వివిధ వేరియంట్లను బట్టి ధర రూ.9.09 లక్షల నుంచి రూ.11.88 లక్షల వరకు ఉంది.

56
హోండా సెడాన్‌ల పై ₹98,000 నుంచి ₹1.27 లక్షల వరకు తగ్గింపు ఆఫర్
Image Credit : our own

హోండా సెడాన్‌ల పై ₹98,000 నుంచి ₹1.27 లక్షల వరకు తగ్గింపు ఆఫర్

హోండా తమ అమేజ్ (Amaze) పై రెండు రకాల ఆఫర్లు ఇస్తోంది. కొత్త మోడల్‌పై ₹68,000 వరకు, పాత మోడల్‌పై ₹98,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రెండు మోడళ్లలో 90 హెచ్‌పి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ధరలు పాత మోడల్‌కి రూ.6.98 లక్షల నుంచి రూ.7.80 లక్షలు, కొత్త మోడల్‌కి రూ.7.41 లక్షల నుంచి రూ.9.99 లక్షలు వరకు ఉన్నాయి.

అలాగే, హోండా సిటీ (City) పై ₹1.27 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారు 121 హెచ్‌పి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో (6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో) వస్తుంది. హైబ్రిడ్ వేరియంట్‌ 126 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వివిధ వేరియంట్ల ధరలు రూ.11.95 లక్షల నుంచి రూ.16.07 లక్షల వరకు (హైబ్రిడ్ రూ.19.48 లక్షలు) ఉన్నాయి.

66
వోక్స్‌వ్యాగన్ కార్ల పై టాప్ డిస్కౌంట్లు
Image Credit : Volkswagen Website

వోక్స్‌వ్యాగన్ కార్ల పై టాప్ డిస్కౌంట్లు

వోక్స్‌వ్యాగన్ వర్చుస్ (Virtus) పై రూ.1.50 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ ఉంది. ఇది 1.0 లీటర్ (115 హెచ్‌పి), 1.5 లీటర్ (150 హెచ్‌పి) టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ రెండు వేరియంట్‌లలో ఉంది. ఆటోమేటిక్ వెర్షన్‌లో 1.0L కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, 1.5L కు 7-స్పీడ్ డీసీటీ ఉంది. వివిధ వేరియంట్ల ధరలు రూ.11.16 లక్షల నుంచి రూ.18.73 లక్షల వరకు ఉన్నాయి.

ఈ ఫెస్టివల్ సీజన్‌లో అత్యధిక డిస్కౌంట్ స్కోడా స్లావియా (Skoda Slavia) పై లభిస్తోంది. రూ.2.25 లక్షల వరకు ఆఫర్ ప్రకటించారు. ఇది వర్టస్‌ లాగే 1.0L, 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుంది. అయితే 1.5L మోడల్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. టాప్ వేరియంట్‌లపై ఎక్కువ తగ్గింపు ఆఫర్ ఉంది. వివిధ వేరియంట్ల ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.17.69 లక్షల వరకు ఉన్నాయి.

దీపావళి సమయంలో కొత్త సెడాన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి అవకాశం. ప్రతి బ్రాండ్ తమ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తోంది. అయితే నగరాల వారీగా ఆఫర్లు మారవచ్చని, స్టాక్ లభ్యతను బట్టి మార్పులు ఉండవచ్చని కంపెనీలు చెబుతున్నాయి. ఖచ్చితమైన ఆఫర్ వివరాల కోసం ముందుగా సమీప డీలర్‌ను సంప్రదించడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
9 కొత్త ఫీచర్లు, సూపర్ డిజైన్ తో న్యూ మహీంద్రా బొలెరో 2025
Recommended image2
సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న నిస్సాన్ టెక్టాన్ SUV
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved