- Home
- Automobile
- Cars
- సైడ్ ఇన్‌కమ్ కోసం కారు కొనాలనుకుంటున్నారా.? తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ మైలేజ్..
సైడ్ ఇన్‌కమ్ కోసం కారు కొనాలనుకుంటున్నారా.? తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ మైలేజ్..
Cars: ఉద్యోగం చేస్తూనే సైడ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వాటిలో ఓలా, ఉబర్ వంటి సర్వీస్ ఒకటి. మరి ట్యాక్సీల కోసం అందుబాటులో ఉన్న అలాంటి కొన్ని బెస్ట్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యాక్సీలకు ఉపయోగపడే కార్లు
ఓలా, ఉబర్, రాపిడో వంటి టాక్సీ సర్వీసుల్లో భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఫుల్ టైం ఉద్యోగాలు చేసే వారు కూడా పార్ట్ టైమ్‌గా ఇలాంటి వాటితో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ట్యాక్సీలకు ఉపయోగించే కార్లలో ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండాలి, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండాలి, అలాగే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాలి. ఇలాంటి అన్ని ఫీచర్లు ఉన్న కొన్ని బెస్ట్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి వాగన్‌ఆర్
సిటీ టాక్సీ లేదా లోకల్ రైడ్ సర్వీస్ ప్రారంభించాలనుకునే వారికి మారుతి వాగన్‌ఆర్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఈ కారు ధర రూ. 4.98 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.
ఇంజిన్: 1.2 లీటర్ పెట్రోల్
మైలేజీ: పెట్రోల్‌లో 25 km/l, CNGలో 34.05 km/kg
ఫీచర్లు: AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వెనుక AC వెంట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
నగర ప్రయాణాల కోసం సరైన కాంపాక్ట్ కారు ఇది. ఫ్యూయల్ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది.
మారుతి డిజైర్ టూర్ S
డ్రైవర్స్‌కి నాణ్యత, మైలేజీ, తక్కువ నిర్వహణ.. మూడు ఫీచర్లు కావాలంటే డిజైర్ టూర్ S సరైన ఎంపికగా చెప్పొచ్చు. ఈ కారు ధర రూ. 6.24 లక్షల నుంచి రూ. 7.74 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.
ఇంజిన్: 1.2 లీటర్ K12N పెట్రోల్
మైలేజీ: పెట్రోల్‌లో 26.06 km/l, CNGలో 34 km/kg
ప్రత్యేకత: బలమైన బాడీ క్వాలిటీ, లో మింటెనెన్స్ కాస్ట్
టాక్సీ యజమానులు ఎక్కువగా ఎంచుకునే మోడల్ ఇదే. ఇది లాంగ్ డ్రైవ్స్, సిటీ రైడ్స్ రెండింటికీ సరిపోతుంది.
హ్యుందాయ్ ఆరా
మీ ట్యాక్సీ ఫ్లీట్‌కి ప్రీమియం టచ్ ఇవ్వాలనుకుంటే హ్యుందాయ్ ఆరా సరైన మోడల్‌గా చెప్పొచ్చు. ఈ కారు ధర రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఇంజిన్: 1.2 లీటర్ కప్పా పెట్రోల్
మైలేజీ: పెట్రోల్‌లో 24.7 km/l, CNGలో 28 km/kg
ఫీచర్లు: స్టైలిష్ ఇంటీరియర్, కంఫర్టబుల్ సీటింగ్, బలమైన సస్పెన్షన్
ఈ కారు ప్రయాణికులకు కంఫర్ట్ ఇస్తుంది, అలాగే లాంగ్ టర్మ్‌లో డ్రైవర్‌కి మంచి ఆదాయాన్ని తెస్తుంది.
మారుతి ఎర్టిగా
ఎక్కువ మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లే MPV కావాలనుకుంటే మారుతి ఎర్టిగా బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. ఈ కారు ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఇంజిన్: 1.5 లీటర్ పెట్రోల్
మైలేజీ: పెట్రోల్‌లో 20.51 km/l, CNGలో 26.11 km/kg
ఫీచర్లు: 360° కెమెరా, మూడవ వరుస AC వెంట్స్, LED హెడ్‌ల్యాంప్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
ఆఫీసు ట్రిప్స్, అవుట్‌స్టేషన్ రైడ్స్, ఫ్యామిలీ టూర్స్ వంటి వాటికి ఈ కారు ఉపయోగపడుతుంది.