MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Best Savings Scheme: రూ. 15 లక్షల పెట్టుబడితో రూ. 22 లక్షల లాభం !

Best Savings Scheme: రూ. 15 లక్షల పెట్టుబడితో రూ. 22 లక్షల లాభం !

Best Senior Savings Scheme: సురక్షితమైన సేవింగ్స్ తో పాటు మీ డబ్బుతో అధిక లాభాల కోసం చూస్తున్నారా? అయితే, సీనియర్ సిటిజన్‌ల కోసం ఒక అద్భుతమైన పథకం ఉంది, ఇది చాలా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు) కంటే మంచి రాబడిని అందిస్తుంది. ఆ వివరాలు మీకోసం..

2 Min read
Mahesh Rajamoni
Published : Jul 28 2025, 10:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృద్ధుల కోసం అద్భుతమైన పొదుపు పథకం
Image Credit : Gemini

వృద్ధుల కోసం అద్భుతమైన పొదుపు పథకం

వృద్ధులకు విశ్వసనీయమైన, రిస్క్ రహిత పెట్టుబడి మార్గం కావాలనుకుంటే, వారికి ఒక అద్భుతమైన సేవింగ్ పథకం ఉంది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఈ పథకం భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే పొదుపు పథకం కావడంతో పాటు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌ల కంటే మెరుగైన వడ్డీ రేటును అందిస్తుంది. ప్రస్తుతం ఈ పథకానికి వార్షిక వడ్డీ రేటు 8.2% గా ఉంది.

25
రూ. 15 లక్షల పెట్టుబడితో రూ. 22 లక్షల వరకు లాభం.. ఎలాగంటే?
Image Credit : Gemini

రూ. 15 లక్షల పెట్టుబడితో రూ. 22 లక్షల వరకు లాభం.. ఎలాగంటే?

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. కేవలం రూ. 15 లక్షల పెట్టుబడి చేసినా కూడా మంచి ఆదాయం పొంద‌వ‌చ్చు. 5 సంవత్సరాల వ్యవధిలో, 8.2% వార్షిక వడ్డీ రేటుతో రూ. 15 లక్షల పెట్టుబడిపై సుమారు రూ. 6.15 లక్షలు వడ్డీ వస్తుంది. దీనివల్ల మీరు రూ. 21.15 లక్షలకు పైగా మొత్తాన్ని పొందవచ్చు.

ఈ పథకాన్ని మ‌రో 3 సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ పొడిగింపు ద్వారా మొత్తం ఆదాయం రూ. 22 లక్షల మార్క్‌ను దాటుతుంది.

Related Articles

Related image1
ఇకపై మీ కరెంటు బిల్లులో రూ.1000 ఆదా అవుతుంది.. ఎలాగంటే
Related image2
Who is Divya Deshmukh: చెస్ వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత మహిళ.. ఎవ‌రీ దివ్య దేశ్‌ముఖ్?
35
SCSS లో మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి
Image Credit : Gemini

SCSS లో మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పథకం ప్రతి త్రైమాసికానికి ఒకసారి వడ్డీని చెల్లిస్తుంది. ఇది వృద్ధులకు స్థిరమైన ఆదాయ వనరిగా ఉపయోగపడుతుంది. మార్కెట్ ఆధారిత పథకాల కంటే ఇది అధిక భద్రత కలిగినదిగా గుర్తింపు పొందింది.

45
SCSS ప‌థ‌కం పన్ను ప్రయోజనాలు, ఇతర ఫీచర్లు ఏమిటి?
Image Credit : ChatGPT

SCSS ప‌థ‌కం పన్ను ప్రయోజనాలు, ఇతర ఫీచర్లు ఏమిటి?

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లో పెట్టుబడి చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని 80C సెక్షన్ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, వడ్డీ ఆదాయం పన్నుతో కూడి ఉంటుంది. 

ఒక సంవత్సరం వడ్డీ ఆదాయం రూ. 50,000 దాటి పోతే, టీడీఎస్ (Tax Deducted at Source) వర్తిస్తుంది. అయితే, పన్నుయోగ్య ఆదాయం లేనివారు Form 15H సమర్పిస్తే టీడీఎస్ (TDS) నుంచి మినహాయింపు పొందవచ్చు.

55
SCSS ఖాతా ఎవరు తెరవచ్చు?
Image Credit : Gemini

SCSS ఖాతా ఎవరు తెరవచ్చు?

  • 60 ఏళ్లు పైబడిన వారు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరవవచ్చు.
  • రైల్వే లేదా రక్షణ రంగం నుండి పదవీ విరమణ పొందిన వారు 55-60 మధ్య వయస్సులో కూడా అర్హత కలిగి ఉంటారు.
  • వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిపి బహుళ ఖాతాలు తెరవవచ్చు. కానీ మొత్తం పెట్టుబడి రూ. 30 లక్షలు మించకూడదు.
  • వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి పునఃసమీక్షిస్తారు. కానీ ఖాతా తెరిచిన తర్వాత ఆ ఖాతా కాలవ్యవధి వరకు స్థిరంగా ఉంటుంది.
  • పోస్టాఫీసులు, ప్రభుత్వ అనుమతితో ఉన్న బ్యాంకుల ద్వారా ఖాతా సులభంగా తెరవొచ్చు.
  • అవసరమైతే పూర్తి కాలానికి ముందే ఖాతాను మూసివేసే అవకాశం కూడా ఉంటుంది, కానీ కొద్దిపాటి పెనాల్టీ వర్తిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ప్రభుత్వ పథకాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved