- Home
- Careers
- H1B Visa : ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారో.. ఇప్పుడు యూఎస్ నుండి పో పొమ్మంటున్న ట్రంపే రా రమ్మంటాడు
H1B Visa : ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారో.. ఇప్పుడు యూఎస్ నుండి పో పొమ్మంటున్న ట్రంపే రా రమ్మంటాడు
H1B Visa : ఇప్పుడు H1B వీసాల వంటి నిబంధనలు పెట్టి ఇండియన్స్ ను అమెరికాకు రావద్దంటున్నాడు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. అయితే ఇదే ట్రంప్ తమ దేశానికి రా రమ్మని ఆహ్వానించేలా మీరు తయారవ్వాలంటే ఈ ట్రిక్స్ పాటించండి.

ఇండియన్స్ డాలర్స్ డ్రీమ్స్ చిదిమేస్తున్న ట్రంప్
H1B Visa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులను కంగారుపెట్టిస్తున్నాయి. ఇటీవల భారత్ పై ఏకంగా 50 శాతం టారీఫ్స్ విధించి ఇక్కడి వస్తువులు అమెరికాకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసి వ్యాపారులకు షాక్ ఇచ్చారు ట్రంప్. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఉద్యోగులపై పడ్డారు... H1B వీసాల జారీ నిబంధనలను పూర్తిగా మార్చేశారు. కొత్త హెచ్-1బి వీసా దరఖాస్తులకు దాదాపు లక్ష డాలర్ల భారీ రుసుము విధించారు... దీంతో ఈ వీసాలపై ఆశలు పెట్టుకున్న ఇండియన్స్ కి షాక్ తగిలింది. ఇలా చాలామంది యువత డాలర్ డ్రీమ్ ను చిదిమేశారు ట్రంప్.
ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్
సెప్టెంబర్ 21 నుండి ఈ H1B వీసా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ వీసాలపై అమెరికాలో ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు... కానీ కొత్తగా ఈ వీసా పొందాలంటే మాత్రం దాదాపు లక్ష డాలర్లు చెల్లించాలి. ఇదే ఇప్పుడు భారతీయుల ఆందోళన కారణమయ్యింది.
అమెరికా అందించే ఈ H1B వీసాలు పొందేవారిలో అత్యధికులు భారతీయులే ఉంటారు... గతేడాది ఈ వీసాలు పొందినవారిలో 71 శాతంమంది మనవారే. అందుకే ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయులపై మరీముఖ్యంగా ఐటీ రంగంలోని ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
H1B నిబంధనల్లో మార్పులివే
కేవలం H1B వీసా విధానంలో లక్ష డాలర్లు చెల్లించడమే కాదు మరికొన్ని మార్పులు చేసింది ట్రంప్ ప్రభుత్వం. ఈ వీసాల జారీ కోసం ఉపయోగిస్తున్న లాటరీ విధానాన్ని కూడా మార్చేందుకు ట్రంప్ సర్కార్ సిద్దమయ్యింది. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులన్నింటిలోంచి అభ్యర్థులను ఎంపిక చేసేవారు... కానీ ఇకపై కంపెనీ ఆఫర్ చేసే సాలరీ ఆధారంగా (weighted selection approach) లాటరీ నిర్వహించాలని చూస్తున్నారు. అంటే అధిక నైపుణ్యం కలిగినవారికి ఎక్కువ సాలరీ లభిస్తుంది... ఇలాంటివారికే ఈ H1B వీసాలు ఇవ్వాలన్నది ట్రంప్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.
హెచ్1బి వీసాలే కాదు... అమెరికా వెళ్ళాాలంటే మరెన్నో మార్గాలు
H1B వీసా నిబందనల మార్పులవల్ల ఇండియన్స్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ H1B వీసాపైనే ఆధారపడకుండా మరికొన్ని మార్గాల్లో కూడా అమెరికాకు వెళ్లవచ్చు. అంతేకాదు మరికొన్ని వ్యూహాలను అనుసరించడం ద్వారా ఈ హెచ్1బి వీసాలను పొందవచ్చు. ఇలా అమెరికాలోనే ఉద్యోగం చేయాలని కలలుగనే భారతీయ యువత ఈ 5 ట్రిక్స్ ఫాలో కావచ్చు... తద్వారా తమ డాలర్ డ్రీమ్ ని నెరవేర్చుకోచ్చు.
1. H1B వీసాలకు బదులు O-1 వీసాల కోసం ప్రయత్నించండి
అమెరికాకు వెళ్లాలంటే హెచ్1బి ఒక్కటే మార్గం కాదు... అనేక ఇతర వీసాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి O-1 వీసా. అయితే ఇది అసాధారణ నైపుణ్యాలు కలిగినవారికి ఇస్తారు. కాబట్టి అద్భుత ప్రతిభ కలిగినవారు ఈ వీసాల కోసం ప్రయత్నించవచ్చు.
2. నైపుణ్యాలను పెంచుకోవడం
ట్రంప్ H1B వీసా వ్యవహారాన్ని బట్టి ఓ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది... హైస్కిల్స్ ఉన్నవారినే అమెరికా ఆహ్వానిస్తుంది, అధిక వేతనాలు ఇస్తుంది. కాబట్టి అమెరికా వెళ్లాలంటే ముందునుండే ప్రణాళికాబద్దంగా చదవాలి, ఏదైనా రంగంలో నైపుణ్యం సాధించాలి. దీనివల్ల H1B కే కాదు ఇతర అవకాశాలు కూడా లభిస్తాయి. మంచి మేధాశక్తిని ట్రంప్ కాదు ఎవ్వరూ ఆపలేరు.
4. లాటరీ లేకుండానే వీసా పొందండి
అమెరికాలో కొన్నిరకాల ఉద్యోగాలకు ఆ లాటరీ విధానం లేకుండానే ఉద్యోగాలు పొందవచ్చు. కొన్ని యూనివర్సిటీలు, మరికొన్ని యూనివర్సిటీల అనుబంధ సంస్థలు ఇలాంటి ఉద్యోగాలను కల్పిస్తుంటారు. ఇలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించి అవకాశం వస్తే ఈజీగా అమెరికా వెళ్లవచ్చు.
5. అమెరికా కాకుండా ఇతర దేశాలను ఎంచుకొండి
ప్రపంచంలో అమెరికా ఒక్కటే కాదు.. అనేక దేశాలు ఐటీతో పాటు ఇతర రంగాల్లో మంచి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలా కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో ఇండియన్స్ కి మంచి అవకాశాలున్నాయి. కాబట్టి ఆయా దేశాల్లో మంచి కెరీర్ ఉన్న ఉద్యోగాలను ఎంచుకోవచ్చు.