MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • YouTube: బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్.. కొత్త నిబంధనలు ఇవే

YouTube: బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్.. కొత్త నిబంధనలు ఇవే

YouTube: యూట్యూబ్ కొత్త నిబంధనలతో బిగ్ షాక్ ఇచ్చింది. యూట్యూబ్ జూలై 15 నుంచి కొత్త పాలసీ అమలు చేయనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 11 2025, 10:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జూలై 15 నుంచి అమల్లోకి యూట్యూబ్ కొత్త పాలసీ
Image Credit : Freepik

జూలై 15 నుంచి అమల్లోకి యూట్యూబ్ కొత్త పాలసీ

ప్రపంచంలోని టాప్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గా గుర్తింపు పొందిన యూట్యూబ్ తాజాగా తన యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) కి సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. 

జూలై 15 నుండి కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం డూప్లికేట్ కంటెంట్ లేదా కాపీ చేసిన కంటెంట్‌కు ఇకపై యూట్యూబ్ ఆదాయం చెల్లించదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇకపై కాపీ వీడియోలకు ఆదాయం ఉండదు
Image Credit : Getty

ఇకపై కాపీ వీడియోలకు ఆదాయం ఉండదు

యూట్యూబ్ అధికార వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. మానిటైజేషన్ పొందాలంటే వీడియోలు అసలైనవి, ఒరిజినల్ కావాల్సిందే. ఇతరుల వీడియోలను ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడం, ఏఐ ద్వారా తయారుచేసిన స్లయిడ్ షోలను పోస్ట్ చేయడంతో వాటికి ఇకపై ఆదాయం రాదు.

 యూట్యూబ్ లో ఆదాయానికి అర్హతలేని వీడియోలు ఇవే

• క్లోన్ లేదా డూప్లికేట్ వీడియోలు

• లో-క్వాలిటీ వీడియో కంటెంట్

• క్లిక్‌బైట్‌ ఆధారిత వీడియోలు

• కాపీ చేసిన, చిన్న మార్పులతో తిరిగి వాడిన వీడియోలు

36
యూట్యూబ్ కొత్త పాలసీ ఉద్దేశం ఏంటి?
Image Credit : pixabay@rupixen

యూట్యూబ్ కొత్త పాలసీ ఉద్దేశం ఏంటి?

యూట్యూబ్ ప్రకారం, ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం అసలైన కంటెంట్‌ను ప్రోత్సహించడం. ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఏఐ కంటెంట్ కు చెక్ పెట్టడం. అలాగే, మానవ కృషిని ఆదరించడమే కాకుండా, ఇతరుల కంటెంట్‌ను అనవసరంగా వాడి ఆదాయం పొందే పరిస్థితులను అరికట్టే దిశగా చర్యలుగా ఉన్నాయి.

క్రియేటివిటీ లేకుండా తయారైన వీడియోలు, ఏఐ ఆధారిత కంటెంట్, మాస్ ప్రోడ్యూస్ చేసిన వీడియోలు.. ఇవన్నీ యూట్యూబ్ లో ఇక ఆదాయానికి అర్హత ఉండదు.

46
యూట్యూబ్ మానిటైజేషన్ అర్హతకు నిబంధనలు ఏమిటి?
Image Credit : Getty

యూట్యూబ్ మానిటైజేషన్ అర్హతకు నిబంధనలు ఏమిటి?

యూట్యూబ్ మానిటైజేషన్ కోసం క్రియేటర్లు ఈ ప్రమాణాలు కలిగి ఉండాలి:

• కనీసం 1,000 సబ్‌స్క్రైబర్లు. అలాగే,

• గత 12 నెలల్లో 4,000 గంటల పబ్లిక్ వాచ్ టైం

లేదా

• గత 90 రోజుల్లో 1 కోటి షార్ట్ వ్యూస్

ఈ ప్రమాణాలు పూర్తయిన తర్వాత, వీడియో కంటెంట్ అసలైనదా కాదా అన్నది యూట్యూబ్ చెక్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే మీ ఛానెల్ కు మానిటైజేషన్ ఇస్తుంది.

56
యూట్యూబ్ లో ఏ విధమైన కంటెంట్‌కు ఆదాయం వుంటుంది?
Image Credit : Getty

యూట్యూబ్ లో ఏ విధమైన కంటెంట్‌కు ఆదాయం వుంటుంది?

జూలై 15 తర్వాత క్రింది రకాల వీడియోలు మాత్రమే ఆదాయానికి అర్హత పొందుతాయి. వాటిలో..

• విద్యా సంబంధిత వీడియోలు

• అసలైన వినోదాత్మక కంటెంట్ (మానవ క్రియేటివిటీతో తయారైనవి)

• స్వంతంగా రూపొందించిన వీడియోలు (తరచుగా రీపర్పస్ చేయని వీడియోలు)

ఏఐ ఆధారిత స్టాక్ ఫుటేజ్, టెంప్లేట్లు, వాయిస్ ఓవర్ మాత్రమే వుండే వీడియోలకు ఆదాయం ఉండదు. అలాంటి కంటెంట్ ను యూట్యూబ్ ఒప్పుకోదని పేర్కొంది.

66
యూట్యూబ్ స్టూడియోలో మరో కీలక మార్పు
Image Credit : Getty

యూట్యూబ్ స్టూడియోలో మరో కీలక మార్పు

జూలై 15 నుంచి "Bare Skin (Image Only)" అనే యాడ్ కేటగిరీని యూట్యూబ్ తొలగిస్తోంది. దీన్ని ఉపయోగిస్తున్న చానెల్స్ ఆగస్ట్ 15 లోపల తమ యాడ్ సెట్టింగులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

యూట్యూబ్ తీసుకొస్తున్న ఈ మార్పులు స్పష్టంగా అసలైన కంటెంట్‌కు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించినవిగా ఉన్నాయి. 2025 జూలై 15 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
IND vs ENG: లార్డ్స్‌ టెస్టులో తెలుగు ప్లేయర్ డబుల్ బ్రేక్‌త్రూ.. ఇంగ్లాండ్ కు నితీశ్ రెడ్డి షాక్
Recommended image2
Team India: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్ కు గుడ్ న్యూస్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved