భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్న 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే
2024 ముగింపు సందర్భంగా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇండియాలో ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఇస్తున్న డిస్కౌంట్లు మీరు అస్సలు ఊహించలేరు. కారు కొనాలనే ఆలోచన మీకుంటే, అందులోనూ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే ఈ ఆఫర్లు అస్సలు వదులుకోవద్దు.
సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో ఆ సంవత్సరం రిలీజ్ చేసిన మోడల్ కార్లను పూర్తిగా అమ్ముకోవడానికి ప్రతి కంపెనీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. 2024 ముగింపు సందర్భంగా ప్రముఖ కార్ కంపెనీలు కూడా ఈసారి డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ప్రధాన బ్రాండ్ కంపెనీలు సంవత్సరాంతపు డీల్స్ ద్వారా అమ్మకాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనేక పెద్ద EV కంపెనీలు గణనీయమైన డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడానికి ఇదే అనువైన సమయం. ఈ కార్లు ఉపయోగించడం వల్ల పొల్యూషన్ లేని పర్యావరణం తయారవుతుంది. ఎలక్ట్రిక్ కార్లకు మెయింటనెన్స్ చాలా తక్కువ. వీటికే భవిష్యత్తు ఎక్కువ ఉంది. ఎలక్ట్రిక్ కారు కొనాలనే ఆలోచనతో ఉన్న వారికి ఇక్కడ ఉన్న సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ మోడళ్లపై ఆయా కంపెనీలు ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరూ ఓ సారి పరిశీలించండి.
కియా కంపెనీ తన 2023 EV6 మోడల్‌పై రూ. 2,00,000 డిస్కౌంట్ అందిస్తోంది. దీనివల్ల ఆన్ రోడ్ ధర రూ. 5,00,000కి తగ్గుతుంది.
MG మోటార్స్ కాంపాక్ట్, ప్రీమియం EVలపై డిస్కౌంట్లను అందిస్తోంది. కామెట్ EVపై రూ. 75,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. MG ZS EVపై రూ. 1,15,000 నుండి రూ. 2,25,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ సంవత్సరం విండ్సర్ EVకి ఎలాంటి డిస్కౌంట్లు లేవు.
మహీంద్రా కంపెనీ తన XUV400 EV కారు రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్లపై రూ. 3,10,000 డిస్కౌంట్ అందిస్తోంది.
టాటా మోటార్స్ అన్ని EVలపై డిస్కౌంట్లను అందిస్తోంది. 2024 టిగోర్ EV, టియాగో EV మోడళ్ల కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా రూ. 1,15,000 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. 2023 మోడళ్లకు రూ. 2,00,000 వరకు డిస్కౌంట్లు, అదనంగా రూ. 1,00,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. పంచ్ EVపై తక్కువ వేరియంట్లకు రూ. 25,000, టాప్ ఎండ్ వేరియంట్లకు రూ. 70,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా మీరు పొందొచ్చు. నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ (2023)పై రూ. 2,00,000 డిస్కౌంట్ ఉండగా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లకు రూ. 3,00,000 డిస్కౌంట్ ఉంది. 2024 నెక్సాన్ EV లేదా కర్వ్ EVకి ఎలాంటి డిస్కౌంట్లు లేవు.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్‌పై రూ. 2,00,000 నగదు డిస్కౌంట్ అందిస్తోంది. డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్‌తో కూడిన ఐయోనిక్ 5 కూడా తగ్గింపు ధరకే లభిస్తుంది. 2024 ఎండిండ్ మీకు మంచి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడానికి మంచి డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తూ బైబై చెబుతోంది.