- Home
- Business
- Yamaha Fascino: యమహా ఫాసినో 125 అప్‌డేటెడ్ డిజైన్‌తో వచ్చేసింది: పోటీ కంపెనీ స్కూటర్ల పని అయిపోయినట్టే..
Yamaha Fascino: యమహా ఫాసినో 125 అప్‌డేటెడ్ డిజైన్‌తో వచ్చేసింది: పోటీ కంపెనీ స్కూటర్ల పని అయిపోయినట్టే..
ఇంజిన్ కెపాసిటీ బాగుండేది, స్టైల్ గా ఉండేది, పనితీరులో బెస్ట్ గా నిలిచే స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే అప్‌డేటెడ్ డిజైన్, అధిక మైలేజ్‌కలిగిన యమహా ఫాసినో 125పై ఓ లుక్కేయండి. పాత వెర్షన్ కి మించి మెరుగైన ఫీచర్లు ఈ స్కూటర్ లో ఏమున్నాయో చూద్దామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
అందరికీ సెట్ అయ్యే కొత్త యమహా ఫాసినో 125
యమహా ఫాసినో 125 ఆడవాళ్లకు చాలా నచ్చుతుంది. కాని 2025లో అప్డేటెడ్ డిజైన్, అధిక మైలేజ్ తో వచ్చిన కొత్త యమహా ఫాసినో 125 అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టైలిష్ డిజైన్ వల్ల యూత్ దీన్ని బాగా ఇష్టపడతారు. అధిక మైలేజ్ ఇస్తుంది కాబట్టి మధ్య తరగతి ఫ్యామిలీ మెన్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పనితీరుతో బెస్ట్ గా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్లు కూడా ఈ స్కూటర్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు.
యమహా ఫాసినో 125 ధర
డిజైన్ పరంగా 2025 యమహా ఫాసినో 125 ప్రీమియం ఆకర్షణను కలిగి ఉంది. ఇది రోడ్డుపై వెళుతుంటే అందరూ తలలు తిప్పి మరీ చూసేంత స్టైలిష్ లుక్ ని కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.80,430.
యూత్ ను అట్రాక్ట్ చేయడానికి యమహా అనేక ఆకర్షణీయమైన రంగుల్లో కొత్త ఫాసినో 125ను అందిస్తోంది. ఈ స్కూటర్ లో మరో ముఖ్యమైన లక్షణం స్మార్ట్ మోటార్ జనరేటర్(SMG) సిస్టమ్. ఈ ఫీచర్ వల్ల నడిపేవారు రైడింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తారు.
ఫాసినో 125 ఫీచర్లు
కొత్త ఫాసినో 125 సీసీ, ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, SOHC, 2 వాల్వ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో మోటారు గరిష్టంగా 8.2 PS శక్తిని, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పెసిఫికేషన్‌లు ఉండటం వల్ల ఈ స్కూటర్ నడిపే వారు ఒక జిప్పీ రైడ్ చేసిన అనుభవాన్ని పొందుతారు. రోజువారీ ప్రయాణాలకే కాకుండా, సుదూర ప్రయాణాలకు కూడా ఈ స్కూటర్ అనువైనది.
ఫాసినో స్కూటర్ మైలేజ్
కొత్త ఫాసినో 125లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, డిస్క్, డ్రమ్ బ్రేక్ వేరియంట్‌లు, విశాలమైన 21 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, SMG స్టార్టింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
కొత్త ఫాసినో లీటరుకు 68.75 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఈ మైలేజ్ వల్ల 125 విభాగంలోని అనేక స్కూటర్‌ల కంటే ఫాసిలో ముందంజలో ఉంది.
టాప్ కంపెనీ స్కూటర్లకు పోటీ
125 సీసీ విభాగంలో ఫాసినో 125 ఇతర టాప్ మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ముఖ్యంగా హోండా ఆక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్లకు కొత్త ఫాసినో 125 పోటీగా నిలవనుంది. అయితే దాని ప్రత్యేకమైన స్టైలింగ్, శుద్ధి చేసిన ఇంజిన్, మైలేజ్ కెపాసిటీ యమహా కొత్త ఫాసినో 125ను మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలిపింది.