MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Alcohol Consumption: వామ్మో.. తెలంగాణలో ఇంతమంది మహిళలు మద్యం తాగుతున్నారా? సర్వేలో షాకింగ్ నిజాలు

Alcohol Consumption: వామ్మో.. తెలంగాణలో ఇంతమంది మహిళలు మద్యం తాగుతున్నారా? సర్వేలో షాకింగ్ నిజాలు

Womens Alcohol Consumption: పురుషులు మాత్రమే మద్యం తాగుతారని చాలామంది అనుకుంటారు. కొన్ని చోట్ల మహిళలు కూడా మద్యం తాగుతారు. అది ఆయా ప్రాంతాల సాంప్రదాయం కూడా. అయితే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ఒత్తిడి, కష్టాలు తట్టుకోలేక అధికంగా ఆల్కహాల్ తాగుతారట. ఈ లిస్టులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. మరి ఇక్కడ ఎంతమంది మహిళలు ఆల్కహాల్ తాగుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 16 2025, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సామాజిక కట్టుబాట్లను తెంచుకుంటూ మహిళలు పురుషులకు పోటీగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్న మహిళలు మద్యం తాగడంలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5), 2019-20 డేటా ఆధారంగా మహిళలు ఎక్కువగా మద్యం తాగే ఏడు రాష్ట్రాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మద్యం తాగడం అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో మద్యం తాగడం నిషేధం. అలాగే  రాష్ట్రాల వారీగా ఆల్కహాల్ వినియోగం వేరుగా ఉంటుంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ మంది మహిళలు మద్యపానానికి బానిసలుగా మారుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. దీని ప్రకారం ఏ రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

టాప్ లో అరుణాచల్ ప్రదేశ్ 

మద్యం ఎక్కువగా తాగే మహిళలు ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్‌ టాప్ లో ఉంది. ఇక్కడ 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 26 % మంది మహిళలు మద్యం తాగుతారు. 

సెకెండ్ సిక్కిం

సిక్కింలో 16.2 % మంది మహిళలు మద్యం తాగుతారు. ఈ రాష్ట్రంలో ఇళ్లలోనే మద్యం తయారు చేసుకొని తాగుతారు. ఇది అక్కడ తరతరాలుగా వారసత్వంగా వచ్చిన సంప్రదాయం. 

35

మూడో స్థానంలో అస్సాం

అస్సాంలో 7.3 % మంది మహిళలు మద్యం తాగుతారు. మొదటి రెండు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే అస్సాంలోని గిరిజన సమాజాలు కూడా మద్యం తయారీ, వినియోగాన్ని ఒక సంప్రదాయంగా భావిస్తారు. 

తెలంగాణకు నాలుగో స్థానం

దక్షిణ భారత రాష్ట్రంలో 6.7 % మంది మహిళలు మద్యం తాగుతారు. ఈ రాష్ట్రంలో గ్రామీణ మహిళలు పట్టణ మహిళల కంటే ఎక్కువగా మద్యం తాగుతారు. 

45

జార్ఖండ్

జార్ఖండ్‌లో 6.1 % మంది మహిళలు ఆల్కహాల్ తీసుకుంటారు. ప్రధానంగా గిరిజన సమూహాలకు చెందినవారు, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో ఇక్కడ చాలా మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు.

55

అండమాన్, నికోబార్ దీవులు

ఈ లిస్టులో ఏకైక కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్ దీవులలో 5 % మంది మహిళలు మద్యం తాగుతారు. 

ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 5 % మంది మహిళలు మద్యం తాగుతారు. ఒత్తిడి, మహిళలకు ఉపాధి అవకాశాలు లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువ మంది మహిళలు మద్యానికి బానిసలవుతున్నారు.  

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved