Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • జస్ట్‌ రూ. 20వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల ఆదాయం.. ఖాళీ స్థలం ఉంటే చాలు

జస్ట్‌ రూ. 20వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల ఆదాయం.. ఖాళీ స్థలం ఉంటే చాలు

యువత ఆలోచన మారుతోంది. వ్యాపారం వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. మీరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారా.? అయితే మీకోసం ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : Feb 02 2025, 03:15 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

మార్కెట్‌కి వెళ్లిన వారు ఏవి కొన్ని కొనకపోయినా కచ్చితంగా కొత్తిమీరతో పాటు పుదీనను కొనుగోలు చేస్తుంటారు. ఇంట్లో నాన్‌ వెజ్‌ వండుతుంటే కచ్చితంగా పుదీనా ఉండాల్సిందే. అందుకే పుదీనాకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో పుదీనాకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పుదీనా సాగును చేపడితే లాభాల వర్షం కురవాల్సిందే. ఇంతకీ పుదీనా సాగు ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి కావాలి.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.
 

23
Asianet Image

పుదీనాను సాగు చేయడానికి భూమి తక్కువ ఉన్నా పర్లేదు. పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. పుదీనా కట్టలను తీసుకొని వాటిని కత్తిరించి విత్తనంగా నాటుకోవచ్చు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే దిగుబడి రావడం పుదీనా ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఒక్కసారి పుదీనా మొక్కలను నాటితే దిగుబడి పెరుగుతూనే ఉంటుంది. 5 నుంచి 6 ఏళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. 

ఇక పుదీనా సాగుకు నీరు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. డ్రిప్‌ ద్వారా తక్కువ మొత్తంలో నీటిని అందిస్తే సరిపోతుంది. మూడు రోజులకు ఒకసారి నీటిని అందించినా పర్లేదు. ఇక పెట్టుబడి విషయానికొస్తే భూమిని దున్నడానికి, పశువుల ఎరువులు, ఫర్టిలైజర్స్‌, పుదీనా కాడలు ఇలా అన్ని కలుపుకున్నా రూ. 20వేలు ఉంటే సరిపోతుంది. ఒకవేళ సొంత పొలం లేకపోయినా కౌలుకు తీసుకొని అయినా పుదీనా సాగు ప్రారంభించవచ్చు. 
 

33
Asianet Image

ఆదాయం విషయానికొస్తే.. పుదీనా సాగుతో ప్రతీ రోజూ ఆదాయం ఉంటుంది. మీరే స్వయంగా మార్కెట్‌కి వెళ్లి విక్రయించుకోవచ్చు. లేదంటే మార్కెట్‌లో ఉండే వారికి హోల్‌సేల్‌లో కూడా అమ్ముకోవచ్చు. అద్దెకరంలో పుదీనాను పండించినా తక్కువలో తక్కువ నెలకు రూ. 50 వేల ఆదాయం వస్తుంది. ఇక ఓవైపు పుదీనాను తెంపుతున్నా కొద్దీ మరోవైపు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. 

నోట్: ఈ వివరాలను కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఇప్పటికే ఈ రంగంలో అనుభవం ఉన్న వారిని నేరుగా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించడం ఉత్తమం. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories