RBI: రూ. 500 నోట్లకు సంబంధించి కీలక అప్డేట్... త్వరలోనే సంచలన ప్రకటన
రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిజిటల్ చెల్లింపులు పెంచడం, దొంగ నోట్లను కంట్రోల్ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కొత్తగా రూ. 2 వేల నోట్లు, రూ. 500 నోట్లు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత రూ. 2 వేల నోట్లను కూడా వెనక్కి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కొత్త అందుబాటులోకి వచ్చిన రూ. 500 నోట్లను కేంద్రం రద్దు చేయనుందా.? అంటే కొన్ని పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి. ఆ పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో పెద్ద నోట్లను తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
500 notes
దేశవ్యాప్తంగా ఉన్న ATMలలో పెద్ద నోట్ల ప్రాముఖ్యత తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 2025 నాటికి దేశంలోని 75 శాతం ATMల్లో తప్పనిసరిగా రూ.100, రూ. 200 నోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలతో పాటు, పెద్ద నోట్ల వినియోగాన్ని తగ్గించాలన్న RBI ఉద్దేశ్యం స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ. 2000 నోటును చెలామణి నుంచి పూర్తిగా తొలగించిన నేపథ్యంలో, ఇప్పుడు రూ. 500 నోట్లు కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో రూ. 500 నోట్లను వెనక్కి తీసుకునే ఉద్దేశంలో ఉన్నారా అన్న నుమానాలు వస్తున్నాయి.
ATM
వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు, బ్యాంకింగ్ నిపుణుడు అశ్వనీ రాణా విశ్లేషణ ప్రకారం చిన్న విలువ గల నోట్లను ఎక్కువగా ATMలలో అందుబాటులో ఉంచడం ద్వారా రూ. 500 నోట్లను తగ్గించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నోట్ల ముద్రణ ఖర్చు తగ్గించడానికీ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికీ తోడ్పడుతుంది.
అలాగే, కేంద్ర బ్యాంకు ఇప్పటికే ఈ-రూపీ రూపంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. నగదు వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో, పెద్ద నోట్ల అవసరం తగ్గనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
atm
అయితే రూ. 500 నోట్ల రద్దుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. కానీ తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే మాత్రం పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.