MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మహిళలు మస్ట్ గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకో తెలుసా?

మహిళలు మస్ట్ గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకో తెలుసా?

డబ్బులు పొదుపు చేయడంలో మహిళలు ఎంతో ముందుంటారు.  ఉద్యోగం, బిజినెస్ చేస్తూ కూడా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇంటి అవసరాల కోసం ఎన్నో వస్తువులు కొంటుంటారు. రూపాయి రూపాయి దాస్తుంటారు. వాటిని కూడా కుటుంబం కోసమే ఖర్చుపెడుతుంటారు. అయితే వారి కోసం పొదుపు చేసుకోవాలన్న ఆలోచనపై దృష్టి పెట్టరు. మారిన కాలానికి అనుగుణంగా మహిళలు కూడా కచ్చితంగా డబ్బు పొదుపు చేయాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. డబ్బులు దాచి వస్తువులు కొనడం కంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మంచి రిటర్న్ వస్తాయని చెబుతున్నారు. మహిళలు మ్యూచువల్ ఫండ్స్ లోనే ఎందుకు పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Oct 31 2024, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలు స్మార్ట్ పెట్టుబడుల ద్వారా తమ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవచ్చు. కాని పెట్టుబడులు పెట్టడం తమ పని కాదన్నట్టు ఎక్కువ శాతం మహిళలు భావిస్తుంటారు. డబ్బులు దాయడం, ఇంటి అవసరాలకు ఉపయోగించడం జంట్స్ చేయాల్సిన బాధ్యత అనుకుంటారు. ఈ ఆలోచన ఒకప్పుడు సరైనదే కాని.. ఇప్పుడు కాదు. ప్రస్తుత రోజుల్లో మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రంగాల్లో వారి కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. మహిళలకు తమ వ్యక్తిగతమైన ఆర్థిక భవిష్యత్తును ఏర్పరచుకుంటే అది వారికి, వారి కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ సరైన మార్గం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

LXME, మనీ పవర్ సంస్థలు కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో కేవలం 7% మహిళలు మాత్రమే స్వతంత్రంగా పెట్టుబడులు పెడుతున్నారు. సొంత ఆర్థిక భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. సంపాదన మార్గాల్లో ఉన్న చాలా మంది మహిళలు తమకి వచ్చిన డబ్బులను సొంత అవసరాలు తీర్చుకోవడానికి, వివిధ రకాల వస్తువులు కొనడానికే ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా డ్రెస్సులు, నగలు, అలంకరణ వస్తువులు కొనడానికే ఉపయోగిస్తున్నారట. 

మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు కూడా ఆర్థికంగా స్ట్రాంగ్ గా మారాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ ఫీచర్లు అందించే మ్యూచువల్ ఫండ్స్ మహిళలకు సంపదను నిర్మించడానికి, ఆర్థిక స్వాతంత్య్రానికి సాధించడానికి, వారి కుటుంబాల భద్రతను కాపాడుకోవడానికి మంచి మార్గం అందిస్తాయి. మహిళలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాల్సిన 5 ముఖ్యమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి.

35

వైవిధ్యం(Diversification) 

మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన ప్రయోజనాల్లో డైవర్సిఫికేషన్ ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ సేకరించే సంస్థలు ఎక్కువ మంది పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించి వివిధ ఆస్తులను కొనుగోలు చేస్తాయి. ఇవి రిస్క్‌ను, ట్రెండ్స్‌ను విశ్లేషిస్తూ సేఫ్ గా పెట్టుబడులు పెడతాయి.  ఒక పెట్టుబడి పనితీరు మొత్తం పోర్ట్‌ఫోలియోపై ప్రతికూల ప్రభావం చూపదు. పెట్టుబడుల విషయంలో ఎక్కువగా జాగ్రత్త వహించే మహిళలకు ఇది ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది.
 
వృత్తి నిర్వహణ(Professional Management)

ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఆర్థిక నిపుణులు నిర్వహిస్తారు. వారు మార్కెట్ ట్రెండ్స్‌ను విశ్లేషిస్తారు. రిస్క్‌లను అంచనా వేస్తారు. వివరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి సమయం లేదని, అనుభవం లేదని అనుకొనే మహిళలకు మ్యూచువల్ ఫండ్స్ చక్కటి ఆలోచన. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మహిళలు వారి ఆర్థిక ప్రయాణాన్ని నిపుణుల సలహాలతో ముందుకు తీసుకెళ్లవచ్చు.

45

సౌలభ్యం(Flexibility)

మహిళల ఆర్థిక అవసరాలు విభిన్నంగా ఉంటాయి. ఇంటిని కొనడానికి, చదువు కోసం, పదవీ విరమణ తర్వాత ఉపయోగపడాలని పొదుపు చేయాలనుకుంటారు. ఇలాంటి ఆలోచనలకు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఆప్షన్ అవుతుంది. సేఫ్ గా పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్‌లను తీర్చగల సామర్థ్యం ఉంటుంది. ఇది మహిళలకు వారి వ్యక్తిగత అవసరాలు, ఆకాంక్షలకు సరిపోయే ఫండ్స్‌ని అందిస్తుంది. 

దీర్ఘకాల వృద్ధి సామర్థ్యం(Long-Term Growth Potential) 

రికార్డ్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళలు క్రమం తప్పకుండా, వారి కెరీర్ ప్రారంభంలోనే పెట్టుబడి పెడితే కౌంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా సంపదను గణనీయంగా పెంచుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో సంపదను పెంచడమే లక్ష్యం అయితే ఈక్విటీ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక. లేదా మీ సేఫ్టీ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే డెట్ స్కీమ్స్ మీకు మంచి రిటర్స్ ఇస్తాయి. మీకు రిస్క్ తీసుకొనే ధైర్యం ఉంటే ఈక్విటీ, డెట్ మిశ్రమం అయిన హైబ్రిడ్ స్కీమ్స్‌ని కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. 

55

మ్యూచువల్ ఫండ్(Mutual Fund)

మ్యూచువల్ ఫండ్స్  (SIP) మహిళలకు అనేక ఆకర్షణీయ స్కీమ్స్ అందిస్తాయి. SIPతో మహిళలు కేవలం రూ.500తో నెలవారీగా పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీని ద్వారా పెద్ద మొత్తం అవసరం లేకుండా రెగ్యులర్ గా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొనటానికి SIPలు అందించే రూపాయి-ఖర్చు సగటు (rupee-cost averaging) సహాయపడుతుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
3rd TEST • SA vs AUS
Lunch
SASA
(75.0 ov) 329 & 202/5
AUSAUS
429
Day 4 - Session 1
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Phonepe: 11 రూపాయ‌ల‌తో రూ. 25 వేల హెల్త్ పాల‌సీ.. ఫోన్‌పేలో అదిరిపోయే ఆఫర్
Recommended image2
Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !
Recommended image3
PM kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలో పడలేదా? రైతులు వెంటనే చేయాల్సిన పనులివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved