Clocks: ప్రతి కొత్త గడియారంలో టైమ్ 10-10 ఉంటుంది.. ఎందుకో తెలుసా?
Clocks: మీరు కొత్త వాచ్ కొన్నా, కొత్త గడియారం కొన్నా అందులో స్టార్టింగ్ టైమ్ 10-10 ఎందుకు చూపిస్తుందో తెలుసా? ఈ విషయంపై ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తగా వాల్ క్లాక్ కొనాలని మీరు షాప్ కి వెళ్లారనుకోండి. అక్కడ కనిపించే కొత్త గడియారాలన్నీ ఒకే టైమ్ చూపిస్తాయి. అదే 10-10. అంతే కదా.. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి గడియారం ఇలా 10-10 టైమ్ మాత్రమే ఎందుకు చూపిస్తోందని? దీనికి చాలా మంది చాలా కారణాలు చెబుతారు. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. సాధారణంగా 10-10 అనేది చాలా మంచి సమయం. అందుకే ఆ టైమ్ నే ప్రతి గడియారంలో సెట్ చేసి ఉంచుతారని చాలా మంది అనుకుంటారు.
అలాగే మొదటిసారి గడియారం సక్సెస్‌ఫుల్ గా రెడీ అయ్యే సరికి కరెక్ట్ గా టైమ్ 10-10 అయ్యిందని, అందుకే ప్రతీ కొత్త గడియారంలోనూ అదే టైమ్ సెట్ చేసి ఉంటుందని అనుకుంటారు.
ఇవన్నీ ఊహాతీతమైన కథనాలు మాత్రమే. అసలు గడియారంలో 10-10 టైమ్ ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన బిజినెస్ కోణాలు ఉన్నాయి.
గడియారంలో 10-10 టైమ్ లో కనిపించే పెద్ద ముల్లు, చిన్న ముల్లు విక్టరీ సింబల్ ని చూపిస్తాయి. అంటే V షేప్ లో ఉంటాయి. V షేప్ అయితే చిన్న ముల్లు 10 దగ్గర పెద్ద ముల్లు 2 దగ్గరే ఎందుకుండాలి? 11 దగ్గర, 1 దగ్గర ఉండొచ్చు కదా? దీనికి ఓ ప్రత్యేక కారణముంది.
చాలా గడియారాలు 10-10 టైమ్ చూపించే రెండు పాయింటర్స్ మధ్య ఆ వాచ్ లేదా క్లాక్ తయారు చేసిన కంపెనీ పేరు ఉంటుంది. ఆ పేరు క్లియర్ గా కనిపించాలని ఈ రెండు పాయింటర్స్ మధ్య అంత గ్యాప్ ఉంచుతారు.
ఇంకో కారణమేంటంటే.. ప్రతి కొత్త గడియారంలో రెండు ముళ్లు స్మైలీ సింబల్ ని చూపిస్తాయి. ఇది గడియారం కొనాలని వచ్చిన కస్టమర్ ని ఆకర్షిస్తుంది. అదే గాని రెండు పాయింటర్స్ డౌన్ గా ఉన్నా, పైకి ఉన్నా పెద్దగా ఆకర్షణీయంగా ఉండవు. అదే స్మైలీ షేప్ లో ఉండటం వల్ల చూడగానే కంపెనీ పేరు కూడా అక్కడే కనిపిస్తుంది. దీంతో ఆటోమెటిక్ గా గడియారం కొనాలన్న ఆలోచన కలుగుతుంది. ఇవి కొత్త గడియారంలో పెద్ద ముల్లు, చిన్న ముల్లు మధ్య ఉన్న స్టోరీ.