- Home
- Business
- Gold Price: మన దేశంలో బంగారం ఏ రాష్ట్రంలో చాలా చవకగా లభిస్తుందో తెలుసా..తెలిస్తే మహిళలు అక్కడికే వెళ్తారు..
Gold Price: మన దేశంలో బంగారం ఏ రాష్ట్రంలో చాలా చవకగా లభిస్తుందో తెలుసా..తెలిస్తే మహిళలు అక్కడికే వెళ్తారు..
మన దేశంలో బంగారానికి ఉన్నంత డిమాండ్ మరే ఇతర లోహానికి లేదు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఆభరణాల కోసం మహిళలు నిత్యం కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు ఫిజికల్ రూపంలో మన దేశంలో అత్యధికంగా బంగారం వినియోగిస్తారు. అయితే మనదేశంలో అత్యంత తక్కువ ధరకు బంగారం ఏ నగరంలో, ఏరాష్ట్రంలో లభిస్తోందో తెలుసుకుందాం.

బంగారం ధర ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతుంది. కాస్త హెచ్చుతగ్గులతో సుమారు ఒకే రకంగా ఉన్నప్పటికీ, భారతదేశంలోని కొన్ని నగరాల్లో చౌకగా బంగారం లభిస్తుంది. ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కాస్త తక్కువ ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
ఇక విదేశాల విషయానికి వస్దుతే దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత చవకైన బంగారం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ బంగారం నాణ్యత కూడా చాలా బాగుంది.దుబాయ్‌లో ఉన్న దీరా సిటీ సెంటర్‌లో బంగారం కొనడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన బంగారం ఇక్కడ దొరుకుతుంది. భారత్‌తో సహా చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర 15 శాతం కంటే తక్కువ..
దేశంలోనే అత్యంత చవకైన బంగారం కేరళలో లభిస్తుంది. దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో, పశ్చిమ, ఉత్తర భారతదేశంతో పోలిస్తే బంగారం ధర తక్కువగానే ఉంది. కేరళ తర్వాత కర్ణాటకలో బంగారం చౌకగా ఉంది. అలాగే దక్షిణ భారత నగరాల్లో పలు నగరాల్లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బెంగళూరు, మైసూరు, మంగళూరులో దేశ వ్యాప్త ధరల కన్నా తక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తర భారత్ లోని పలు నగరాలతో పోల్చితే విజయవాడ, మదురై, చెన్నైలలో ధర తక్కువగా ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేస్తుంటే, ముందుగా ఆ నగరంలో బంగారం ధరను తెలుసుకోండి. ఆ తర్వాత దాని స్వచ్ఛతను తనిఖీ చేయండి.
ఇక ఉత్తర భారతదేశంలోని నగరాల గురించి మాట్లాడినట్లయితే, ఢిల్లీ బులియన్ మార్కెట్ కన్నా ముంబైలో కాస్త తక్కువగా ఉంటుంది. అయితే లక్నో, జైపూర్‌లలో దేశంలోనే అత్యధిక స్థాయిలో రేటు పలుకుతుంది.
ముంబై, కేరళలో బంగారం ధరలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసానికి ఓ కారణం ఉంది. బంగారం ధరలలో వ్యత్యాసానికి ప్రధాన కారణం- భారతదేశంలోని ప్రతి నగరంలో బంగారం ధర ఒకేలా ఉండదు. దేశంలోని వివిధ బులియన్ మార్కెట్‌లలో 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల బంగారం ధర మారుతూ ఉంటుంది. దీనికి అతి పెద్ద కారణం రాష్ట్ర ప్రభుత్వాలు బంగారంపై విధించే స్థానిక పన్ను, ఇది ప్రతి రాష్ట్రంలో భిన్నంగా ఉంటుంది.
ఇది కాకుండా, స్థానిక బులియన్ అసోసియేషన్ తన తరపున బంగారం ధరను కూడా నిర్ణయిస్తుంది. దీని కారణంగా బంగారం ధర నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, బంగారం ధరలను ప్రతిరోజూ రెండుసార్లు సవరిస్తారు. దీని కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ధరల ట్రెండ్ ను అనుసరిస్తుంది.