MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు

Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు

Condoms: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాను అరికట్టడం కోసం ఎన్నో కుటుంబ నియంత్రణ పద్ధతులు వచ్చాయి. అందులో కండోమ్ వాడకం కూడా ఒకటి. ఇది లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే ఆసియా దేశాల్లో అత్యధికంగా వాడుతున్న దేశమేదో తెలుసా? 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 09 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెరుగుతున్న కండోమ్ వాడకం
Image Credit : Getty

పెరుగుతున్న కండోమ్ వాడకం

పెరుగుతున్న జనాభాను అరికట్టాలంటే, అవాంఛిత గర్భాలు రాకుండా అడ్డుకోవాలి. అందుకు కండోమ్ లు వాడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, లైంగిక వ్యాధులు రాకుండా అడ్డుకోవడానికి కండోమ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ఆసియా దేశాల్లో గణనీయంగా వీటి వాడకం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం ఆసియాలో కండోమ్ వినియోగంలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు కండోమ్ పరిశ్రమ అక్కడ బిలియన్ డాలర్ల విలువైన భారీ పరిశ్రమగా మారిపోయింది. చైనాలో ప్రతి సంవత్సరం సుమారు 5.8 బిలియన్ కండోమ్‌లు వినియోగంలో ఉంటాయి. అంటే ఆసియా మొత్తం లో 40 శాతం కంటే ఎక్కువ కండోమ్‌లను చైనాలోనే వాడుతున్నారు.

24
మన దేశంలో ఏటా ఎన్ని వాడుతున్నారు?
Image Credit : Getty

మన దేశంలో ఏటా ఎన్ని వాడుతున్నారు?

కండోమ్‌ల వాడకంలో మన దేశమేమీ తక్కువ తినలేదు... చైనాతో పోటీ పడుతున్నట్టే కనిపిస్తోంది. భారత్ లో సుమారు 2.4 బిలియన్ యూనిట్ల కండోమ్‌లు ప్రతి ఏడాది వినియోగిస్తున్నట్టు అంచనా. చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక టర్కీ మూడో స్థానంలో నిలిచింది. ఆసియాలో కండోమ్ పరిశ్రమలే మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఎదుగుతున్నాయి. కండోమ్ మార్కెట్ విపరీతంగా చైనాలో, భారత్ లో పెరగడానికి కారణం ఇక్కడ ఉన్న భారీ జనాభానే. కోట్లాదిమంది లైంగికంగా చురుకుగా ఉండటం, సురక్షిత లైంగిక జీవన విధానాన్ని కోరుకోవడం వల్ల ఇలా కండోమ్‌ల వినియోగం విపరీతంగా పెరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి.

Related Articles

Related image1
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Related image2
Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని, గోల్డ్ తీసుకెళ్లేందుకు సొంత ఎయిర్ పోర్టు కూడా
34
అవగాహన లేక వాడడం లేదు
Image Credit : Getty

అవగాహన లేక వాడడం లేదు

భారత్ లో కండోమ్ మార్కెట్ పెద్దదిగా ఉన్నప్పటికీ దాన్ని వినియోగించే విషయంలో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. కొన్ని రిపోర్ట్ లు చెబుతున్న ప్రకారం భారత్‌లో పురుషుల్లో కండోమ్ వినియోగం సుమారు 10 శాతం మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై అవగాహన చాలా తక్కువగా ఉండటం వల్ల వీటి వినియోగం ఆయా ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కండోమ్ వినియోగించడం చాలా ముఖ్యమని వారికి అర్థమయ్యేలా తెలియజేయడం అవసరం. ఎందుకంటే అవాంఛిత గర్భధారణను అలాగే హెచ్ఐవి వంటి లైంగిక వ్యాధులను అడ్డుకోవడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి.

44
భారత్ లో ఇదే పెద్ద పరిశ్రమ
Image Credit : Getty

భారత్ లో ఇదే పెద్ద పరిశ్రమ

ఇక పరిశ్రమ పరంగా చూస్తే భారత్ ప్రభుత్వ రంగ సంస్థ అయినా హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ చేయడానికి కోట్ల సంఖ్యలో కండోమ్ లను తయారు చేస్తూ ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారుగా నిలిచింది. ఇది ఆరోగ్య పరిరక్షణకే కాదు.. భారీ వ్యాపార రంగంగా కూడా మారింది. జనాభాని కంట్రోల్ చేసేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆసియా దేశాల్లో ఈ మార్కెట్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image2
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Recommended image3
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Related Stories
Recommended image1
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Recommended image2
Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని, గోల్డ్ తీసుకెళ్లేందుకు సొంత ఎయిర్ పోర్టు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved