MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని, గోల్డ్ తీసుకెళ్లేందుకు సొంత ఎయిర్ పోర్టు కూడా

Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని, గోల్డ్ తీసుకెళ్లేందుకు సొంత ఎయిర్ పోర్టు కూడా

Gold Mine: ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గని ఒకటుంది. అక్కడ్నించి ఏటా 52 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ గని నుంచి వెలికితీసిన బంగారాన్ని తీసుకెళ్లేందుకు సొంతంగా ఒక విమానాశ్రయం కూడా ఉంది. ఈ బంగారు గని ఎక్కడుందో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 09 2026, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని
Image Credit : x

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని

ప్రపంచంలోనే అతిపెద్ద, సంపన్నమైన బంగారు గని  ఈ భూమిపైనే ఉంది. దాని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఎన్నో దేశాల్లోని మహిళలు అక్కడ నుంచి వచ్చిన బంగారు ఆభరణాలను ధరిస్తున్నారు. ఈ బంగారు గని ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఉంది. దీని పేరు గ్రాస్‌బెర్గ్ గని. ఈ గని ఏటా సుమారు 52 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. బంగారంతో పాటు ఇక్కడ రాగి కూడా ఉత్పత్తి చేస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాగి గనులలో ఒకటిగా కూడా పేరు తెచ్చుకుంది.

ఎత్తయిన పర్వతాలు, అడవులతో నిండిన ఈ ప్రాంతంలో ఉన్న గని భూమిలో దాగి ఉన్న అపార సంపదకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బంగారం, రాగితో పాటూ వెండి కూడా దొరుకుతుంది. ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో విలువైన ఖనిజాలు లభించడం చాలా అరుదు. అందుకే ఈ గనిని ప్రపంచ ఖనిజ పరిశ్రమలో ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు.

23
సొంత విమానాశ్రయం
Image Credit : GOOGLE

సొంత విమానాశ్రయం

గ్రాస్‌బెర్గ్ గని నుంచి వెలికితీసే ఖనిజంలో బంగారం, రాగి, వెండి  అధికంగా తీస్తారు.  పపువాలోని ఎత్తయిన పర్వతం పున్‌కాక్ జయ. దీనికి సమీపంలోనే ఈ గని ఉంది. టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ప్రాంతం మొత్తం ఏర్పడింది. ఈ భారీ గనిలో సుమారు 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ గనికి సొంతంగా విమానాశ్రయం, ఓడరేవు కూడా ఉన్నాయి. ఇక్కడ్నించి బంగారాన్ని, వెండిని,  రాగిని తరలించాలంటే ఇలాంటి రవాణా సదుపాయాలు చాలా అవసరం.  అంతేకాదు ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులను కూడా నిర్మించారు. 

గ్రాస్‌బెర్గ్ గని చరిత్ర చూస్తే 1936లో దీన్ని మొదటిసారి కనిపెట్టినట్టు చెబుతారు. డచ్ దేశానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డోజీ ఇక్కడి ఖనిజ నిక్షేపాలను మొదటిసారి కనుగొన్నారు. 1960లలో ఫ్రీపోర్ట్మె క్‌మొరాన్ అనే సంస్థ ఇక్కడ ఖనిజాలు తవ్వేందుకు లైసెన్స్ పొందింది. 2023లో ఈ గని నుంచి ఏకంగా 52.9 టన్నుల బంగారం, 6,80,000 టన్నుల రాగి, 190 టన్నుల వెండిని వెలికి తీశార.

Related Articles

Related image1
Guava Seeds: జామకాయ గింజలను తింటే నిజంగానే కడుపునొప్పి వస్తుందా? ఎవరు తినకూడదు?
Related image2
Name Astrology: A అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే
33
బంగారం రేటు తగ్గదు
Image Credit : Getty

బంగారం రేటు తగ్గదు

గ్రాస్‌బెర్గ్ గని కేవలం బంగారానికే ప్రసిద్ధి కాదు. అక్కడ ఉండే జీవ వైవిధ్యం కూడా ఎక్కువ. గని చాలా దూర ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ పనిచేసే వేలాది మంది ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రహదారులు, విద్యుత్ కేంద్రాలు పనిచేస్తాయి. అక్కడ ఉన్న గని చుట్టూ పూర్తిగా ఒక చిన్న పట్టణం ఏర్పడింది. అక్కడ పనిచేసే కార్మికులు, ఇంజినీర్లు, సిబ్బంది కలిసి ఒక పెద్ద సమాజంలా జీవిస్తున్నారు. ఈ గనిలో ఉత్పత్తి అయ్యే రాగి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ తీగలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, పునరుత్పత్తి శక్తి పరికరాల్లో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ గని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఒక సమయంలో ఉత్పత్తి తగ్గినా, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ గని ఎంత బంగారాన్ని ఇచ్చినా కూడా బంగారం రేట్లపై మాత్రం ఆ ప్రభావం పడదు. అది మాత్రం అంతర్జాతీయ పరిస్థితులపై, డాలర్ విలువపై ఆధారపడి ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంగారం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్క రోజులో రూ. 11 వేలకుపైగా లాభం.. ఈ షేర్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..
Recommended image2
రూ. 25 వేలు పెట్టుబడి 25 సంవత్సరాలు పెడితే.. ఎన్ని కోట్ల రాబడి వస్తుందంటే.?
Recommended image3
Personal Loan: పర్సనల్ లోన్ త్వరగా తీరిపోవాలంటే ఇలా చేయండి
Related Stories
Recommended image1
Guava Seeds: జామకాయ గింజలను తింటే నిజంగానే కడుపునొప్పి వస్తుందా? ఎవరు తినకూడదు?
Recommended image2
Name Astrology: A అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved