హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు చివరగా జరిగింది ఆ దేశంలోనే..
హమ్మయ్యా.. మ్యాజికల్ నంబర్ 2025 సంవత్సరంలోకి ఎట్టకేలకు అడుగుపెట్టేశాం. ప్రపంచమంతా 2025 సంవత్సరానికి ధూమ్‌ధాం గా స్వాగతం చెప్పేసింది. అయితే ఈ భూమి మీద నూతన సంవత్సర వేడుకలు మొదట ఏ దేశంలో జరిగాయి. చివరగా ఏ దేశంలో వేడుకలు చేశారో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకుందా రండి.
2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు డిసెంబర్ 31 అర్ధరాత్రి ఉత్సాహంగా వేడుకలు చేశాయి. టపాసులు, బాణసంచా కాలుస్తూ ఆనందోత్సాహాల మధ్య 2024కు గుడ్ బై చెబుతూ 2025ను స్వాగతిస్తూ వేడుకలు చేశారు. కేకులు కట్ చేసి పంచుకున్నారు.
ప్రతి ఏడాది ప్రారంభం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో జరుగుతుంది. భూ భ్రమణం, వేర్వేరు టైమ్ జోన్స్ వల్ల ప్రతి దేశంలోనూ వేర్వేరు సమయాల్లో నూతన సంవత్సరం ప్రారంభమవుతాయి. 2025 సంవత్సరం కూడా వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో నిర్వహించారు.
స్వాగతం పలికే దేశం
2025 సంవత్సరం స్వాగత వేడుకలు మొదట జరిగిన దేశం పేరు కిరిబాటి రిపబ్లిక్‌లోని క్రిస్మస్ ద్వీపం (కిరిటిమాటి). ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వాత న్యూజిలాండ్‌లోని చాథమ్ ద్వీప ప్రజలు 3.45 గంటలకు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరాలైన ఆక్లాండ్, వెల్లింగ్టన్ లలో సాయంత్రం 4.30 గంటలకు నూతన సంవత్సరం ప్రారంభమైంది.
పసిఫిక్ ప్రాంతంలో టోంగా, సమోవా, ఫిజి కలిసి ఉత్సాహంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాయి. న్యూజిలాండ్‌లో నూతన సంవత్సరం ప్రారంభమైన కొద్ది నిమిషాల తర్వాత ఈ దేశాల్లో వేడుకలు జరిగాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్ వంటి నగరాల తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్బెర్రా న్యూ ఇయర్ వేడుకలు చేశారు. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31 రాత్రి 7.30 గంటలకు అక్కడ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు.
జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలో డిసెంబర్ 31 రాత్రి 8.30 గంటలకు నూతన సంవత్సర వేడుకలను ప్రారంభమయ్యాయి. చైనా, ఫిలిప్పీన్స్, సింగపూర్‌లో అర్ధరాత్రి సమీపిస్తున్న కొద్దీ నూతన సంవత్సర వేడుకలు ప్రారంభించారు. తర్వాత ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో కొత్త సంవత్సరం ప్రారంభమైంది.
బంగ్లాదేశ్, నేపాల్ లో కొత్త ఏడాది స్వాగత వేడుకల తర్వాత భారతదేశం, శ్రీలంకలో నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా ఆహ్వానించారు. ఇక్కడ జరిగిన కొద్దిసేపటి తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో వేడుకలు జరిగాయి.
చివరి దేశం ఇదే..
నూతన సంవత్సరానికి చివరిగా స్వాగతం పలికే దేశం బేకర్, హౌలాండ్ ద్వీపాలు. ఇవి హవాయికి నైరుతి దిశలో ఉన్నాయి. 2025 సంవత్సరాన్ని చివరిగా వేడుక చేసుకునేవి ఈ ద్వీపాలే. భారత కాలమానం ప్రకారం జనవరి 1న సాయంత్రం 5.30 గంటలకు ఇక్కడ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి