Spiritual
సగటు ఉష్ణోగ్రత: 167°C
ఇది సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం. దీనికి ఉపగ్రహాలు లేవు. సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది.
సగటు ఉష్ణోగ్రత: 464°C
అత్యంత వేడి, ప్రకాశవంతమైన గ్రహం ఇది. దీనికి కూడా ఉపగ్రహాలు లేవు. తూర్పు నుంచి పడమరకు తిరగడం దీని ప్రత్యేకత. దీని పరిభ్రమణ కాలం 225 రోజులు.
సగటు ఉష్ణోగ్రత: 15°C
సౌర కుటుంబంలోనే ప్రత్యేకమైన గ్రహం. జీవి మనుగడ సాగించే ఏకైక ప్లానెట్. భూమిపై ఉన్న నేల, నీటి వల్ల కాంతి పరావర్తనం చెంది భూమి నీలి, ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
సగటు ఉష్ణోగ్రత: -65°C
ఇది ఎరుపురంగులో కనపడటంతో దీన్ని ‘అరుణ గ్రహం’ అంటారు. దీనికి రెండు ఉపగ్రహాలు ఉంటాయి. దీని పరిభ్రమణ కాలం 687 రోజులు.
సగటు ఉష్ణోగ్రత: -110°C
సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఇది. భూమితో పోలిస్తే 1300 రెట్లు పెద్దది. దీనికి 50 ఉపగ్రహాలున్నాయి. దీని పరిభ్రమణ కాలం12 సంవత్సరాలు.
సగటు ఉష్ణోగ్రత: -140°C
ఇది పసుపురంగులో కనిపించే గ్రహం. దీనికి మొత్తం 53 ఉపగ్రహాలుంటాయి. వలయాలు ఉండటం దీని ప్రత్యేకత. ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 29.5 సంవత్సరాలు పడుతుంది.
సగటు ఉష్ణోగ్రత: -195°C
యురేనస్ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. ఇది నీలం-ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని అక్షం వంగి ఉంటుంది. అందువల్ల అది దొర్లుతూ తిరిగినట్లు కనిపిస్తుంది.
సగటు ఉష్ణోగ్రత: -200°C
సౌర కుటుంబంలో అతి చల్లని గ్రహం ఇది. 13 ఉపగ్రహాలతో కలిపి సూర్యుని చుట్టూ తిరగడానికి దీనికి 165 సంవత్సరాలు పడుతుంది.