MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాంక్ లాకర్ కీ పోగొట్టుకుంటే ఏం చేయాలి.? దాన్ని పగలగొట్టొచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..

బ్యాంక్ లాకర్ కీ పోగొట్టుకుంటే ఏం చేయాలి.? దాన్ని పగలగొట్టొచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..

Bank Locker: కొందరు బంగారం, ఆభరణాలు లాంటి విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచుతారు. లాకర్ కోసం డబుల్ కీలు ఉంటాయి. ఒక కీని బ్యాంకు ఉంచుకుంటుంది. మరొక కీని కస్టమర్‌కు ఇస్తుంది. ఒక కీ పోతే, లాకర్ తెరవలేం. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 03 2026, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లాకర్ కీని పోగొట్టుకుంటే
Image Credit : Bank Locker\Twitter

లాకర్ కీని పోగొట్టుకుంటే

చాలామంది విలువైన బంగారు ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను బ్యాంకు లాకర్లలో ఉంచుతారు. ఎందుకంటే అవి ఇంట్లో ఉంచితే ఎక్కడ దొంగలిస్తారా అని భయం. ఒక కస్టమర్ తమ లాకర్ కీని పోగొట్టుకుంటే ఏమి జరుగుతుంది.? బ్యాంకు వద్ద డూప్లికేట్ కీ ఉందా.? లాకర్ తెరిచే ప్రక్రియ ఏమిటి మొదలైనవి ఇక్కడ చూసేద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాంకు లాకర్లకు రెండు కీలు
Image Credit : Gemini AI

బ్యాంకు లాకర్లకు రెండు కీలు

బ్యాంకు లాకర్లకు రెండు కీలు ఉంటాయి. ఒక కీ కస్టమర్‌కు ఇస్తారు. మరొక కీ బ్యాంకులో ఉంటుంది. ఈ రెండు కీలు భిన్నంగా ఉంటాయి. లాకర్‌ను తెరవడానికి ఈ రెండు కీలు అవసరం. ఒకే కీ లాకర్‌ను తెరవలేరు. అందువల్ల, ఒక కస్టమర్ కీని పోగొట్టుకున్నప్పుడు, దానిని తెరవడానికి ఏకైక మార్గం లాకర్‌ను పగలగొట్టడం. మరి అది ఎలా..

35
లాకర్ కీని పోగొట్టుకున్నప్పుడు
Image Credit : vectorpocket@freepik

లాకర్ కీని పోగొట్టుకున్నప్పుడు

ముందుగా, మీరు మీ లాకర్ కీని పోగొట్టుకున్నప్పుడు, మీరు వెంటనే ఆ బ్యాంకు శాఖకు వెళ్లి అధికారికంగా లెటర్ ఇవ్వాలి. మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, లాకర్ కీ దొంగలించారని ఫిర్యాదు చేయాలి. దాని కాపీని తీసుకోవాలి. తరువాత, బ్యాంకుకు వెళ్లి, లాకర్ కీ పోయిందని పేర్కొంటూ బ్యాంకులో పోలీసులకు ఫిర్యాదు చేసిన లెటర్ సబ్మిట్ చేయాలి.

45
అండర్ టేకింగ్ పొందవచ్చు
Image Credit : instagram

అండర్ టేకింగ్ పొందవచ్చు

బ్యాంకు మీ నుంచి ఒక అండర్ టేకింగ్ పొందవచ్చు. పోలీసు ఫిర్యాదుతో పాటు, బ్యాంకు ఆధార్, పాన్ కార్డ్ లాంటి పత్రాలను కూడా అడగవచ్చు. ఉమ్మడి ఖాతా అయితే, ఖాతాదారులందరూ బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదుపై సంతకం చేయాలి. దీని తరువాత, లాకర్‌ను బద్దలు కొట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పనికి బ్యాంకు ఒక సమయాన్ని నిర్దేశిస్తుంది.

55
అన్ని ఖర్చులను..
Image Credit : our own

అన్ని ఖర్చులను..

ఆ సమయంలో, ఖాతాదారుడు లేదా ఖాతాదారులు తప్పనిసరిగా వెళ్లాలి. ఖాతాదారుడు, బ్యాంకు అధికారి సమక్షంలో ఒక నిపుణుడు లాకర్‌ను బద్దలు కొడతాడు. తరువాత, ఒక కొత్త లాకర్‌ను ఇన్‌స్టాల్ చేసి, కస్టమర్‌కు కొత్త కీని ఇస్తారు. బ్యాంకు లాకర్‌ను పగలగొట్టడం నుంచి కొత్త లాకర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వరకు అన్ని ఖర్చులను కస్టమర్ భరించాల్సి ఉంటుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image2
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Recommended image3
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Related Stories
Recommended image1
Business Ideas: రూ. 10 లక్షల పెట్టుబడితో.. ప్రతీ నెలా రూ. 1 లక్ష రాబడి.. డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది
Recommended image2
Business Idea: ఉన్న ఊరులోనే నెలకు రూ. 20 వేల సంపాదన.! ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. మీరూ చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved