- Home
- Business
- Business Idea: ఉన్న ఊరులోనే నెలకు రూ. 20 వేల సంపాదన.! ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. మీరూ చూసేయండి
Business Idea: ఉన్న ఊరులోనే నెలకు రూ. 20 వేల సంపాదన.! ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. మీరూ చూసేయండి
Post Office: పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ 2.0 స్కీమ్‌తో నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ సంపాదించే అవకాశం పొందండి. కేవలం రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌తో మీ సొంత పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించండిలా.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్
కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ 2.0ని ప్రారంభించింది. ఈ స్కీమ్ జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా కేవలం రూ. 5 వేల నుంచి రూ. 10 వేల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌తో సొంత పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించి, నెలకు రూ. 20 వేళా కంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది.
BSNL సహకారం..
ఈ ఫ్రాంచైజీ ద్వారా పోస్టల్ స్టాంప్‌ల అమ్మకం, స్పీడ్ పోస్ట్ బుకింగ్, ఈ-కామర్స్ పార్శిల్ సేవలు, ఆర్థిక, చెల్లింపు సేవలను అందించవచ్చు. APT 2.0 (అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0), మేఘరాజ్ 2.0 క్లౌడ్ సేవలను ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు, QR కోడ్ స్కాన్‌లు, OTP-ఆధారిత అథంటికేషన్‌లను సులభంగా నిర్వహించవచ్చు. BSNL ఈ సాంకేతిక మౌలిక సదుపాయాలకు పూర్తి సహకారం అందిస్తుంది.
ఈ ప్రాంతాల్లో..
ఈ సేవలు గ్రామీణ, పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాలతో పాటు ఇండస్ట్రీలు, విద్యా సంస్థల్లో కూడా ప్రారంభించవచ్చు. 10వ తరగతి (పార్శిల్ డెలివరీకి) లేదా 12వ తరగతి (పూర్తి సేవలకు) ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాషపై పట్టు, పాన్ కార్డు, వాహన లైసెన్స్ లాంటి అవసరమవుతాయి. వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఏమి లేదు.
అర్హతలు ఇవే..
సొంత స్థలం అవసరం లేదు, అద్దె లేదా లీజు స్థలంలో కూడా ప్రారంభించవచ్చు. ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, ప్రింటర్, బార్‌కోడ్ స్కానర్ లాంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరి. దరఖాస్తు చేయడానికి, స్థానిక పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించి ఫారం-ఏను నింపి డివిజనల్ హెడ్‌కు సమర్పించాలి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంపికైన ఫ్రాంచైజీలకు శిక్షణ కూడా అందిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీతో..
ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీతో నెలకు కనీసం రూ. 20 వేలు సంపాదించవచ్చు. మీరు అందించే సేవలు, అమ్మకాలపై 7 శాతం నుంచి 25 శాతం వరకు కమిషన్ లభిస్తుంది. ఉదాహరణకు ఒక నెలలో లక్ష రూపాయల విలువైన స్పీడ్ పోస్ట్ సేవలు అందిస్తే రూ. 10 వేలు(10 శాతం కమిషన్ అనుకుంటే) వస్తుంది. 1500 రిజిస్టర్డ్ లెటర్లపై ఒక్కోదానికి రూ. 3 చొప్పున రూ. 4,500.. 600 మనీ ఆర్డర్లపై ఒక్కోదానికి రూ. 5 చొప్పున రూ. 3 వేలు.. ఇలా మీకు చక్కటి రాబడి లభిస్తుంది.

