MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • 500 రూపాయల నోట్లను ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే... ఏం జరుగుతుంది?

500 రూపాయల నోట్లను ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే... ఏం జరుగుతుంది?

రూ.500 నోట్ల రద్దుపై మరోసారి ప్రచారం జోరందుకుంది. ఇది నిజంగా జరిగితే ఆర్బిఐ, బ్యాంకులు, ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 01 2025, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రూ.500 నోట్లను రద్దు చేస్తారా?
Image Credit : Reddit

రూ.500 నోట్లను రద్దు చేస్తారా?

Demonetization : భారతదేశంలో మోదీ సర్కార్ మొదటిసారి అధికారాన్ని చేపట్టిన రోజులవి. ఓరోజు హటాత్తుగా ప్రధాని మోదీ మీడియా ముందుకు వచ్చి షాకింగ్ ప్రకటన చేశారు. 2016 నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు... అర్ధరాత్రి నుండి రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని బాంబు పేల్చారు. పాతనోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 కరెన్సీ నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చారు.ఆనాడు ఈ నోట్లరద్దు వల్ల చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ ఇంకా గుర్తుండే ఉంటాయి.

అయితే పాతనోట్ల స్థానంలో తీసుకువచ్చిన రూ.2000 నోట్లను కూడా 2023 మే 19న చెలామణి నుండి ఉపసంహరించుకుంది కేంద్రం. బ్యాంకుల ద్వారా ఈ 2000 కరెన్సీ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా రూ.500 కరెన్సీ నోట్లను కూడా కేంద్రం చెలామణి నుండి తప్పించే ప్రయత్నం చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఇటీవల దేశంలోని బ్యాంకులకు రూ.200, రూ.100 కరెన్సీ నోట్ల వాడకాన్ని పెంచాలని... ప్రజల్లోకి ఇవి ఎక్కువగా వెళ్లేలా చూడాలని సూచించింది. దీంతో రూ.500 నోట్లను కూడా చెలామణిలోంచి తప్పించేందుకు కేంద్రం సిద్దమైందని... అందుకే చిన్ననోట్ల చెలామణిని పెంచాలని ఆర్బిఐ ద్వారా ఆదేశాలు ఇప్పించిందని ప్రచారం జోరందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రూ.500 నోట్లపై చంద్రబాబు కామెంట్స్
Image Credit : ANI

రూ.500 నోట్లపై చంద్రబాబు కామెంట్స్

ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రూ.500 నోట్లను కూడా రద్దుచేస్తే బాగుంటుందని బహిరంగంగానే మాట్లాడారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయనకు ఏదయినా సమాచారం ఉండే ఈ కామెంట్స్ చేసివుంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలా చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ఈ రూ.500 నోట్ల రద్దు ప్రచారానికి మరో కారణం.

ఇలా కారణాలు ఏవయినా రూ.500 నోట్లపై ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. ఆర్బిఐ అలాంటి రూ.500 నోట్లను రద్దుచేసే లేదా చెలామణి నుండి తప్పించే ఆలోచనేమీ లేదని చెబుతున్న ఈ ప్రచారానికి తెరపడటం లేదు. ఈ క్రమంలో నిజంగానే రూ.500 నోట్లను ఇప్పటికిప్పుడు చెలామణి నుండి తప్పిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Related Articles

Related image1
మీ దగ్గర ఉన్న రూ.500 నోటు నిజమా? నకిలీయా? ఇలా తెలుసుకోండి
Related image2
మార్కెట్లో నకిలీ రూ.500 నోట్ల కలకలం: ఫేక్ నోట్లను ఇలా గుర్తించండి
37
రూ.500 నోట్లను తప్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Image Credit : Asianet News

రూ.500 నోట్లను తప్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

1. ఆర్బిఐ ఆర్థిక భారం :

ప్రస్తుతం రూ.500 నోటు రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు భారంగానే మారింది. చాలా ఈజీగా ఈ నోట్లను పోలిన నకిలీ నోట్లను తయారుచేస్తున్నారు. దీంతో ప్రజల్లో నకిలీ నోట్ల ప్రవాహం పెరిగిపోతోంది. ఇదికూడా ఈ నోట్లను చెలామణినుండి తప్పిస్తారనే ప్రచారానికి కారణం. కానీ ఈ ప్రస్తుతం మార్కెట్ లోని కరెన్సీలో 86 శాతం రూ.500 నోట్లే ఉన్నాయి. కాబట్టి ఒకేసారి ఈ నోట్లను చెలామణినుండి తప్పిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి.

అలాగే రూ.500 నోట్లను తప్పిస్తే చిన్ననోట్లను ఎక్కువగా ప్రింట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్బిఐపై ప్రింటింగ్ బారం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2021లో నోట్ల ప్రింటింగ్ కు రూ.4,012 కోట్లు, 2024 లో 5,101 కోట్లు, 2025 రూ.6,372 కోట్లు ఖర్చు అయ్యింది… ఇలా ఏటేటా ప్రింటింగ్ ఖర్చు పెరుగుతూనే ఉంది. రూ.500 నోట్లను చెలామణి నుండి తప్పిస్తే ఈ ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశాలున్నాయి.

47
2. చిన్ననోట్ల చెలామణి పెరిగినా ఆర్బిఐకి ఆర్ధిక భారమే
Image Credit : Asianet News

2. చిన్ననోట్ల చెలామణి పెరిగినా ఆర్బిఐకి ఆర్ధిక భారమే

రూ.500 నోట్లను చెలామణి నుండి తప్పిస్తే రూ.200, రూ.100. రూ.20, రూ.10 నోట్ల సర్క్యులేషన్ పెరుగుతుంది. దీనివల్ల ఈ తక్కువ డినామినేషన్ నోట్లు ఎక్కువగా చేతులుమారతాయి. కాబట్టి ఆ నోట్లు తొందరగా పాడయిపోతాయి.. దీనివల్ల కూడా ఆర్బిఐకి ఎక్కువగా నోట్లను ముద్రించాల్సి ఉంటుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది.

57
3. బ్యాంకులకు ఖర్చు
Image Credit : getty

3. బ్యాంకులకు ఖర్చు

రూ.500 నోట్లను చెలామణి నుండి తప్పిస్తే బ్యాంకులపై కూడా ఆర్ధిక భారం పడుతుంది. ఏటిఎంలను ఇందుకు తగినట్లు మరోసారి మార్చాల్సి ఉంటుంది... సాప్ట్ వేర్ ను కూడా మార్చాలి. దీనికోసం బ్యాంకులు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

67
4. ప్రజలపైనా భారం
Image Credit : Gemini

4. ప్రజలపైనా భారం

రూ.500 నోట్లను చెలామణి నుండి తప్పిస్తే ప్రజలు కూడా ఎక్కువగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఏదయినా అవసరం ఉంటే ఒకేసారి భారీగా డబ్బులు తీసుకెళ్లడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందిపడాల్సి వస్తుంది.

77
5. రూ.500 నోట్లను తప్పిస్తే లాభమిదే
Image Credit : Getty

5. రూ.500 నోట్లను తప్పిస్తే లాభమిదే

ఫేక్ కరెన్సీ ప్రవాహం తగ్గుతుంది. రూ.500 నోట్లను తక్కువగా ప్రింటింగ్ చేసినా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి నకిలీ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. కానీ ఈ పెద్దనోటును తప్పిస్తే తక్కువ డినామినేషన్ నకిలీ నోట్లను ఎక్కువగా ప్రింట్ చేయడం కష్టంగా మారుతుంది... వాటిని సర్క్యులేషన్ లోకి తీసుకురావడం కష్టంగా మారుతుంది. దీనివల్ల ఈ నకిలీ నోట్ల బెడద తగ్గుతుంది.

రూ.500 నోటును చెలామణి నుండి తప్పిస్తే ప్రజలు ప్రతిసారి భారీగా డబ్బులు తీసుకెళ్లలేక డిజిటల్ ట్రాన్సాషన్ కు అలవాటుపడతారు. అలాగే బ్లాక్ మనీని కూడా కంట్రోల్ చేసే అవకాశాలుంటాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Related Stories
Recommended image1
మీ దగ్గర ఉన్న రూ.500 నోటు నిజమా? నకిలీయా? ఇలా తెలుసుకోండి
Recommended image2
మార్కెట్లో నకిలీ రూ.500 నోట్ల కలకలం: ఫేక్ నోట్లను ఇలా గుర్తించండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved