మార్కెట్లో నకిలీ రూ.500 నోట్ల కలకలం: ఫేక్ నోట్లను ఇలా గుర్తించండి
వామ్మో.. మార్కెట్ లోకి విపరీతంగా నకిలీ రూ.500 నోట్లు వచ్చేశాయట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. సోషల్ మీడియాలో కూడా నకిలీ రూ.500 నోట్లు గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫేక్ నోట్లు కూడా అసలైన నోటులాగే ఉండటంతో ఏది నిజమో? ఏది నకిలీయో అర్థం కాక ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇక్కడ చెప్పిన విధంగా చెక్ చేస్తే మీరు ఈజీగా నకిలీ నోట్ ని గుర్తు పట్టవచ్చు.
ప్రస్తుతం ఇండియాలో అతి పెద్ద నోటు అంటే అది రూ.500 మాత్రమే. ఇంతకు మించి పెద్ద నోటు లేదు. రూ.2,000 నోటు ఉన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నోట్లను వెనక్కు తీసేసుకుంది. వీటిని తిరిగి ప్రింటింగ్ చేయడం కూడా ఆపేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్బీఐ వెల్లడించింది.
దీంతో ఇప్పుడు పెద్ద నోటు అయిన రూ.500 లపై మోసగాళ్ల కళ్లు పడ్డాయి. వీటిని నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్ లోకి వదిలారు. ఇవి అచ్చం ఒరిజినల్ నోట్లలాగే ఉండటంతో ఏది నిజమైనదో, నకిలీ ఏదో తెలియక వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నకిలీ నోటు అచ్చం అసలైన రూ.500 నోటులాగే ఉంటున్నాయి. ఈ తేడాను మామూలుగా గుర్తించడం కష్టం.
రూ.500 నోటును ఇలా చెక్ చేయండి
రూ.500 నోటుపై ఉన్న గ్రీన్ కలర్ స్ట్రిప్ ను గమనించింది. దాని కాస్త క్రాస్ గా చూస్తే బ్లూ కలర్ లో కనిపిస్తే అది నిజమైన నోట్. ఒక వేళ మారకుండా గ్రీన్ కలర్ లోనే ఉంటే అది ఫేక్.
రూ.500 నోటుపై రైట్ సైడ్ వైపు ఉన్న నంబర్లు చిన్న సైజు నుంచి పెద్దగా ఉండాలి. అలా లేకపోతే అది ఫేక్.
రూ.500 నోటు లెఫ్ట్ సైడ్ అడుగున ఉన్న బాక్సులో సరిగ్గా గమనిస్తే 500 అని రాసి ఉండాలి. అలా లేకపోతే ఫేక్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే.. రూ.500 నోటుపై "రిజర్వ్" అనే పదం ఉంటుంది. అది తేడా ఉంది. ఆ నోట్ ను చూపిస్తూ బాధితుడు ఓ వీడియో చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నకిలీ నోట్ల వ్యవహారం వెలుగుచూసింది. ఫేక్ 500 నోట్లను గుర్తించడం గురించి కొందరు యూట్యూబర్లు ఫోటోలు, వివరాలతో వీడియోలు చేసి అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.
నకిలీ నోట్లను అరికట్టాలంటే వ్యాపారులు, వినియోగదారులు కూడా లావాదేవీలు జరుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. నకిలీ నోట్ల గురించి సమాచారం ఉన్నవారు అధికారులకు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 14.4 శాతం ఫేక్ నోట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన యాన్యువల్ రిపోర్ట్ లో తెలిపింది. దీన్ని బట్టి నకిలీ రూ.500 నోట్లు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి నకిలీ కరెన్సీ వల్ల మార్కెట్లు దెబ్బతింటాయి. ఇది ప్రజలకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థకూ పెను ముప్పుగా మారే అవకాశం కూడా ఉంటుంది. నకిలీ నోట్లపై అవగాహన పెంచడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయగలం.