MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Viral News: బీటెక్ చ‌దివి, 20 కిలోల బ‌రువు ఎత్త‌గ‌లిగితే ఉద్యోగం.. వైర‌ల్ అవుతోన్న జాబ్ పోస్ట్

Viral News: బీటెక్ చ‌దివి, 20 కిలోల బ‌రువు ఎత్త‌గ‌లిగితే ఉద్యోగం.. వైర‌ల్ అవుతోన్న జాబ్ పోస్ట్

Viral News: ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ జెప్టో పేరుతో ఓ జాబ్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతలు చర్చకు కారణంగా మారాయి. దీనిపై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 22 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అసలు ఏం జరిగింది?
Image Credit : Gemini AI

అసలు ఏం జరిగింది?

జెప్టోకు సంబంధించిన ఓ ఇంటర్న్‌షిప్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టులో బీటెక్, బీబీఏ, బీసీఏ, బీకామ్ (Hons) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి మూడు నెలలు కాగా, నెలకు రూ.20 వేల స్టైపెండ్ ఇస్తారని పోస్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పోస్టులో ఉన్న కొన్ని అర్హతలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
20 కిలోల బరువు ఎత్తాలన్న షరతు ఎందుకు?
Image Credit : Gemini AI

20 కిలోల బరువు ఎత్తాలన్న షరతు ఎందుకు?

జాబ్ పోస్టులోని ‘స్కిల్స్ రిక్వర్డ్’ విభాగంలో అభ్యర్థులు 20 కిలోల వరకు బరువును ఎత్తగలగాలి అని పేర్కొన్నట్లు పోస్టులో కనిపిస్తోంది. అలాగే వేగంగా జరిగే పని వాతావరణంలో 10 నుంచి 12 గంటల పాటు నిలబడి పనిచేయగల సామర్థ్యం ఉండాలని కూడా ఉంది. ఈ పోస్టును చూసిన కొందరు సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా టెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ అని చెబుతూ, ఇలాంటి శారీరక సామర్థ్యాలను ఎందుకు అర్హతగా పెట్టారనే చర్చ మొదలైంది.

Related Articles

Related image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Related image2
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
34
సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన
Image Credit : Gemini AI

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన

ఈ జాబ్ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరు సరదాగా స్పందిస్తూ.. “ఇక ఇంటర్న్‌షిప్ కోసం జిమ్‌కు వెళ్లడం కూడా అవసరమేనా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ పోస్టు నిజమైనదేనా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ పోస్టు కావచ్చని, AI ద్వారా రూపొందించిన చిత్రం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇది సాధారణ టెక్నికల్ ఇంటర్న్‌షిప్ కాకుండా, డార్క్ స్టోర్ మేనేజర్ వంటి ఉద్యోగానికి సంబంధించిన పోస్టు అయి ఉండొచ్చని చెబుతున్నారు. అలాంటి ఉద్యోగాల్లో స్టోర్‌లోని వస్తువులను తరలించాల్సి రావడంతో బరువు ఎత్తే అవసరం ఉండొచ్చని అంటున్నారు.

Zepto asking for hyrox level requirements pic.twitter.com/Zz0pJZgXRw

— Priyanshu Priyank (@PriyanshuP1405) August 17, 2026

44
జెప్టో నుంచి స్పష్టత లేదు
Image Credit : Gemini AI

జెప్టో నుంచి స్పష్టత లేదు

వైరల్ అవుతున్న ఈ జాబ్ పోస్టులోని స్క్రీన్‌షాట్ నిజమైనదేనా? లేదా నకిలీదా? అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఈ విషయంపై జెప్టో నుంచి అధికారిక వివరణ కూడా వెలువడినట్లు సమాచారం లేదు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టును పూర్తిగా నిజమని నిర్ధారించడం సరైంది కాదు. అయితే 20 కిలోల బరువు ఎత్తడం, 10–12 గంటలు నిలబడి పనిచేయడం వంటి నిబంధనలు ఉన్నాయని చెబుతున్న ఈ పోస్టు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image2
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image3
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Related Stories
Recommended image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Recommended image2
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved