రూ. 20తో నాలుగు నెలల వ్యాలిడిటీ.. మొబైల్ యూజర్లకు పండగే..
టెలికం కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని సంస్థలు ఇటీవల ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే మొబైల్ యూజర్లపై పెరుగుతోన్న భారాన్ని తగ్గించేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నాలుగు నెలల వ్యాలిడిటీకి కేవలం రూ. 20 చెల్లిస్తే సరిపోయే విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ట్రాయ్ కొత్త నిబంధనలు
ప్రస్తుతం చాలా మంది డ్యూయల్ సిమ్ ను ఉపయోగిస్తున్నారు. అవసరం లేకపోయినా ఫోన్ లో కచ్చితంగా రెండు సిమ్ లు ఉండాల్సిందే. అయితే సెకండ్ సిమ్ యాక్టివ్ గా ఉండాలంటే ఏదో ఒక రీఛార్జ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం టెలికం కంపనీలు ఛార్జీలు పెంచడంతో రెండు సిమ్ లు ఉపయోగించే వారికి ఇబ్బందిగా మారింది.
దీంతో రెండో సిమ్ ను డీయాక్టివేట్ చేసుకుంటున్నారు. లేదా రీఛార్జ్ చేయకుండా వదిలేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. తక్కువ ధరతో సిమ్ యాక్టివ్ ఉండేలా చర్యలు తీసుకుంది.
రీఛార్జ్ ప్లాన్స్
సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ప్రస్తుతం కనీసం రూ. 200 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే ట్రాయ్ మొబైల్ యూజర్లకు శుభవార్త తెలిపింది. రీఛార్జ్ ప్లాన్ ముగిసిన 90 రోజుల వరకు సిమ్ యాక్టివ్ లో ఉంటుంది. 90 రోజుల తర్వాత నెట్ వర్క్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఇలా ఒక్కసారి రీఛార్జ్ చేస్తే కనీసం 3 నెలలు సిమ్ యాక్టివ్ లో ఉంటుంది.
సిమ్ వ్యాలిడిటీ
మీరు ఏ ప్లాన్ యాక్టివేట్ చేయకపోయినా.. మీ సిమ్ 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంటుంది. 90 రోజుల తర్వాత కూడా మీరు రీఛార్జ్ చేయకపోతే, మీ సిమ్‌లో రూ. 20 బ్యాలెన్స్ ఉంటే, కంపెనీ అది కట్ చేస్తుంది. బ్యాలెన్స్ కట్ కాగానే సిమ్ వ్యాలిడిటీ 30 రోజులు పెరుగుతుంది. అంటే ఏ ప్లాన్ లేకుండానే మి సిమ్ 4 నెలలు యాక్టివ్ లో ఉంటుంది. నాలుగు నెలల వ్యాలిడిటీకి రూ. 20 సరిపోతుందన్నమాట.
వ్యాలిడిటీ ప్లాన్స్
ట్రాయ్ నిబంధనల ప్రకారం, ఈ 120 రోజుల తర్వాత, సిమ్ కార్డ్ వినియోగదారులు తమ నెంబర్‌ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవడానికి 15 రోజుల గడువు ఉంటుంది. అయితే, ఈ 15 రోజుల్లో వినియోగదారుడు తన నెంబర్‌ను యాక్టివేట్ చేయకపోతే, ఆ నెంబర్ పూర్తిగా బ్లాక్ అవుతుంది. మీ నెంబర్ బ్లాక్ అయిన తర్వాత, ఆ నెంబర్ వేరొకరికి కేటాయించబడుతుంది. ట్రాయ్ ఆదేశాల ప్రకారం, జనవరి 23వ తేదీ నుంచి అన్ని టెలికాం కంపెనీలు తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్స్‌ను విడుదల చేయనున్నాయి.