MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Smart watches: చేతికి చిన్న కంప్యూటర్ లాంటి స్మార్ట్ వాచ్ లు.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు

Smart watches: చేతికి చిన్న కంప్యూటర్ లాంటి స్మార్ట్ వాచ్ లు.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు

Smart watches: ఈ ఏడాది టెక్నాలజీ మన చేతుల్లోకి మరింత దగ్గరగా వచ్చేసింది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలనుకొనేవాళ్లం కదా.. ఇప్పుడు దాన్ని మించి చిన్న కంప్యూటర్ లాంటి స్మార్ట్‌వాచ్ లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇది మీ చేతికి ఎంత స్టైల్ గా ఉంటుందో, సమాచారం ఇవ్వడంలో కూడా అంత స్మార్ట్ గా పనిచేస్తుంది. కేవలం రూ.10,000 లోపు బెస్ట్ ఫీచర్లతో లభించే టాప్ స్మార్ట్‌వాచ్‌ల గురించి వివరంగా చూద్దాం రండి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 25 2025, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 5(Noise ColorFit Pro 5):
ఇది చూడటానికి ఎంత స్టైల్ గా ఉంటుందో వర్కింగ్ లో కూడా బెస్ట్ గా ఉంటుంది. ఇందులో 1.78-inch అమోలెడ్ డిస్‌ప్లే ఉండటం వల్ల పిక్చర్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఈ స్మార్ట్ వాచ్ లో నిద్రను చెక్ చేసే ఆప్షన్ ఉంది. అంతేకాకుండా గుండె వేగాన్ని పరిశీలిస్తుంది. అందువల్ల మీ ఆరోగ్య గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటుంది. అంతేకాకుండా  100+ స్పోర్ట్స్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. మీకు కావాల్సిన దానికి సెకన్లలో మారొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. వాడటానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. వాచ్ ఫేస్‌  మార్చుకునే ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రియల్ మి వాచ్ 4(Realme Watch 4):

కేవలం రూ.10 వేల బడ్జెట్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఆప్షన్స్ తో లభిస్తుంది ఈ స్మార్ట్ వాచ్. ఇది 1.8-inch చతురస్ర అమోలెడ్ డిస్‌ప్లే కలిగిఉంది. అందువల్ల విజువల్స్ క్లియర్ గా ఉంటాయి. SpO2 పర్యవేక్షణ, గుండె వేగం, వ్యాయామ పద్ధతులను తెలిపే మోడ్స్ ఇందులో ఉన్నాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ స్మార్ట్ వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. స్మార్ట్ నోటిఫికేషన్లు, బ్లూటూత్ కాలింగ్ వంటి బెస్ట్ ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి.

34
ఫైర్-బోల్ట్ ఇన్విన్సిబుల్ ప్లస్(Fire-Bolt Invincible Plus): 

తక్కువ బడ్జెట్ లో అధిక ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్ ఇది. ఇందులో కూడా అమోలెడ్ డిస్‌ప్లే ఉపయోగించారు. అందుకే క్లియర్ విజన్‌ ఉంటుంది. ఇందులో క్రౌన్ తిరుగుతుంది. అందువల్ల ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉంటుంది. 100+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేవాళ్లకి ఇది బెస్ట్ స్మార్ట్ వాచ్. ఇందులో 4GB స్టోరేజ్ ఉంది. పాటలు కూడా సేవ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ తో పాటు ఆరోగ్య పర్యవేక్షణ ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది.

44

బోట్ ఎక్స్‌టెన్డ్ ప్రో(boAt Xtend Pro):

స్పోర్ట్స్ ఇష్టపడేవాళ్లకి బెస్ట్ ఛాయిస్ ఈ స్మార్ట్ వాచ్. స్టైలిష్ డిజైన్, 1.75-inch HD డిస్‌ప్లే కలిగిన ఈ స్మార్ట్ వాచ్ మీ చేతికి రెట్టింపు అందాన్నిస్తుంది. వాయిస్ కంట్రోల్ ఫెసిలిటీ ఉండటం వల్ల కాల్స్ ఈజీగా మాట్లాడొచ్చు. 700+ స్పోర్ట్స్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. గుండె వేగం, నిద్ర విధానం, మానసిక ఒత్తిడిని ట్రాక్ చేసే ఫెసిలిటీలు మీకు మంచి సమాచారాన్ని అందిస్తాయి. నీళ్లలో తడిసినా దీనికి ఏమీ కాదు. అందుకే ఇది ఆటగాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండుగ రోజే బంగారం షాక్.. ఒక్కరోజులో రూ.1,210 పెరుగుదల
Recommended image2
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అక్టోబ‌ర్ 1 నుంచి మ‌నీ విత్‌డ్రాపై ఛార్జీలు
Recommended image3
Gold Price Hike: ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్లిన పసిడి.. ఈ వరలక్ష్మీ వ్రతానికి బంగారం కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved