MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • home business ideas: ఇంట్లో ఉండే ఇన్ని రకాల బిజినెస్‌లు చేయొచ్చా?

home business ideas: ఇంట్లో ఉండే ఇన్ని రకాల బిజినెస్‌లు చేయొచ్చా?

Top home business ideas: మీరు ఇంట్లో ఉండే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? బెస్ట్ ఐడియా కోసం ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం చాట్ జీపీటీ చాలా నిర్ధిష్టంగా సమాధానాలు ఇస్తోంది కాబట్టి చాట్ జీపీటీని ఇదే ప్రశ్నను అడిగితే ఇంటి దగ్గర ఉంటూ చేయగలిగే అద్భుతమైన బిజినెస్ ఐడియాలు చాలా ఇచ్చింది. అవేంటో ఓసారి తెలుసుకుందామా?     

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 07 2025, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డిజిటల్ టూల్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచే బిజినెస్ లు చేయాలని ప్రస్తుత యువత ప్రయత్నాలు చేస్తోంది. ఇలా కొంతమంది స్టార్ట్ చేసిన బిజినెస్ లు సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి కూడా. అలాంటి వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు, ఎక్స్ పీరియన్స్ పంచుకుంటారు. అలాంటి విజేతల ప్లానింగ్ ని పరిశీలించి చాట్ జీపీటీ అనేక వర్క్ ఫ్రం హోమ్ బిజినెస్ ఐడియాలను ఇచ్చింది. అవేంటో తెలుసుకుందాం రండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1. ఫ్రీలాన్స్ సేవలు (Freelance Services)

ఫ్రీలాన్స్ సేవలు 2025లో బాగా పాపులర్ అయ్యాయి. ఇంటి నుంచే, ఫ్లెక్లిబుల్ టైమ్స్ లో వర్క్ చేస్తూ యువత మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్ రైటింగ్, కాపీరైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ (SEO, PPC, SMM), వర్చువల్ అసిస్టెన్స్ సేవలు డిమాండ్‌లో ఉన్నాయి. ఇందులో మీ స్కిల్ ఏదో చెక్ చేసుకొని ఇంటి నుంచే పనిచేయొచ్చు. 

 

 

35

2. కోచింగ్, కన్సల్టింగ్ (Coaching & Consulting)

మీ దగ్గర టీచింగ్ టాలెంట్ ఉంటే మీరు ఇంటి నుంచే ఆన్ లైన్ లో కెరీర్, లైఫ్ కోచింగ్, స్టార్టప్ బిజినెస్ కన్సల్టింగ్, హెల్త్, ఫిట్‌నెస్, న్యూట్రిషన్ కోచింగ్ సేవలు ప్రారంభించవచ్చు.

3. కంటెంట్ క్రియేషన్ (Content Creation)
మీరు మంచి క్రియేటర్ అయితే యూట్యూబ్ ఛానెల్, పాడ్‌కాస్టింగ్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, అఫిలియేట్ మార్కెటింగ్, బ్లాగింగ్ ద్వారా ఇంటి నుంచే ఆదాయం పొందవచ్చు. వీటన్నింటికీ కావాల్సింది కేవలం ధైర్యం, డిజిటల్ మార్కెటింగ్.

45

4. హోం-బేస్డ్ ఫుడ్ బిజినెస్ (Home-Based Food Businesses)

ఈ కాలంలో ఆన్ లైన్ ఫుడ్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే క్లౌడ్ కిచెన్, టిఫిన్ సర్వీసులు, హోమ్ మేడ్ పికిల్స్, స్నాక్స్, లేదా బేకరీ ఐటమ్స్ తయారీ, కుకింగ్ క్లాసులు లేదా రెసిపీ ఈబుక్స్ వంటి ఆన్ లైన్ సర్వీసులు అందించి ఇంటి నుంచే మంచి ఆదాయం పొందవచ్చు.

5. ఆన్‌లైన్ విద్య (Online Education)

ఈ కాలంలో చదువు చాలా ఈజీ అయిపోయింది. కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రొఫెషనల్స్ ఆన్ లైన్ లోనే టీచింగ్ సేవలు అందిస్తున్నారు. అకాడెమిక్ లేదా పోటీ పరీక్షలకు ఆన్ లైన్ లో టీచింగ్ చేయడం, కోడింగ్, మ్యూజిక్, లాంగ్వేజ్ టీచింగ్ వంటి కోర్సులను ముందే తయారు చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. మీలో కూడా వీటిల్లో ఏ ఒక్క టాలెంట్ ఉన్నా ఇంటి నుంచే మంచి ఆదాయం సంపాదించొచ్చు. 

55

6. ఆన్‌లైన్ సెల్లింగ్ (Online Product Sales)

షాపిఫై, అమెజాన్, మీషో, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ ఉపయోగించి మీరు ఇంటి నుంచే బిజినెస్ చేయొచ్చు. టీ షర్ట్స్ ప్రింటింగ్, డిజైన్ చేసి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ లో అమ్మొచ్చు. మీ చేతితో తయారు చేసిన హ్యాండీ క్రాఫ్స్ట్ ను ఆన్ లైన్ లో మంచి ధరకు విక్రయించొచ్చు. eBooks, టెంప్లేట్స్, వివిధ రకాల కోర్సులు నేర్పించడం లాంటి ఎన్నో పనులు ఆన్ లైన్ లోనే చేయొచ్చు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
విద్య
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్స్ తో హోండా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్ విడుదల
Recommended image2
రూ.20,000 జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 3 కార్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved