MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Personal Loan: అతి తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే..

Personal Loan: అతి తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే..

Personal Loan India 2025: అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలంటే పర్సనల్ లోన్స్ బెస్ట్ ఆప్షన్. ఇండియాలోని ప్రముఖ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు సమీక్షించి, వినియోగదారులు వారికి అనుకూలమైన లోన్ ను ఎంచుకోవాలి. 

3 Min read
Author : Rajesh K
Published : Aug 10 2025, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ వడ్డీ పర్సనల్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు
Image Credit : Asianet News

తక్కువ వడ్డీ పర్సనల్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు

Personal Loan: ఆర్థిక అనిశ్చితుల మధ్య అత్యవసర అవసరాలు, వ్యక్తిగత ఖర్చుల కోసం చాలా మంది పర్సనల్ లోన్స్ పై మొగ్గుచూపుతున్నారు. అలాగే.. ఈ లోన్లను తక్కువ పేపర్ వర్క్‌తో సులభంగా పొందవచ్చు. అవసరాలకు తర్వగా డబ్బు పొందగలిగే అవకాశం ఉండటంతో అందరి ఆదరణ పొందుతున్నాయి. అయితే, పర్సనల్ లోన్ తీసుకునే ముందుగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలు తెలుసుకోవడం అత్యంత అవసరం. అలాగే.. మీకు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ డాక్యుమెంట్లతో లోన్స్ పొందవచ్చు. ఆ లోన్స్ వివరాలేంటో ఓ లూక్కేండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రముఖ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు:
Image Credit : Asianet News

ప్రముఖ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు:

ప్రస్తుతం ఇండియాలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు సుమారు 9.95% నుంచి 24% మధ్య ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు వ్యక్తిగత క్రెడిట్ స్కోర్, ఆదాయం, రీపేమెంట్ సామర్థ్యంపై ఆధారపడి మారుతాయి. ప్రధాన బ్యాంకుల తాజా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి:

కెనరా బ్యాంక్ :

వడ్డీ రేటు 9.95% – 15.40%  ప్రాసెసింగ్ ఫీజు: 1% వరకు

యాక్సిస్ బ్యాంక్ :

వడ్డీ రేటు 9.99% – 22.00%,   ప్రాసెసింగ్ ఫీజు ఫీ:  2% వరకు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

వడ్డీ రేటు 10.35% – 14.45%  ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 1% వరకు

బ్యాంక్ ఆఫ్ బరోడా

వడ్డీ రేటు 10.40% – 18.20% ,  ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 1% వరకు

ఐసీఐసీఐ బ్యాంక్ 

వడ్డీ రేటు10.60%  ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 2% వరకు + టాక్స్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

వడ్డీ రేటు 10.10% – 15.10%  ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 1% వరకు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

వడ్డీ రేటు 10.90% – 24.00%  ప్రాసెసింగ్ ఫీజు ఫీ: రూ.6,500 వరకు

కోటక్ మహీంద్రా బ్యాంక్ 

వడ్డీ రేటు10.99%  ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 2% వరకు

ప్రాసెసింగ్ ఫీజు ఫీ అనేది లోన్ అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. 

గమనిక: 2025 జూన్‌లో RBI 0.5% రెపో రేటు తగ్గింపు కారణంగా ఈ Personal Loan వడ్డీ రేట్లలో కొంత మార్పు చోటుచేసుకుంది. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, రీపేమెంట్ కాలం ఆధారంగా వడ్డీ రేట్లు కూడా మారవచ్చు.

35
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక లోన్స్
Image Credit : our own

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక లోన్స్

ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థిరమైన వేతనాలు, ఆదాయ భరోసా కారణంగా బ్యాంకుల దృష్టిలో తక్కువ రిస్క్ కేటగిరీకి చెందిన రుణ గ్రహీతలుగా పరిగణించబడ్డారు. అందువల్ల ఈ వర్గానికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో, తక్కువ డాక్యుమెంటేషన్‌తో ప్రత్యేక Personal Loan ఆఫర్లు అందిస్తున్నాయి.

లోన్ పరిమితి: రూ.50,000 నుంచి రూ.55 లక్షల వరకు (వేతన, క్రెడిట్ స్కోర్ ఆధారంగా)

డాక్యుమెంటేషన్:  ఐడీ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పే స్లిప్ మాత్రమే అవసరం

త్వరిత ఆమోదం: కొన్నిసార్లు ఒకే రోజులోనే రుణం మంజూరు

వడ్డీ రేట్లు (2025 జూన్ నాటికి):  SBI: 10.30% , యూనియన్ బ్యాంక్: 10.60% , ICICI బ్యాంక్: 10.85%, HDFC బ్యాంక్: 10.90%, కోటక్ మహీంద్రా: 10.99%, PNB: 11.00%, యాక్సిస్ బ్యాంక్: 11.25%, IDBI బ్యాంక్: 12.90% 

45
లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు:
Image Credit : our own

లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు:

  • వడ్డీ రేట్లను, ఇతర ఛార్జీలను (ప్రాసెసింగ్ ఫీజు, లోన్ ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు) జాగ్రత్తగా పరిశీలించండి. 
  • మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపడాలంటే పాత రుణాల చెల్లింపులు సమయానికి చేయండి.
  • నెలవారీ EMIలు మీరు సులభంగా చెల్లించేవిగా ఉండాలి. తద్వారా డిఫాల్ట్ ప్రమాదం తగ్గుతుంది.
  • ఫిన్‌టెక్ యాప్స్, అనుమానాస్పద ప్లాట్‌ఫామ్‌ల్లో పర్సనల్ లోన్స్ తీసుకోవద్దు. కేవలం ఆర్బీఐలో రిజిస్టర్ అయిన బ్యాంకులు, NBFC ల నుండి మాత్రమే లోన్ తీసుకోండి.
  • లోన్ అగ్రిమెంట్ వివరాలను పూర్తిగా, జాగ్రత్తగా చదవండి, దాని లోపల ఏ విధమైన అదనపు ఖర్చులు ఉన్నాయో తెలుసుకోండి.
55
ఈ విషయంలో జాగ్రత్త
Image Credit : our own

ఈ విషయంలో జాగ్రత్త

అత్యవసర ఆర్థిక అవసరాల పరిష్కారానికి వేగవంతమైన, సులభమైన మార్గం పర్సనల్ లోన్స్. అయితే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలు బాగా తెలుసుకుని, మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు సరిపోయే బ్యాంకును ఎంచుకొని మాత్రమే Personal Loan తీసుకోవడం మేలు. 

ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేట్లతో, తక్కువ డాక్యుమెంట్లతో ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్న నేపథ్యంలో వారు దీన్ని ప్రత్యేకంగా లబ్దిపొందవచ్చు.  మీ ఆర్థిక అవసరాలకు తగిన Personal Loan ఎంపిక చేసుకొని, భవిష్యత్ ఆర్థిక ఒత్తిడి లేకుండా సులభంగా తిరిగి చెల్లించేలా ప్లాన్ చేసుకోండి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Loans: లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తున్నారా? వారిపైనే కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే..?
Recommended image2
Personal Loans: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా...తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న బ్యాంకులు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved