MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Loans: లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తున్నారా? వారిపైనే కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే..?

Loans: లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తున్నారా? వారిపైనే కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే..?

Loans: బ్యాంకుల్లో గాని, ప్రైవేటు సంస్థల్లో గాని లోన్స్ తీసుకున్నారా? అనుకోని పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టలేకపోతున్నారా? అయితే లోన్ రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి వచ్చి అప్పు తిరిగి కట్టమని డిమాండ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి వేధిస్తారు కూడా.. కాని వారికి అలా చేసే అధికారం వారికి లేదు. అలా చేస్తే మీరే వారిపై కేసులు పెట్టొచ్చు. లోన్ రికవరీ ఏజెంట్ల లిమిట్స్, లోన్ తీసుకున్న వారికి చట్టపరంగా ఉన్న హక్కుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 12 2025, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు తమ కస్టమర్ల వద్ద లోన్స్ రికవరీ చేయడానికి ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయిస్తాయి. వారు రికవరీ ఏజెంట్లను పంపి డబ్బులు వసూలు చేయిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం చెప్పేది వినకుండా మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా మంది అవమానంగా భావిస్తారు. కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అయితే లోన్ రికవరీ ఏజెంట్ల వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు. వారి లిమిట్స్ తెలిస్తే వారిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

లోన్ తీసుకున్న వారి హక్కులు

లోన్ తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు తర్వాత ఉండకపోవచ్చు. అనుకోని సంఘటనలు జరగొచ్చు. ఇంట్లో మరణాలు సంభవించవచ్చు. కుటుంబసభ్యులకు లేదా మీకే అనారోగ్యం కలిగి హాస్పిటల్ లో జాయిన్ కావచ్చు. దీంతో ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ముందుగా మీరే మీ బ్యాంకుకు వెళ్లి మీ పరిస్థితిని వివరించండి. లోన్ కట్టడానికి కొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేయండి. దీంతో బ్యాంకు మీకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. 

35

లోన్ రికవరీ ఏజెంట్ల హక్కులు

బ్యాంకులు కూడా రికవరీ ఏజెంట్లకు కొన్ని రూల్స్ నిర్దేశిస్తాయి. వాటిని దాటి వారు ప్రవర్తించకూడదు. అవేంటంటే..
లోన్ రికవరీ ఏజెంట్లు ఏ టైమ్ లో పడితే ఆ టైమ్ లో ఫోన్లు చేయడం, ఇళ్లకు వెళ్లడం చేయకూడదు. ఉదయం 7 నుంచి రాత్రి 7.30 మధ్యలో మాత్రమే రుణం తీసుకున్న వారి ఇంటికి వెళ్లడం లేదా ఫోన్ చేయడం చేయాలి.
లోన్ తీసుకున్న వారితో ఇష్టారాజ్యంగా ప్రవర్తించకూడదు. తిట్టడం, కొట్టడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. 
లోన్ వసూలు చేయడానికి వచ్చినప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు చూపించాలి.

45

రికవరీ ఏజెంట్లపైనే కేసు పెట్టొచ్చు

ఈ రూల్స్ పాటించకుండా రికవరీ ఏజెంట్లు రూడ్ గా ప్రవర్తిస్తే వారిపై మీరే కేసు పెట్టొచ్చు. చుట్టు పక్కల వారి ముందు మిమ్మల్ని అవమానించినా, గొడవ పడినా వారిపై పరువు నష్టం దావా వేయొచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. 

55

బ్యాంకు అంబుడ్స్‌మన్ కి కంప్లైంట్ చేయొచ్చు

అయితే లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధించినట్లయితే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వారు ఫోన్ చేసి మిమ్మల్ని వేధించిన కాల్ రికార్డింగ్స్, మెసేజ్ లు, ఈ-మెయిల్స్ జాగ్రత్త చేసి బ్యాంకు అంబుడ్స్‌మన్ కి కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు ఈ ఆధారాలు చూపించాలి. అయినప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయొచ్చు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved