MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Upcoming 5G Mobiles: విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్ 5G ఫోన్లు ఇవే

Upcoming 5G Mobiles: విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్ 5G ఫోన్లు ఇవే

Upcoming 5G Mobiles: ఆగస్ట్ 2025 రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్ 5G మొబైల్స్ చాలానే ఉన్నాయి. Pixel 10, Vivo V60, OPPO K13 Turbo Pro, Infinix GT 30 5G+, Realme P3 Pro, Poco M7 Plus, Redmi 15 వంటి ఫోన్‌ల స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు మీకోసం.

3 Min read
Mahesh Rajamoni
Published : Aug 08 2025, 11:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్వరలో మార్కెట్ లోకి కొత్త 5G ఫోన్లు
Image Credit : Vivo and Google website

త్వరలో మార్కెట్ లోకి కొత్త 5G ఫోన్లు

ఆగస్ట్ 2025 భారత మొబైల్ మార్కెట్‌లో పలు ప్రముఖ బ్రాండ్లు కొత్త 5G ఫోన్లను విడుదల చేయనున్నాయి. వివిధ ధరల శ్రేణుల్లో లభించనున్న ఈ డివైసులు వినియోగదారుల అవసరాలను బట్టి ప్రత్యేక ఫీచర్లతో వస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ మోడళ్ల నుంచి బడ్జెట్ ఫోన్ల వరకు త్వరలో విడుదల కానున్న ముఖ్యమైన ఫోన్ల వివరాలు మీ కోసం.

గూగుల్ పిక్సెల్ (Google Pixel) 10 సిరీస్

  • గూగుల్ పిక్సెల్ (Google Pixel) 10 సిరీస్‌లో నాలుగు మోడల్స్ ఉంటాయి. Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, Pixel 10 Pro Fold.
  • ఈ ఫోన్లు TSMC తయారు చేసిన Tensor G5 చిప్‌తో పనిచేస్తాయి. ఇది వేగం, పవర్ ఎఫిషియెన్సీ విష‌యంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది.
  • పిక్సెల్ 10లో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే, 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్, 10.8MP టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • Pro, XL మోడల్స్‌లో 16GB RAM వరకు ఉంటుంది. ఫోల్డబుల్ వర్షన్‌లో 6.4 అంగుళాల కవర్ స్క్రీన్, పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం.
DID YOU
KNOW
?
గూగుల్ టెన్సర్ ప్రాసెసర్
గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ (Google Tensor Processor) అనేది గూగుల్ స్వయంగా రూపొందించిన మొబైల్ చిప్‌సెట్‌ (SoC – System on Chip). ఇది Pixel స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. Tensor (G1),G2, G3, G4 సిరీస్ లు వచ్చాయి. రాబోయే పిక్సెల్ 10 సిరీస్ లో Tensor G5 చిప్ సెట్ ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
25
వివో వీ60 (Vivo V60)
Image Credit : Vivo India/X

వివో వీ60 (Vivo V60)

  • Vivo S30 భారత వెర్షన్‌గా Vivo V60 వస్తుంది.
  • ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
  • Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది.
  • 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది.
  • Zeiss భాగస్వామ్యంతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 50MP పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉంటుంది.

ఒప్పో కే13 ట‌ర్బో ప్రో (OPPO K13 Turbo Pro)

Snapdragon 8s Gen 4 ప్రాసెసర్, 16GB RAM, 1TB స్టోరేజ్, 7000mAh బ్యాటరీ, ఇంటర్నల్ ఫ్యాన్ కూలింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ధర సుమారుగా రూ. 30,000 ఉంటుంది.

ఒప్పో కే13 ట‌ర్బో (OPPO K13 Turbo)

Dimensity 8450 ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 50MP కెమెరా ఉంటుంది.

ధర రూ. 25,000 నుంచి రూ. 28,000 మధ్య ఉంటుందని అంచ‌నా.

Related Articles

Related image1
iQOO Z10R: 4K కెమెరా, AI, గేమింగ్ ఫీచర్లతో రూ.20K లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. హాట్ డీల్
Related image2
APL: విశాఖ లో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ 4.. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి రామ్మోహన్‌, హీరో వెంకటేష్‌
35
లావా అగ్ని 4 (Lava Agni 4)
Image Credit : Realme India/X

లావా అగ్ని 4 (Lava Agni 4)

  • ఇది Lava ఫ్లాగ్‌షిప్ మోడల్.
  • Dimensity 8350 చిప్‌తో పనిచేస్తుంది.
  • 6.78 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, UFS 4.0 స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి.
  • ధర సుమారుగా రూ. 25,000గా అంచనా.

రియ‌ల్ మీ పీ సిరీస్

  • రియ‌ల్ మీ నుంచి మూడు ఫోన్లు రిలీజ్ కానున్నాయి.
  • రియ‌ల్ మీ పీ 3 ప్రో (Realme P3 Pro 5G)
  • ఇది అప్‌కమింగ్ మోడల్. స్పెసిఫికేషన్లు వెల్లడవ్వలేదు కానీ మిడ్-హై సెగ్మెంట్‌కి చెందే అవకాశం ఉంది.
  • రియ‌ల్ మీ పీ 1 (Realme P1 5G, P3, P3X 5G)
  • వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధ‌ర‌ రూ. 12,000 నుంచి రూ. 18,000 మ‌ధ్య ఉంటుంద‌ని అంచ‌నా.

ఇన్ఫినిక్స్ జీటీ 30 (Infinix GT 30 5G+)

ఈ ఫోన్ గేమింగ్ ఫోకస్‌తో వస్తోంది. Cyber Mecha 2.0 డిజైన్, LED లైట్స్‌తో ఉంటుంది. MediaTek Dimensity 7400 processor తో వ‌స్తోంది. దీని ధర రూ. 19, 500

45
పోకో ఎం7 ప్ల‌స్ (Poco M7 Plus 5G)
Image Credit : Poco India/X

పోకో ఎం7 ప్ల‌స్ (Poco M7 Plus 5G)

  • పూర్తి వివరాలు అందుబాటులో లేవు. అయితే, మంచి పనితీరుతో బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉండే అవకాశం. 
  • దీని ధ‌ర రూ. 13,000–15,000 అంచ‌నా. 
  • Poco M7 Plus స్పెక్స్ అధికారికంగా వెల్లడి కాకపోయినా, ఇది Redmi 15 5G రీబ్రాండ్ అయ్యే అవకాశముంది. 
  • దీంట్లో Snapdragon 6s Gen 3 ప్రాసెసర్, 6.9" FullHD+ 144Hz LCD, 4GB RAM, 128GB స్టోరేజ్, 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

రెడ్మి 15 (Redmi 15 5G)

  • బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కలిగిన మిడ్ రేంజ్ ఫోన్. 
  • Xiaomi మలేసియాలో Redmi 15 5Gను అధికారికంగా విడుదల చేసింది. 
  • దాని ప్రకారం.. 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన భారీ డిస్‌ప్లే, Snapdragon 6 సిరీస్ చిప్‌సెట్, 7000mAh బిగ్ బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా సెటప్ తో రానుంది. 
  • ధర రూ. 14,000 నుంచి ప్రారంభం కానుంది.
55
టెక్నో స్పార్క్ గో (TECNO Spark Go 5G)
Image Credit : Oppo India | X

టెక్నో స్పార్క్ గో (TECNO Spark Go 5G)

  • బేసిక్ 5G ఫోన్ ఇది. 
  • 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP64 రేటింగ్ ఉన్నాయి. 
  • ధర రూ. 10,000–రూ. 12,000 మధ్య ఉంటుంది.

మీకు ఏ ఫోన్ బాగా సరిపోతుంది?

  • గేమింగ్ & బ్యాటరీ: Infinix GT 30 5G+, OPPO K13 Turbo Pro
  • ఫొటోగ్రఫీ :Vivo V60, Pixel 10
  • స్టాక్ Android & AI ఫీచర్లు: Pixel 10 సిరీస్
  • రూ. 30,000 లోపల ఫ్లాగ్‌షిప్ అనుభూతి పంచేవి : OPPO K13 Turbo Pro, Lava Agni 4
  • రూ. 15,000 బడ్జెట్ :Poco M7 Plus 5G, TECNO Spark Go 5G, Redmi 15 5G

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved