CNG Car: రూ. 4 లక్షలుంటే ఈ కారు మీ సొంతం.. టాప్ 5 బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే
CNG Car: ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, CNG కార్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సీఎన్‌జీ కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి ఎస్-ప్రెస్సో CNG
మారుతి ఎస్-ప్రెస్సో CNG మోడల్ ధర రూ. 4.62 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.0 లీటర్ K-సిరీస్ ఇంజిన్‌పై నడుస్తుంది, ఇది 56 PS పవర్, 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీటరుకు 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సురక్షితంగా ప్రయాణించేందుకు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS-EBD, ESP, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉన్నాయి.
మారుతి ఆల్టో K10 CNG
ఆల్టో K10 CNG ధర రూ. 4.82 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 998cc K10C ఇంజిన్‌తో 56 PS పవర్, 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీటరుకు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ESP, వెనుక సెన్సార్లు ఉన్నాయి. చిన్న కుటుంబాలకు అనువుగా ఉండే 214 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.
టాటా టియాగో CNG
టాటా టియాగో CNG ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ ద్వారా 72 PS పవర్, 95 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్ వెర్షన్‌లో 26.49 km/kg, AMT వెర్షన్‌లో 28.06 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇది 4-స్టార్ GNCAP రేటింగ్ పొందిన సురక్షితమైన కారు. అందమైన ఇంటీరియర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
మారుతి వ్యాగన్ ఆర్ CNG
వ్యాగన్ ఆర్ CNG మోడల్ ధర రూ. 5.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 998cc K10C ఇంజిన్ ద్వారా 56 PS పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇది లీటరుకు 34.05 km/kg మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి. విస్తృతమైన కేబిన్, సౌకర్యవంతమైన సీటింగ్ వల్ల ఇది కుటుంబాల కోసం ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు.
మారుతి సెలెరియో CNG
మారుతి సెలెరియో CNG ధర రూ. 5.98 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఇది 998cc K10C ఇంజిన్‌తో 56 PS పవర్, 82.1 Nm టార్క్ ఇస్తుంది. ఇంధన సామర్థ్యం 34.43 km/kgగా ఉంది. ఇది దేశంలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న CNG కార్లలో ఒకటి. సురక్షితంగా ఉండేందుకు ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESP వంటి ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో AC, కీలెస్ ఎంట్రీతో పాటు 313 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.