iPhone Notes App: 99% మందికి తెలియని 10 మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!
iPhone Notes App: iPhoneలో ఉండే Notes Appను చాలా మంది నోట్ రాసుకోవడానికి వాడుతారు. కానీ ఈ యాప్ లోి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ ఈ ఫీచర్స్ ఏంటో ఓ లూక్కేయండి.

అద్భుతమైన ఫీచర్లు
iPhoneలో ఉండే Notes Appను చాలా మంది నోట్ రాసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, నిజానికి ఇది ఒక పర్సనల్ డాక్యుమెంట్ స్కానర్, టు-డూ లిస్ట్ ప్లానర్, డ్రాయింగ్ ప్యాడ్, సీక్రెట్ చాట్ టూల్ లాంటి అనేక పనులకు ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. ఐ ఫోన్ లో అద్భుతమైన, శక్తివంతమైన ఫీచర్ గా చెప్పవచ్చు. ఇంతకీ ఆ యాప్ లోని మైండ్-బ్లోయింగ్ ఫీచర్లు ఏంటో ఓ లూక్కేయండి.
డాక్యుమెంట్లు స్కాన్ చేయండి
మీరు స్కానర్ లేకుండా కేవలం iPhone Notes Appతోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి PDFగా సేవ్ చేయొచ్చు.
ఎలా చేయాలి?
- Notes Appను లాంగ్‌ప్రెస్ చేయండి
- “Scan Documents” ఎంచుకోండి.
- కెమెరా ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ ఫోటో తీసి → “Keep Scan” క్లిక్ చేసి → “Save” చేయండి.
- ఇది నోట్‌లో స్కాన్ రూపంలో సేవ్ అవుతుంది.
నోట్స్ లాక్
మీరు రాసుకున్న విషయాలను గోప్యంగా ఉంచాలనుకున్న నోట్స్‌కి లాక్ వేసుకోవచ్చు.
ఎలా?
- మీ రాసిన నోట్ ఓపెన్ చేయండి. పై భాగంలో ఉన్న మెనూ ట్యాప్ చేయండి
- “Lock” ఎంపిక చేసుకుని Face ID లేదా కస్టమ్ పాస్‌వర్డ్ సెట్ చేయండి.
- ఇప్పటి నుంచి ఆ నోట్ ఓపెన్ చేయాలంటే Face ID/Code తప్పనిసరి. ఇలా మీ ప్రైవేట్ డేటా, డైరీ లాంటి విషయాలను భద్రపరుచుకోవచ్చు.
ఫీడిఎఫ్ గా మార్చండి
ఈ యాప్ లో రాసిన డ్యాకుమెంట్ ను PDFగా సేవ్ చేసుకోవచ్చు.
ఎలా?
మీరు నోట్ యాప్ ఓపెన్ చేసి, మీరు రాసి ఫైల్ పై Share బటన్ క్లిక్ చేయండి. అక్కడ "Send a Copy" సెలెక్ట్ చేయండి. ఆ తరువాత “Markup” ఎంచుకోండి. ఇప్పుడు మీకు PDF ప్రివ్యూ కనిపిస్తుంది. ఆ తరువాత “Done” ని క్లిక్ చేయండి. “Save to Files” ద్వారా PDFగా సేవ్ అవుతుంది.
చెక్ లిస్ట్ తయారీ, షేరింగ్
ఈ యాప్ ద్వారా Check List తయారుచేసి ఇతరులతో షేర్ చేయవచ్చు.
ఎలా?
- నోట్‌లో "✓ Checklist" బటన్ ద్వారా టాస్క్‌లను జోడించండి.
- Share పై క్లిక్ చేస్తే.. “Collaborate” అని వస్తుంది. దానిపై సెలెక్ట్ చేసి లింక్‌ను మిత్రులకు పంపండి.
- అవసరమైతే అందులో మార్పులు చేయవచ్చు .
ట్యాగింగ్
ఈ యాప్ ద్వారా ట్యాగ్‌లు వాడి నోట్స్‌ను గ్రూప్స్ వారిగా షేర్ చేయవచ్చు.
ఎలా?
ఈ యాప్ లో మీరు రాయాలనుకున్న విషయానికి ముందు # వేసి ట్యాగ్ చేయండి. ఉదాహరణకు #ట్రావెల్, #వర్క్. ఈ పదాలు పసుపు రంగులోకి మారితే, ట్యాగ్ యాక్టివ్ అయ్యిందని అర్థం. వెంటనే Foldersలోకి వెళ్లి, దానిపై కి స్వైప్ చేస్తే అన్ని ట్యాగ్‌లు లిస్ట్ అవుతాయి. అలా మీకు నచ్చిన వారికి ట్యాగింగ్ చేయవచ్చు.
డ్రాయింగ్ టూల్
ఐఫోన్ Notes Appలో డ్రాయింగ్ టూల్ కూడా ఉంటుంది. మీ చేతితో లేదా Apple Pencilతో డ్రాయింగ్‌లు చేయొచ్చు. ఇతరులతో కలిసి అదే స్కెచ్ మీద పని చేయవచ్చు. అంటే ఆన్‌లైన్ లో కోలాబరేషన్ కావొచ్చు. ఈ ఫీచర్ ఆర్టిస్ట్స్, ప్లానర్లకు చాలా ఉపయోగపడుతుంది.
స్కెచ్ మోడ్
ఆపిల్ పెన్సిల్ (Apple Pencil) వాడితే వెంటనే స్కెచ్ మోడ్ ప్రారంభం అవుతుంది.
ఎలా పని చేస్తుంది?
మీ దగ్గర Apple Pencil, iPad ఉంటే.. Notes App ద్వారా స్కెచ్ చేయడం ఒక అద్భుతమైన అనుభవంగా మారుతుంది. దీనితో మీరు మీ ఆలోచనలు, ఐడియాలు, డిజైన్లు, డెయాగ్రామ్‌లు లేదా హ్యాండ్‌రైటింగ్‌ను తక్షణం డిజిటల్‌గా నమోదు చేయొచ్చు.
స్కానింగ్
iPhoneలో ఉండే Notes Appతో సింపుల్ గా స్కాన్ చేయవచ్చు. అది కూడా హై క్వాలిటీలో.
ఎలా చేయాలి?
Notes Appలో లాంగ్ ప్రెస్ చేసి “Scan Documents” ఎంచుకోండి. దీంతో కెమెరా ఓపెన్ అవుతుంది. అద్భుతమైన క్లారిటీతో స్కాన్ తీసుకుని, నోట్ యాప్ లో సేవ్ చేసుకోవచ్చు.
క్రియేటివిటీ
మీ చేతి రాతతోనే మీ క్రియేటివిటీని చూపవచ్చు. నోట్ యాప్ లో Markup మోడ్ ఓపెన్ చేసి, అందులో Handwriting టూల్ ఎంచుకోండి. మీకు నచ్చినట్టు చేతితో రాయండి, స్కెచ్ చేయండి. ఈ డ్యాకుమెంట్ ను స్నేహితులకూ షేర్ చేయొచ్చు. ఫీచర్ సహాయంతో డిజిటల్ డైరీ, సంతకం పెట్టవచ్చు.
ఇతర ఫైల్స్ తో లింక్
మీ రాసిన సమాచారంలో ఇతర ఫైల్ ను లింక్ చేయవచ్చు.
ఎలాగంటే?
ముందుగా ఒక నోట్ టైప్ చేయండి. ఆ తర్వాత మళ్లీ టైప్ చేయండి. అందులో Related Note పేరు కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే మీరు ఆ నోట్ డ్యాకుమెంట్ లోకి వెళ్తారు. ఈ ఫీచర్ ప్రాజెక్ట్ టాపిక్స్, రిఫరెన్స్‌లు కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.