ముక్కు పిండి పన్ను వసూలు చేస్తున్న టాప్ 10 టోల్ ప్లాజాలివే..
జాతీయ రహదారుల్లో టోల్ వసూళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతోంది. ఏటా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న టోల్ ప్లాజాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా.. దేశంలో గరిష్టంగా టోల్ వసూలు చేసే ప్లాజాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ నివేదికల ప్రకారం, జూన్ 30, 2024 నాటికి దేశంలోని జాతీయ రహదారులపై 983 టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అధికంగా టోల్ వసూలు చేస్తున్న 10 టోల్ ప్లాజాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ 10 జాతీయ రహదారుల టోల్ ప్లాజాల నుండి వసూలు చేసిన డబ్బు అక్షరాల రూ.3300 కోట్లు. వీటి నుంచి గత ఐదేళ్లలో ఈ ఏడాది మార్చి 31 వరకు వసూలు చేసిన మొత్తం ఏకంగా రూ.14,045 కోట్లు. ఆ టోల్ ప్లాజాల గురించి తెలుసుకుందామా..
10. తికారియా/జైపూర్ టోల్ ప్లాజా: రాజస్థాన్లోని తికారియా-జైపూర్ టోల్ ప్లాజా ఆ దారిలో ప్రయాణించే వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తోంది. ఐదేళ్లలో ఇక్కడ వసూలు చేసిన టోల్ 1161.2 కోట్ల రూపాయలు.
9. కృష్ణగిరి తోపూర్ టోల్ ప్లాజా: తమిళనాడులోని ధర్మపురిలో ఉన్న ఈ టోల్ ప్లాజా ఉంది. దీన్ని పాళయం టోల్ ప్లాజా అని కూడా అంటారు. ఇది తమిళనాడులోని కృష్ణగిరి-తుంబయిపడి మధ్య 154 కి.మీ. పరిధిలో రోడ్డు టాక్స్ వసూలు చేస్తుంది. గత ఐదేళ్లలో ఇక్కడ వసూలు చేసిన టోల్ మొత్తం విలువ 1124.2 కోట్ల రూపాయలు.
8. ఘరౌండా టోల్ ప్లాజా: హర్యానాలోని ఘరౌండా ప్రాంతంలో ఈ టోల్ ప్లాజా ఉంది. 111.5 కి.మీ పానిపట్-జలంధర్ హైవేపై ఉంది. ఐదేళ్లలో ఇక్కడ చేసిన వసూళ్లు రూ.1314.4 కోట్లు.
7. చోర్యాసి టోల్ ప్లాజా: గుజరాత్లోని చోర్యాసి టోల్ ప్లాజా భరూచ్, సూరత్ పట్టణాల మధ్య ఉంది. 246 కిలోమీటర్ల దూరానికి ఈ టోల్ ప్లాజా పన్ను వసూలు చేస్తుంది. అయిదేళ్లలో 1,272.6 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.
6. జలధులగోరి టోల్ ప్లాజా: పశ్చిమ బెంగాల్లోని జలధులగోరి టోల్ ప్లాజాకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది కేవలం 35 కిలోమీటర్ల పరిధికే టోల్ వసూలు చేస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. గత ఐదేళ్ల నుండి 1538.9 కోట్లు వసూలు చేసింది.
5. బరాజోర్ టోల్ ప్లాజా: ఇది ఉత్తరప్రదేశ్లోని బరాజోర్ ప్రాంతంలో ఉన్న టోల్ ప్లాజా ఇది. ఇటావా పట్టణాన్ని చకేరీకి కనెక్ట్ చేస్తుంది. గత ఐదేళ్లలో ఇక్కడ నుంచి 1480.7 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
4. షాజహాన్పూర్ టోల్ ప్లాజా: షాజహాన్పూర్ టోల్ ప్లాజా రాజస్థాన్లోని గుర్గావ్-కోటాపుట్లీ-జైపూర్ మధ్య ఉంది. 115 కి.మీ.ల దూరానికి గత ఐదేళ్లలో ఇక్కడి నుంచి వసూలు చేసిన టోల్ మొత్తం 1884.5 కోట్ల రూపాయలు.
3. నవాబ్గంజ్ టోల్ ప్లాజా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నవాబ్గంజ్ టోల్ ప్లాజా అత్యధిక వసూళ్లు చేస్తూ జాబితాలో నిలిచింది. ఐదేళ్లలో ఇక్కడి టోల్ ప్లాజా నుంచి రూ.1884.5 కోట్లు వసూలు చేశారు.
2. ససారం టోల్ ప్లాజా: ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. వారణాసి-ఔరంగాబాద్ మార్గంలో 94 కి.మీల పరిధిలో రోడ్డు పన్ను వసూలు చేస్తుంది. గత ఐదేళ్లలో ఇక్కడి నుంచి వసూలు చేసిన సొమ్ము అక్షరాలా 2043.8 కోట్ల రూపాయలు.
1. బెర్తానా టోల్ ప్లాజా: ఈ టోల్ ప్లాజా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడి నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఇక్కడి నుంచి వసూలు చేసిన మొత్తం అక్షరాల 2043.8 కోట్ల రూపాయలు.