MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • జనాలకు ఫ్రీగా డబ్బులిస్తే ఏం చేస్తారో తెలుసా..?

జనాలకు ఫ్రీగా డబ్బులిస్తే ఏం చేస్తారో తెలుసా..?

ప్రజలకు ఉపాధి కల్పించకుండా ఉచితంగా డబ్బు ఇస్తే ఏమవుతుందో తెలుసా.... అమెరికా సర్వే సంస్థ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఇవిగో.... 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 29 2024, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
free schemes

free schemes

ప్రజలకు ఉపాధి కల్పించకుండా సంక్షేమం పేరుతో  ఉచితంగా డబ్బులు పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు అలవాటు పడుతున్నాయి.  దీంతో చదువుకున్న యువత సైతం ఉపాధి కల్పనకు ప్రయత్నించ కుండా ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు అలవాటు పడుతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలే అనడంలో సందేహం లేదు. అయితే ఉచిత పథకాలు సమాజ అభివృద్ధికి ఎలా అడ్డుపడుతున్నాయో... అమెరికాలో open research అనే సంస్థ ఈ అంశంపై సర్వే నిర్వహించింది. ఆ వివరాలు  ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం....
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
free schemes

free schemes

Open research ఏం చేసిందంటే...

 Open AI మరియు US ప్రభుత్వం వంటి సంస్థల నుంచి నిధులు సేకరించింది. వాటిని అమెరికాలో కొందరు పేదలను ఎంపిక చేసి మూడు సంవత్సరాల పాటు నెలకు $1,000 ఇచ్చింది.  నవంబర్ 2020 నుండి అక్టోబర్ 2023 వరకు ఈ నగదు అందజేసింది. వారు ఆ డబ్బును ఆహారం, గృహాలు మరియు రవాణా వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించారు.  కానీ వారి ఆరోగ్యం లేదా దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితులను  మెరుగుపరచడానికి ఉపయోగించలేకపోయారు.  మూడు సంవత్సరాల్లో ఇచ్చిన $36,000 వారికి నిత్య అవసరాలు తీర్చుకోవడానికి తప్ప, ఇతర ముఖ్య అవసరాలకు ఉపయోగపడలేదని పరిశోధకులు నిర్ధారించారు. 

35
free schemes

free schemes

పెట్టుబడి పెట్టరు... పనిచేయరు...

ఉచిత నగదు తీసుకోవడానికి అలవాటు పడిన అమెరికా ప్రజలు భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపరని, చివరికి పూర్తిగా ఉద్యోగాలను, పనులను వదులుకుంటారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉచిత నగదు పై పూర్తిగా ఆధారపడతారని తెలిపారు. OpenResearch బృందం తన పరిశీలనలో ఈ విషయాలను వెల్లడించింది. 

45
free schemes

free schemes

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలపై ఆలోచించాలి....

మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కొన్ని ఉచిత నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులకు వీటిని ఇవ్వడంలో తప్పులేదు కానీ... కష్టపడి పనిచేసే యువతకు సైతం ఇలాంటి నగదు బదిలీ పథకాలు అందిస్తుండడం ఆందోళనకరం. వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే బదులు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేగంగా పడాల్సిన అవసరం ఉంది. 
 

55

ఉచితాలపై ఆసక్తి చూపిన యువత...

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు యువత ఇదే విషయాన్ని వెల్లడించింది. తమకు ఉచిత పథకాలు వద్దని, ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని నాయకులను కోరారు. రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వం అనేక ఉచిత నగదు బదిలీ పథకాలు అమలు చేసినప్పటికీ ఉద్యోగాలు కల్పించిన కారణంగా యువత  తిరస్కరించారు. తెదేపా ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ యువతను ఎంతో ఆకట్టుకుంది. దీంతో అత్యధిక(163) సీట్లతో ఆ పార్టీ గెలుపొందింది. అమెరికా సర్వే సంస్థ open research వెల్లడించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని  ఉచిత నగదు బదిలీ పథకాల కంటే ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved