Bike Prices Down: ఈ బైక్, స్కూటర్ ధరలు భారీగా తగ్గిపోయాయి, ఎంత తగ్గాయో తెలుసాా?
కొత్త జీఎస్టీ నిబంధనల వల్ల సుజుకి కంపెనీ తమ వాహనాల బైక్ (Bike), స్కూటర్ మోడళ్ల ధరలను చాలా తగ్గించింది. ఒక్కో బైక్ మీద రూ.18,024 వరకు తగ్గింపు ఇస్తోంది. దసరాకు బైక్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.

సుజుకి బైక్ ధరల తగ్గుదల
ఈరోజు నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. ద్విచక్ర వాహన మార్కెట్‌లో భారీగా ధరలు తగ్గాయి. సుజుకి తన పాపులర్ బైక్, స్కూటర్ మోడళ్లపై రూ.18,024 వరకు ధర తగ్గించింది. ఈ మార్పు నేరుగా కస్టమర్లకు లాభాలను అందిస్తుంది. ఈ దసరాకు కొత్త బైక్ కొనేందుకు సిద్ధమైపోండి.
సుజుకి కంపెనీ ప్రకటన
కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం, 350cc కంటే తక్కువ వాహనాలపై 28% పన్నును 18%కి తగ్గించారు. సుజుకి ఈ ప్రయోజనాన్ని వెంటనే తన ధరలలో చేర్చింది. పండుగ సీజన్‌లో ఈ ధరల తగ్గింపు, కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారింది.
ఈ బైకులపై తగ్గుదల
సుజుకి స్కూటర్ విభాగంలో యాక్సెస్, ఏవెనిస్, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ EX వంటి మోడళ్ల ధరలు రూ.7,823 నుంచి రూ.9,798 వరకు తగ్గాయి. ఇవి మహిళలు, పురుషులు ఇద్దరూ వాడవచ్చు. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారికి ఇవి అనుగుణంగా ఉంటాయి.
వి-స్ట్రోమ్ ధర తగ్గింపు
మోటార్‌సైకిల్ విభాగంలో జిక్సర్ సిరీస్ ఎక్కువ మందికి నచ్చుతోంది. ముఖ్యంగా జిక్సర్ 250, SF 250 మోడళ్లపై రూ.16,000 పైగా తగ్గించారు. V-స్ట్రోమ్ SX టూరింగ్ బైక్‌పై రూ.17,982 తగ్గింది. ఇవి యువతను ఆకట్టుకుంటాయి.
అందరికీ అనువుగా
ఈ ధరల తగ్గింపు కస్టమర్లకే కాకుండా, సుజుకి కంపెనీకి కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతుంది. మధ్యతరగతి ప్రజలకు ఆ బైకులు అందుబాటులో ఉంటాయి. ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లు అధిక సంఖ్యలో వీటిని కొనే అవకాశం ఉంది.

