Business Idea: చిన్న వ్యాపారాల్లోనూ ఎక్కువ లాభాలు పొందవచ్చు.. ఎలాగో తెలుసా?
త్వరగా డబ్బు సంపాదించడానికి మంచి మార్గం ఏదైనా ఉందంటే అది వ్యాపారమే. అయితే ఏ వ్యాపారమైనా లాభసాటిగా ఉన్నప్పుడే ఎక్కువకాలం కొనసాగుతుంది. మన దగ్గర ఎక్కువ పెట్టుబడి లేనప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూనే మంచి లాభాలు పొందవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

వ్యాపారాల్లో లాభాలు పొందే చిట్కాలు
ఏ వ్యాపారం చేసినా దాని ప్రధాన లక్ష్యం లాభాలు పొందడమే. కానీ అన్ని వ్యాపారాలు ఒకేలా లాభాలను ఇవ్వవు. కొన్ని వ్యాపారాల్లో తక్కువ ఆదాయం వస్తుంది. మరికొన్ని వ్యాపారాలు కోటీశ్వరులుగా మారుస్తాయి. ఎప్పుడైతే మనం చేసే వ్యాపారంలో నేరుగా కస్టమర్లతో కనెక్ట్ అవుతామో.. అప్పుడు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ముడిసరుకుల కంటే, వాటికి విలువ జోడించిన వస్తువులు అధిక లాభాలనిస్తాయి. సరైన వ్యూహంతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. చిన్న వ్యాపారమైనా ఎక్కువ లాభాలు పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
నేరుగా కస్టమర్ కి అందించడం..
ఒక వస్తువు ఉత్పత్తి అయ్యే ప్రయాణంలో కస్టమర్‌కి దగ్గరగా ఉన్న స్థానాన్ని ఎంచుకుంటే.. లాభం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, కాఫీ బీన్స్ పండిచే రైతు ఒక సాధారణం ధర మాత్రమే పొందుతాడు. కానీ, ఆ కాఫీని బ్రాండెడ్ కాఫీ పౌడర్‌గా మార్చే కంపెనీ మాత్రం చాలా రెట్లు లాభం సంపాదిస్తుంది. కారణం, కస్టమర్ మనసులో ఆ బ్రాండ్ పేరే ఉంటుంది. కాబట్టి కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేయడం మంచిది.
విలువ జోడించి అమ్మడం..
ముడిసరుకును అలాగే అమ్మకుండా, దానికి విలువ జోడించి అమ్మితే లాభం చాలా రెట్లు పెరుగుతుంది. ఉదాహరణ.. పాలు అమ్మేవారు ఒక లీటరు పాలతో సాధారణ లాభం పొందుతాడు. కానీ, ఆ పాలతో పెరుగు, పన్నీర్, ఐస్ క్రీం, పాయసం వంటి ఉత్పత్తులను అమ్మేవారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి విలువ జోడించి అమ్మడానికి ప్రయత్నించడం మంచిది.
ఎక్కువ లాభాలు రావాలంటే..
వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు రావాలంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువులను ఎంచుకోవాలి. అలా అనీ ఎక్కువ వస్తువులను నిల్వ పెట్టుకోకూడదు. దానివల్ల పెట్టుబడి నిలిచిపోతుంది. చిన్న చిన్న డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం కస్టమర్‌కి ఎంత దగ్గరగా ఉంది? ఎలాంటి వస్తువులు విక్రయిస్తున్నాం వంటి అంశాలపైనే లాభాలు ఆధారపడి ఉంటాయి. సరైన ప్లేస్ లో సరైన వ్యాపారం చేస్తే.. లాభాలు వాటంతట అవే పెరుగుతాయి.