- Home
- Business
- SIP Vs PPF: ప్రతినెలా రూ. 3 వేలు దాస్తే రూ. 14 లక్షలా? పీపీఎఫ్ vs ఎస్ఐపీ సీక్రెట్ ఇదేేేేేే
SIP Vs PPF: ప్రతినెలా రూ. 3 వేలు దాస్తే రూ. 14 లక్షలా? పీపీఎఫ్ vs ఎస్ఐపీ సీక్రెట్ ఇదేేేేేే
SIP Vs PPF: ఎస్ఐపీ, పీపీఎఫ్ లలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎందులో ఉంటాయి? 15 ఏళ్ల పాటు ప్రతినెలా రూ. 3,000 ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపీ , పీపీఎఫ్ ద్వారా ఎంత రిటర్న్ వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

SIP vs PPF: ప్రతినెలా రూ. 3 వేలు దాస్తే లక్షాధికారి కావడం గ్యారెంటీనా? అసలు నిజం ఇదే
భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు సంపాదించడంతో పాటు దానిని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనగానే లేదా ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరి దృష్టిలో మెదిలే ప్రధానమైన రెండు ఆప్షన్లు ఎస్ఐపీ, (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్), పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్).
ఎస్ఐపీ, పీపీఎఫ్: ప్రధాన వ్యత్యాసాలు.. వడ్డీ రేట్ల వివరాలు ఇవే
ఎస్ఐపీ అనేది మార్కెట్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. దీనిలో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అత్యంత సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ మార్గం. దీనిలో గ్యారెంటీ రిటర్న్స్ లభిస్తాయి. ప్రస్తుతం పీపీఎఫ్ పై ప్రభుత్వం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ లలో మార్కెట్ వల్ల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, సుదీర్ఘ కాలంలో ఇవి సగటున 12 శాతం నుండి 15 శాతం వరకు రిటర్న్స్ అందించాయి.
15 ఏళ్లలో ఎస్ఐపీ ద్వారా ఎంత కార్పస్ ఫండ్ వస్తుంది?
ఒకవేళ మీరు 15 ఏళ్ల పాటు ప్రతినెలా ₹3,000 చొప్పున ఎస్ఐపీ లో ఇన్వెస్ట్ చేస్తూ, సగటున 12 శాతం వార్షిక రిటర్న్ పొందితే, మీ ఇన్వెస్ట్‌మెంట్ సమయంతో పాటు గణనీయంగా పెరుగుతుంది. 15 ఏళ్ల వ్యవధిలో మీరు చేసే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ. 5.40 లక్షలు అవుతుంది. దీనిపై అంచనా ప్రకారం రూ. 8.87 లక్షల వరకు లాభం లభిస్తుంది. దీనితో మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి వచ్చే మొత్తం కార్పస్ ఫండ్ దాదాపు రూ. 14.30 లక్షలకు చేరుకుంటుంది. ఎస్ఐపీలో చక్రవడ్డీ, సుదీర్ఘ కాల మార్కెట్ గ్రోత్ కలిసి మీ డబ్బును వేగంగా పెంచుతాయి.
పీపీఎఫ్ స్కీమ్ ద్వారా 15 ఏళ్లలో లభించే రిటర్న్స్ ఎంత?
ఇదే రూ. 3,000 మొత్తాన్ని ప్రతినెలా పీపీఎఫ్ లో 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ రూ. 5.40 లక్షలుగానే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే, ఈ 15 ఏళ్లలో మీకు లభించే వడ్డీ లాభం దాదాపు రూ. 4.14 లక్షలు ఉంటుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే మొత్తం సుమారు రూ. 9.54 లక్షలు మాత్రమే. దీనిబట్టి ఎస్ఐపీ తో పోలిస్తే పీపీఎఫ్ లో లభించే రిటర్న్స్ తక్కువగా ఉంటాయని స్పష్టమవుతోంది.
ఏది సరైన ఎంపిక? ఏ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్?
ఇక్కడ క్యాలిక్యులేషన్ క్లియర్‌గా చెప్తోంది. 15 సంవత్సరాల వ్యవధిలో ఎస్ఐపీ ద్వారా పీపీఎఫ్ కంటే దాదాపు రూ. 6 లక్షల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు మార్కెట్ రిస్క్ అస్సలు తీసుకోకూడదు అనుకుని, పక్కా గ్యారెంటీగా టాక్స్-ఫ్రీ రిటర్న్స్ కావాలని కోరుకుంటే పీపీఎఫ్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించి, మీ సంపదను వేగంగా పెంచుకోవడమే మీ ప్రధాన లక్ష్యం అయితే ఎస్ఐపీ ఎంతో మెరుగైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.





