నెలకు రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.50 లక్షలు పొందొచ్చు
డబ్బులు దాచుకోవడం ద్వారా ఆదాయం పొందే మార్గాలు చాలా ఉన్నాయి. నెలకు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మీరు భారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఇలాంటిదే ఇప్పుడు మీరు తెలుసుకోనున్నారు. ఈ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ మీకు భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఆ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రతి మనిషి జీవితంలో సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే సేవింగ్స్ చేయడం గురించి చాలా మంది ఆలోచించరు. ప్రస్తుత అవసరాలు తీరేందుకు ఆలోచిస్తారు. అత్యవసరమైనప్పుడు అప్పులు చేసి తర్వాత నెమ్మదిగా తీర్చకుంటారు. ఇది సరైన విధానం కాదు. అప్పుల వల్ల మీ కష్టమంతా వడ్డీల రూపంలో వెళ్లిపోవడం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అనుకోని అవసరం, ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనప్పుడు సేవింగ్ లేవని బాధ కలుగుతుంది. అలా జరగకుండా ఉండటానికి అందరూ సేవింగ్స్ గురించి ప్లాన్ చేసుకోవాలి.
పొదుపు ప్రారంభించే ముందు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. మీ ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయాలి. ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు కోసం కేటాయించడం అలవాటు చేసుకోవాలి. చాలామంది ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన దాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఖర్చులకు ముందు పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.
ధనవంతులైతే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి చూస్తారు. అయితే మిడిల్ క్లాస్, రోజు వారీ ఆదాయం సంపాదించే వారు భారీ స్థాయలో పెట్టుబడులు పెట్టలేరు. అలాంటి వారి కోసం SIP (సింపుల్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) మంచి ఆలోచన అవుతుంది. అలాంటివే మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ లో మంచి రాబడి పొందవచ్చు. దీనికి వడ్డీ రేటు కూడా భాగా వస్తుంది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు 12% వడ్డీ వృద్ధి రేటు పొందాలంటే కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.5 వేలు చొప్పున 20 ఏళ్లు పెట్టుబడి పెడితే దాదాపు రూ.50 లక్షలు పొందవచ్చు. ఇందులో మీ పెట్టుబడి కేవలం రూ.12 లక్షలు మాత్రమే. మిగిలినదంతా లాభమే.
ఇదే ఈక్విిటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు నెలకు రూ.10 వేలు చొప్పున 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే 12 శాతం వడ్డీరేటుతో మీరు రూ.1 కోటి రాబడిగా పొందవచ్చు.
అదే మీరు SIP పథకంలో 25 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే మరింత ఆదాయం పొందవచ్చు. అంటే నెలకు రూ.5,000 చొప్పున పెట్టుబడి పెడితే 12% వృద్ధి రేటుతో 25 సంవత్సరాలకు రూ.95 లక్షల వరకు పొందవచ్చు.
అదే మీరు నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే 25 ఏళ్లకు రూ.1.9 కోట్ల ఆదాయం వస్తుంది. అదేవిధంగా 30 సంవత్సరాలకు నెలకు రూ.3,000 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ మొత్తం రూ.1 కోటి దాటిపోతుంది. ఈ అమౌంట్ మీకు సరైన సమయంలో మీ అవసరాలను తీరుస్తుంది.
ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి గడువును పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు 20 సంవత్సరాలలో మీ పిల్లల చదువుకు రూ.25 లక్షలు అవసరమైతే 25 సంవత్సరాల తర్వాత చదువుకు అవసరమైన మొత్తం రూ.35 లక్షలకు పెరగవచ్చు. అందువల్ల మీ ఆదాయ మార్గాలను లెక్కించుకొని దానికి తగ్గట్టుగా రూ.5 వేలు, రూ.10 వేలు ఇలా ఎంత పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తులో అంత ఎక్కువ మొత్తంలో మీరు లాభాన్ని పొందగలరు.
SIP కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వల్ల ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పెట్టుబడిని నిర్ణయించుకోవచ్చు. లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొని, దానికి అనుగుణంగా పెట్టుబడిని సర్దుబాటు చేసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకునేంత ఆదాయం వస్తుంది.
2, 3 మ్యూచువల్ ఫండ్ పథకాలలో SIP పెట్టుబడిని ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫండ్స్ వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్ రంగాలలో వైవిధ్యమైనవిగా ఉండాలి.
ఇప్పటికే అలా చేయకపోతే దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుని పొదుపు ప్రారంభించడం మంచిది. పెట్టుబడిని ఆలస్యం చేస్తే లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం. ముందుగానే పొదుపు ప్రారంభించడం ద్వారా తక్కువ మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసి మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.