Gold Prices: బంగారం ఎఫెక్ట్.. పెళ్లి ఖర్చు రెట్టింపు అయిపోయింది, చెబుతున్న సర్వే
Gold Prices: భారత్‌లో మధ్యతరగతి పెళ్లి ఖర్చు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఘనంగా పెళ్లి చేసే అవకాశం పేద, మధ్యతరగతి వాళ్లకు కష్టమైపోతుంది. ఎందుకంటే బంగారం ధరలు రెట్టింపు కావడంతో మధ్యతరగతి వారు పెళ్లి ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తుంది.

రెట్టింపైన పెళ్లి ఖర్చు
మనదేశంలో పెళ్లిళ్లు చాలా ఘనంగా చేస్తారు. సింపుల్‌గా పెళ్లి చేసుకునేవారి సంఖ్య చాలా తక్కువ. పెళ్లి అనగానే ప్రతి కుటుంబం తమ శక్తికి మించి పెళ్లికి ఖర్చు చేస్తుంది. కానీ 2025లో పెళ్లి ఖర్చు రెట్టింపు అయింది. పెళ్లి ఖర్చు 8 శాతం పెరిగిపోయింది. పెళ్లి ఖర్చు పెరగడానికి ముఖ్య కారణం బంగారం ధర పెరగడమే. పెళ్లిలో బంగారం చాలా ముఖ్యం. అందుకే మొత్తం పెళ్లి ఖర్చు భారీగా పెరిగింది. ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదలతో పెళ్లి చాలా ఖరీదైనదిగా మారింది.
పెళ్లి ఖరీదుగా మారడానికి ఒక కారణం
మనదేశంలో బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. పెళ్లికి ముఖ్యంగా ఉండాల్సిన బంగారమే. సామాన్య కుటుంబాలకు బంగారం కొనడం పెద్ద భారంగా మారింది. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలు వివాహం చేయడానికి కష్టపడేవారు.ఇప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పెళ్లిలో వధువుకు ఇవ్వాల్సిన బంగారు ఆభరణాలు ఖర్చులో పెద్ద భాగం. బంగారం ధర పెరగడంతో పెళ్లి మొత్తం బడ్జెట్ ఒక్కసారిగా రెట్టింపు అవుతోంది.
మధ్యతరగతి పెళ్లి 5 నుంచి 8 లక్షల ఖర్చుతో చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ఖర్చు 8 నుంచి 15 లక్షలకు పెరిగింది. తక్కువ ఖర్చుతో చేసే పెళ్లిళ్లు కూడా 4 నుంచి 6 లక్షలకు పెరిగాయి. గ్రాండ్ వెడ్డింగ్స్ ఖర్చుకు లెక్కే లేదు.
వచ్చే ఏడాది మరింతగా...
వెడ్ మి గుడ్ వెబ్ టెక్ సంస్థ ప్రకారం, బంగారం ధర పెరగడంతో పెళ్లి ఖర్చు 8 శాతం పెరిగింది. సగటు పెళ్లి ఖర్చు ఇప్పుడు 39.5 లక్షలకు చేరింది. 2026లో ఈ ధర ఇంకా పెరుగుతుందని వెడ్ మి గుడ్ రిపోర్టు చెబుతుంది.
మెడలో మంగళసూత్రం నుంచి చెవిపోగులు, గాజులు, ఉంగరాల వరకు ఎన్నో రకాల ఆభరణాలు పెడుతూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఒక తులం బంగారం ధర సాధారణంగా ఉండేది. ఇప్పుడు అదే తులం ధర చాలా ఎక్కువగా మారింది. ఫలితంగా, పాత రోజుల్లో ఇచ్చే బంగారం పరిమాణాన్ని తగ్గించలేక చాలామంది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బంగారం ధర పెరగడంతో పాటు, మేకింగ్ చార్జీలు కూడా పెరగడం పరిస్థితిని మరింత కఠినంగా మార్చింది.
50 లక్షల పెళ్లి ఖర్చు కోటికి చేరింది
మనదేశంలో 50 లక్షల రూపాయలతో జరిగే పెళ్లిళ్లు ఇప్పుడు కోటి రూపాయలకి చేరాయని వెడ్ మి గుడ్ టెక్ సంస్థ సర్వేలో బయటపడింది. బంగారం ధరతో పాటు పెళ్లి వేడుకల రోజులు పెరగడం కూడా దీనికి కారణమని నివేదిక చెబుతోంది.
బంగారం ధర పెరుగుదల ప్రభావం కేవలం ఆభరణాల మీదే ఆధారపడి లేదు. పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఇతర ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కళ్యాణ మండపాల అద్దె, భోజన ఖర్చులు, డెకరేషన్, ఫోటోగ్రఫీ వంటి అంశాల్లో ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు బంగారం ఖర్చు రెట్టింపు కావడంతో మొత్తం వివాహ బడ్జెట్ పెరిగిపోతుంది. అందుకే చాలామంది పెళ్లిని సాదాసీదాగా నిర్వహించాలనే ఆలోచనలో పడుతున్నారు.

