MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • సైలెంట్ గా ఇన్వెస్టర్ల రూ. 1 లక్ష పెట్టుబడిని 2 ఏళ్లలో రూ.4.80 లక్షలు చేసిన ప్రభుత్వ కంపెనీ ఇదే…

సైలెంట్ గా ఇన్వెస్టర్ల రూ. 1 లక్ష పెట్టుబడిని 2 ఏళ్లలో రూ.4.80 లక్షలు చేసిన ప్రభుత్వ కంపెనీ ఇదే…

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న కర్ణాటకలోని తుమ్మకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ చెందిన హెలికాప్టర్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు.  దీంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ షేర్లు నేడు మార్కెట్లో మెరిశాయి.  హెచ్ఎఎల్ కంపెనీ  పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే ఈ కంపెనీ ఐపిఓ వచ్చినప్పటి నుంచి నేటి వరకు గమనించినట్లయితే ఇన్వెస్టర్ల డబ్బును రెండింతలు చేసింది అనడంలో ఎలాంటి సందేహము లేదు. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Feb 07 2023, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మార్చి 28, 2018న హెచ్ఎఎల్ కంపెనీ లిస్ట్ అవగా, రూ.1130 వద్ద ఒక్కో షేర్ ధర పలికింది. అయితే అక్కడి నుంచి ఈ స్టాకు పెద్దగా పుంజుకోలేదు. 2020 ఏప్రిల్ 30వ తేదీన ఈ స్టాకు కనిష్ట స్థాయి అయినా 520 రూపాయల వద్దకు పడిపోయింది. అయితే హెచ్ఏఎల్ స్టాక్ క్రమంగా గడిచిన రెండు సంవత్సరాలుగా గమనించినట్లయితే,  కనిష్ట స్థాయి అయిన 500 నుంచి ప్రస్తుతం ఏకంగా రూ. 2400 వరకు ఎగిసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అంటే సుమారు 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో హెచ్ఐవి షేర్లను 520 చొప్పున 200 షేర్లను కొనుగోలు చేసి ఓ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం అవి 4,80,000 రూపాయలు అయి ఉండేవి.  నిజానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఈ స్థాయిలో  షేరు ధర కేవలం రెండు సంవత్సరాలు వ్యవధిలో ఐదింతలు పెరగడం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. 
 

35

అంతేకాదు ఈ స్టాక్ తన గరిష్ట స్థాయి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని ICICI సెక్యూరిటీస్ బయ్ రేటింగ్ ఇవ్వడం విశేషం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఫ్రెష్ టార్గెట్ ధర రూ. 2675 గా నిర్ణయించడం విశేషం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. 2438గా ఉంది.  స్టాప్ లాస్‌ను రూ.2365 నిర్ణయిస్తూ సిఫార్సు చేశారు. 
 

45

1963 సంవత్సరములో స్థాపించిన ఈ సంస్థ రక్షణ శాఖ కింద పనిచేస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒక లార్జ్ క్యాప్ సంస్థ సుమారు రూ. 82640.53 కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీ సొంతం.  హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఆదాయం విషయానికి వస్తే 31-మార్చి-2022తో ముగిసే సంవత్సరానికి ఇంజినీరింగ్ వస్తువులు, విడిభాగాలు, అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, ఇతర నిర్వహణ ద్వారా  ఆదాయం వస్తుంది. 
 

55

30-09-2022తో ముగిసిన త్రైమాసికానికి, కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం Rs 5403.86 కోట్లుగా తెలిపింది. గత త్రైమాసికపు మొత్తం ఆదాయం Rs 3814.10 కోట్లతో పోల్చితే ఇది 41.68  శాతం ఎక్కువ అనే చెప్పాలి. ఇటీవలి త్రైమాసికములో పన్ను తరువాత నికర లాభాన్ని రూ. 1218.94 కోట్లుగా కంపెనీ నివేదికలో పేర్కొంది. 
 

About the Author

KA
Krishna Adhitya
స్టాక్ మార్కెట్
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: జూన్ 30 తర్వాత ఇప్పుడున్న నోట్లన్నీ రద్దు కానున్నాయా.. మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు.?
Recommended image2
Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..రూ.22వేలు తగ్గిన బంగారం ధరలు
Recommended image3
Bank Rules: ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే అకౌంట్‌లో డ‌బ్బులు ఏమ‌వుతాయి.? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయిa
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved