MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • gold price భారీగా తగ్గిన బంగారం ధర.. కొనడానికి ఇదే భలే ఛాన్స్?

gold price భారీగా తగ్గిన బంగారం ధర.. కొనడానికి ఇదే భలే ఛాన్స్?

  Gold price: మొన్నటివరకు జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నాలుగైదు రోజులుగా క్షీణతకు గురవుతున్నాయి. మరి బంగారం ప్రియులు ఈ యెల్లో మెటల్ ని కొనడానికి ఇదే సరైన సమయమా? లేకపోతే మరికొన్నాళ్లు ఎదురుచూడాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

2 Min read
Author : Anuradha B
| Updated : Apr 14 2025, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మార్కె ట్లో బంగారం కొనుగోలు విషయంలో స్తబ్దత నెలకొంది. నాలుగైదు రోజులుగా వరుసగా ధర తగ్గుతోంది. అయినా ఇప్పటికీ  ఆల్ టైం రికార్డు ధరకి దగ్గర్లోనే ఉంది.  ఏప్రిల్ 14వ తేదీ నాటికి 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 95,660 పలుకుతోంది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరరూ. 87,690. ఒక కిలో వెండి ధరరూ. 1,01,900 ఉంది.

24

కొద్దిరోజులతో పోల్చి చూస్తే ధరలు దాదాపు వెయ్యి రూపాయలకు పైగానే తగ్గింది. అయితే పెరిగినదానితో పోలిస్తే ఇది మరీ ఎక్కువేం కాదు. ధర ఇప్పటికీ ఆల్ టైం కి దగ్గర్లోనే ఉంది. రెండు వారాల్లో  పసిడి ధరలు రూ.10వేలకు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే బంగారం ధర అత్యంత వేగంగా పెరగడానికి కారణం. ప్రస్తుత అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3200 డాలర్లపైనే ఉంది. బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా మార్కెట్లో డాలర్ బలం క్షీణించడం ఒక కారణమని చెప్పవచ్చు. 

34

ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చి చూస్తే డాలర్ విలువ తగ్గుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు.  ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమెరికా-చైనా టారిఫ్ వార్ ఇంకా ముదిరే ప్రమాదం ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పడుతున్నాయి. దాంతో సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకొని జనం అందులో పెట్టుబడి పెడుతున్నారు.

44

భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా, లేదా పెరుగుతాయా అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా కచ్చితమైన సమాధానం లేదు. అంతర్జాతీయ ట్రేడ్ వార్ ఇంకా ముదిరితే మాత్రం పసిడి ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏమాాత్రం తెరిపినిచ్చినా భారీగా పడే అవకాశం ఉంది. మార్నింగ్ స్టార్ అనే అమెరికన్ సంస్థ అంచనాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై వేసిన సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేయడంతో ట్రేడ్ వార్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ పరిస్థతి ఇలాగే కొనసాగితే గోల్డ్ ధర ఆల్ టైం హై నుంచి 40శాతం క్షీణిస్తుందని ఆ సంస్థ చెబుతోంది.  ఈ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు ప్లాన్ చేసుకోవచ్చు. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
పర్సనల్ పైనాన్స్
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved