ఇడ్లీ, దోస పిండి అమ్ముతూ ఈ కుర్రాడు ఏడాదికి రూ. 300 కోట్లు సంపాదిస్తున్నాడు..ఎలాగో తెలుసుకోండి..?
జీవితంలో సక్సెస్ సాధించాలంటే… షార్ట్ కట్ దారులు లేవు… కష్టపడి పనిచేస్తూ వినూత్నంగా ఆలోచిస్తేనే జీవితంలో సక్సెస్ సాధించగలం. కేరళలోని కాపీ తోటలో పనిచేసే ఓ కూలీ కుమారుడు నేడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు. అతను చేసిన వ్యాపారం ఏంటో తెలిస్తే మీరే షాక్ తింటారు కేవలం ఇడ్లీ పిండి దోశ పిండి విక్రయించడం ద్వారా అతను వందల కోట్ల వ్యాపారానికి అధిపతి అయ్యాడు.
id foods
ఇడ్లీ దోశ పిండి అమ్ముకొని కోట్లు సంపాదించవచ్చా ఈ మాట వింటే ఎవరైనా నవ్వుతారు. మన వీధి చివర తోపుడుబండ్ల పైన దశాబ్దాల తరబడి ఇడ్లీ దోశ అమ్ముకునే వారు ఇంకా వారి ఆర్థిక పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అని అంటే ఉంది. కానీ ఈ కుర్రాడు మాత్రం ఇడ్లీ దోశ కూడా కాదు కేవలం వాటి పిండి అమ్మి వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతను మరెవరో కాదు పిసి ముస్తఫా. కేరళకు చెందిన ఈ కుర్రాడు ఐడి ఫ్రెష్ పేరిట సంస్థను స్థాపించి కేవలం ఇడ్లీ పిండి దోశల పిండి ప్యాకింగ్ చేసి అమ్మి నేడు వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది ఎలా సాధ్యం అతని విజయ గాథను ఇప్పుడు మనం తెలుసుకుంటాం.
id foods
కేరళలోని వాయనాడు జిల్లాలో జన్మించిన ముస్తఫా, నిరుపేద కుటుంబంలోనే జీవించాడు. అతని తండ్రి కాఫీ తోటల్లో ఓ కూలీగా పని చేసేవాడు. అతని తల్లి నిరక్షరాస్యురాలు. చిన్నతనంలో ముస్తఫా సైతం కాఫీ తోటల్లో తన తండ్రితో పాటు కలిసి పని చేసేవాడు. ఆ క్రమంలోనే స్కూలుకు సైతం వెళ్లేవాడు అయితే పని ఒత్తిడి వల్ల ముస్తఫా తన చదువు పైన శ్రద్ధ పెట్టలేకపోయాడు. దీంతో అతడు ఆరవ తరగతి ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. . కానీ పట్టుదలతో చదివి పదో తరగతిలో క్లాస్ లోనే టాపర్గా నిలిచాడు.
id foods
తన కష్టపడే గుణంతోనే ముస్తఫా ఎన్ ఐ టి లో ఇంజనీరింగ్ సీటు సంపాదించుకున్నాడు అక్కడే ఓ మంచి మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సైతం సంపాదించుకున్నాడు. మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తూ ముస్తఫా యూరప్ అమెరికా వంటి దేశాల్లో పని చేశాడు అయితే అక్కడ అతనికి సంతృప్తి లభించలేదు దీంతో తన మాతృదేశానికి తిరిగి వచ్చేసాడు. 2005లో ముస్తఫా బెంగళూరు నగరంలో ఉన్న సమయంలో మంచి టిఫిన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని భావించాడు.
id foods
అప్పుడే అతను ఇడ్లీ దోశ పిండిని విక్రయించడం ద్వారా మార్కెట్ పొందవచ్చని ఊహించాడు. వెంటనే అదే సంవత్సరం ఐడి ఫ్రెష్ ఫుడ్ పేరిట ఇడ్లీ దోశ పిండిని విక్రయించడం ప్రారంభించాడు మొదట్లో ముస్తఫా 550 స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రదేశంలో ఇడ్లీ దోశ పిండి తయారు చేసి 100 ప్యాకెట్లను విగ్రహించడం టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ వంద కాస్త వెయ్యి ప్యాకెట్లకు పెరిగింది. నెమ్మదిగా మార్కెట్ పరిధిని విస్తరిస్తూ మెట్రో నగరాలకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ముస్తఫా దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పాటు ప్రధాన నగరాల్లో తన వ్యాపారాన్ని విస్తరించాడు.
id foods
పిసి ముస్తఫా ఐడి ఫ్రెష్ ఫుడ్ ప్రారంభంలో 5,000 కిలోల బియ్యంతో 15,000 కిలోల ఇడ్లీ మిశ్రమం తయారు చేసేవారు. నేడు, ఈ కంపెనీ వందలాది ఫుడ్ స్టోర్లు మెట్రో నగరాల్లో నాలుగు రెట్లు ఎక్కువ మిశ్రమాన్ని విక్రయిస్తోంది. నేడు పిసి ముస్తఫా దేశంలోని బ్రేక్‌ఫాస్ట్ కింగ్‌గా ప్రసిద్ధి చెందారు. కంపెనీ వార్షిక టర్నోవర్ 2015-2016 సంవత్సరంలో సుమారు రూ. 100 కోట్లు, ఇది 2017-1018లో రూ. 182 కోట్లు పెరిగింది. హోమ్-గ్రోన్ బ్రాండ్, iD ఫ్రెష్ ఫుడ్ FY21లో రూ. 294 కోట్ల ఆదాయంతో ముగిసింది, FY20లో రూ. 238 కోట్ల నుండి 23.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.