Money: కేవలం రూ. 10 వేలు కడితే చాలు.. జీవితాంతం మీరు కట్టిన డబ్బుకు డబుల్ వస్తుంది..
Money: ఎస్బిఐ లైఫ్ 'స్మార్ట్ ప్లాటినా సుప్రీమ్' ప్లాన్ రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీడ్ ఇన్కమ్ ఇచ్చే అద్భుతమైన పథకం. 10 ఏళ్లు ప్రీమియం చెల్లించి, 60 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల పాటు స్థిరమైన రాబడిని పొందవచ్చు.

ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా సుప్రీమ్:
ఎస్బిఐ లైఫ్ వారి స్మార్ట్ ప్లాటినా సుప్రీమ్ ప్లాన్ మీ రిటైర్మెంట్ గోల్స్‌ను చేరుకోవడానికి ఒక గొప్ప ఆప్షన్. ఇది మార్కెట్ రిస్క్ లేని గ్యారెంటీడ్ ఇన్కమ్ ప్లాన్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత రాబడి వస్తుంది అనే విషయాలు పాలసీ బాండ్‌లోనే స్పష్టంగా ఉంటాయి. మీ భవిష్యత్తు అవసరాల కోసం సరైన నిర్ణయం తీసుకోండి.
వయసు, అర్హత:
ఈ ప్లాన్ 3 ఏళ్ల చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల వయసు గల పెద్దల వరకు అందరికీ అందుబాటులో ఉంది. ముఖ్యంగా 40-50 ఏళ్ల వయసులో ఉన్నవారు తమ 60 ఏళ్ల తర్వాత వచ్చే ఖర్చుల కోసం ఈ ప్లాన్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత ఖర్చులు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం ఇది ఒక భరోసాగా ఉంటుంది.
ఫ్లెక్సిబిలిటీ ఫీచర్స్:
ప్రీమియం చెల్లించే విషయంలో, రాబడిని పొందే విషయంలో ఎస్బిఐ లైఫ్ ఎంతో వెసులుబాటును కల్పిస్తోంది. మీరు నెలవారీ, మూడు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి ప్రీమియం కట్టవచ్చు. అలాగే మీ గ్యారెంటీడ్ ఇన్కమ్ కూడా మీకు నచ్చిన విధంగా(నెలవారీ లేదా ఏడాదికి) పొందే అవకాశం ఈ స్మార్ట్ ప్లాటినా సుప్రీమ్ ప్లాన్‌లో ఉంది.
లైఫ్ కవరేజ్, రైడర్స్:
ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవచ్చు. పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి తక్షణ ఆర్థిక సాయం అందడమే కాకుండా, భవిష్యత్తులో రావాల్సిన పే-అవుట్స్ కూడా యథావిధిగా అందుతాయి.
మెచ్యూరిటీ, టాక్స్ బెనిఫిట్స్:
ఇన్కమ్ పే-అవుట్ పీరియడ్ ముగిసిన తర్వాత అందే మెచ్యూరిటీ అమౌంట్ పూర్తిగా టాక్స్ ఫ్రీ. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(D) ప్రకారం ఈ ప్రయోజనాన్ని కల్పిస్తారు. తక్కువ కాలం ప్రీమియం కట్టి, ఎక్కువ కాలం రాబడిని పొందాలనుకునే వారికి, ముఖ్యంగా మనవలు, మనవరాళ్లకు గిఫ్ట్‌లు ఇవ్వాలనుకునే తాతయ్యలకు ఇది బెస్ట్ ప్లాన్.

