health insurance policy: రూ.500 కంటే తక్కువకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చా?
health insurance policy: ఈ రోజుల్లో సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఎప్పుడు అవసరమవుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అయితే ఈ పాలసీ కోసం భారీగా ఖర్చుపెట్టాలని అనుకుంటారు. చాలా తక్కువ ప్రీమియంతో కొన్ని కంపెనీలు రూ.లక్షల కవరేజీ ఇస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వైద్యం కోసం ఆస్తులు అమ్మాల్సిన రోజుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. వైద్యం అంత ఖరీదైపోయింది మరి. చిన్న ఆరోగ్య సమస్య అని హాస్పిటల్ కి వెళితే రూ.లక్షలు ఖర్చు పెట్టిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వైద్య ఖర్చుల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పుడొచ్చే రోగాలు కూడా చాలా భయంకరంగా ఉంటున్నాయి. నీరసంగా ఉందని హాస్పిటల్ కి వెళితే బీపీ డౌన్ అయిపోయి ప్రాణాలు కోల్పోతున్న వారు చాలా మంది ఉన్నారు.
అందుకే అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఈ బీమా సౌకర్యం వివిధ కంపెనీలు వివిధ రకాల మోడల్స్ లో అందిస్తున్నాయి. అయితే చాలా మంది నుంచి వచ్చే కంప్లయింట్ ఏంటంటే.. అధిక ప్రీమియంలు చెల్లించినా అవసరమైన ప్రయోజనాలు లభించడం లేదని.. హెల్త్ బీమా కార్డు ఉన్నప్పటికీ కొన్ని ఆసుపత్రిల్లో చేరితే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోంది.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు సరైన పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలా కంపెనీలు తక్కువ ప్రీమియంకే రూ.లక్షల కవరేజీ ఇచ్చే హెల్త్ పాలసీలు ఇస్తున్నాయి.
రాయల్ సుందరం, యూనివర్సల్, రహేజా వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు నెలకు రూ.500 కంటే తక్కువకు ప్రీమియం కట్టించుకుంటూ మెరుగైన వైద్యం అందించే హాస్పిటల్స్ తో పనిచేస్తున్నాయి.
కేర్, నివా, స్టార్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఐసీఐసీఐ, బజాజ్, మణిపాల్, కోటక్ వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు నెలకు రూ.1000 కంటే తక్కువ ప్రీమియంతో రూ.5 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కవరేజ్ ఇస్తున్నాయి.
అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ, టాటా, జునో, వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.1000 పైన మంత్లీ ఇన్టాల్మెంట్ కట్టించుకుంటూ ఎక్కువ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందేలా చూస్తున్నాయి.
మీరు ఏ కంపెనీ పాలసీ తీసుకున్నా ముఖ్యంగా చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే.. మీ దగ్గర్లో ఉన్న సిటీస్ లేదా టౌన్స్ లో ఏఏ హాస్పిటల్స్ లో మీరు తీసుకోబోయే హెల్త్ కార్డు పనిచేస్తుందో తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ అందే విషయంలోనూ హాస్పిటల్స్ ఎలా వ్యవహరిస్తున్నాయి.? ఏఏ వ్యాధులకు చికిత్స చేస్తారు? మీకు దగ్గర్లో ఎక్కడ మెరుగైన వైద్యం అందుతుంది.? తదితర విషయాలు పరిగణించి మీ బడ్జెట్ కు తగ్గట్టుగా పాలసీ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి ఇవి తింటే క్యాన్సర్ రావడం ఖాయం