MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • నేటి మహిళల కోసం బెల్లా కలెక్షన్‌ ఆవిష్కరించిన రిలయన్స్ జ్యువెల్స్

నేటి మహిళల కోసం బెల్లా కలెక్షన్‌ ఆవిష్కరించిన రిలయన్స్ జ్యువెల్స్

14 సెప్టెంబర్‌ 2021:  రిలయన్స్ జ్యువెల్స్  ప్రత్యేకమైన ఆభరణాల కలెక్షన్‌లో నేటి మహిళల కోసం సరికొత్త డిజైన్‌, “బెల్లా- ప్రతీ రోజు ప్రత్యేకం’ ఆవిష్కరించింది. ఫ్యాషన్ ఆభరణాల్లో ఈ బ్రాండ్‌ ఇప్పటికే  సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు ఉన్న ఈ కొత్త కలెక్షన్‌ ప్రతీ విలువైన ఆభరణాన్ని సమానంగా చూపుతుంది.

3 Min read
Author : Ashok Kumar
Published : Sep 14 2021, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బెల్లా అంటే కలెక్షన్ కంటే ఎక్కువ. అది ఒక యాటిట్యూడ్‌. అది ఒక స్టేట్‌మెంట్‌. మహిళలను ప్రతీరోజు ప్రత్యేకంగా తీర్చిదిద్దేలా డిజైన్‌ చేయబడింది ఈ కలెక్షన్. కనీస స్థాయిలో సమకాలీన ఫ్యాషన్‌కు అనుగుణంగా ఉండే బెల్లా ఆభరణాలు మిలీనియల్స్‌కు, నేటి మహిళలు కొనుగోలు చేసేందుకు సరైనవి. రోజువారీ ధరించేందుకు భారీ డిజైన్లకు ఈ ట్రింకెట్స్‌ చక్కని ప్రత్యామ్నాయం. కచ్చితత్వం, సున్నితమైన డిజైన్‌, అద్భుతమైన కూర్పుతో కూడిన ఈ సుందరమైన కలెక్షన్స్ మీ రోజువారీ మధురక్షణాలు, చక్కని డిన్నర్స్‌, ఫ్రెండ్స్‌తో షాపింగ్‌, సండే బ్రంచ్‌లు, కుటుంబ సభ్యులతో సెలవులు, ఇంట్లో నిర్వహించే చిన్న వేడుకలు, వీకెండ్‌ పార్టీలు, డిన్నర్‌ డేట్స్‌  వంటి సందర్భాలకు చక్కగా సరిపోతాయి. నిత్యం కష్టపడి పనిచేస్తూ జీవితంలోని మామూలు సమయాన్ని కూడా ఆస్వాదించే ప్రతీ మహిళ శక్తి, అందానికి ప్రతీ రూపంగా నిలుస్తాయి ఈ కలెక్షన్స్.  ఒక వరుస, అనేక వరుసల చైన్లు, ఎల్లో గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌లో పొదిగిన ఉంగరాలు కూడా ఉన్నాయి ఈ కొత్త డిజైన్లలో. రూ.6750/-నుంచి ప్రారంభమయ్యే ఈ కలెక్షన్స్ ధర అందరికీ అందుబాటులో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన బెల్లా ఫిల్మ్‌ మొత్తం కలెక్షన్‌, డిజైన్‌ను చూపుతుంది. స్వతంత్రంగా, నిర్భయంగా, సంతోషంగా ఉంటూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ ప్రతీరోజు  ఏదైనా సాధించాలనే తపన కలిగిన నేటి మహిళకు ఇది ఒక నీరాజనం.  ఆ ఫిల్మ్‌ లింక్‌ ఇది:- https://youtu.be/UALfZutcoHk


కొత్త కలెక్షన్‌ ఆవిష్కరణ సందర్బంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్‌ నాయక్‌ మాట్లాడుతూ, “ బెల్లా కలెక్షన్స్‌ను రిలయన్స్ జ్యువెల్స్‌లో లాంచ్ చేస్తుండటం మాకు సంతోషం కలిగిస్తోంది. అద్భుతమైన సౌందర్యానికి ప్రతిబింబంగా నిలిచే ఈ కలెక్షన్‌లోని ప్రతీ డిజైన్‌ నేటి మహిళ స్టైల్, సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. సమకాలీన ఆభరణాల్లో ఈ సరసమైన రేంజ్‌ అందిస్తుండటం మా కొనుగోలుదారులపై మేము చూపే శ్రద్ధను తెలియజేస్తుంది. ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దిన డిజైన్లు నేటి మహిళలను కచ్చితంగా ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. రాబోయే పండగ సీజన్‌ కోసం మేము మా డిజైన్లను నిరంతరం నవీకరిస్తూనే ఉంటాం” అన్నారు.
భారతదేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ జ్యువెల్స్ ఔట్‌లెట్స్‌ అన్నింటిలో బెల్లా కలెక్షన్‌ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్‌ జ్యువెల్స్‌లో మీరు చేసే కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్‌ కింది స్వర్ణాభరణాల మేకింగ్‌ ఛార్జీల్లో 20% వరకు, డైమండ్‌ ఆభరణాలపై 20% పొందవచ్చు. అన్ని ప్రాంతాల్లోని మా స్టోర్‌ మేనేజర్లు మా స్టోర్లను సందర్శించే కుటుంబాల భద్రత కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించి వాటిని అమలు చేస్తున్నారు.

34

ఈ అద్భుతమైన కలెక్షన్స్ రిలయన్స్ జ్యువెల్స్‌ ప్రతిష్ఠాత్మక షోరూములు, దేశవ్యాప్తంగా షాప్‌-ఇన్-షాప్స్‌తో పాటు రిలయన్స్ జ్యువెల్స్‌ వెబ్‌సైట్‌ https://www.reliancejewels.com లో ప్రత్యేకంగా లభిస్తాయి. 

రిలయన్స్‌ జ్యూవెల్స్ గురించి
భారతదేశంలో టాప్‌ 10 విశ్వసనీయమైన బ్రాండ్స్‌లో ఒకటైన రిలయన్స్ రిటైల్‌ లిమిటెడ్‌లో భాగం రిలయన్స్ జ్యువెల్స్. అద్భుతమైన,  విస్తృత శ్రేణి  గోల్డ్, డైమండ్, ప్లాటినం & సిల్వర్ ఆభరణాల కలెక్షన్స్ అందిస్తుంది ఈ బ్రాండ్. డిజైన్, నైపుణ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కళలు, హస్తకళలు, ఘనమైన భారతీయ వారసత్వం నుంచి ప్రేరణ పొంది ప్రత్యేకమైన, వైవిధ్యమైన డిజైనర్‌ కలెక్షన్స్‌ను కొనుగోలుదారులకు  రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. జీవితంలోని ప్రతీ ప్రత్యేక క్షణాన్ని స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన బంగారపు తాడుతో వేడుకగా జరుపుకోవాలని రిలయన్స్‌ జ్యువెల్స్ నమ్ముతుంది.

భారతదేశంలో 100+ నగరాల్లో 200+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు & షాప్-ఇన్ షాపులు కలిగిన రిలయన్స్‌ జ్యువెల్స్ వాటిని గణనీయంగా విస్తరిస్తోంది. ఖాతాదారులకు అనుపమానమైన సేవలు, ఒక ప్రత్యేకమైన ఆభరణాల కొనుగోలు షాపింగ్‌ అనుభూతిని అందించేందుకు బ్రాండ్‌ ఎల్లవేళల కృషి చేస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో స్వర్ణ, వజ్రాభరణాలు అత్యంత సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జీరో వేస్టేజ్‌, సరసరమైన తయారీ ఛార్జీలు కొనుగోలుదారులకు 100% సంతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జ్యువెల్స్‌ 100 శాతం స్వచ్ఛత, పారదర్శకమైన ధరల విధానం, ప్రతీ వస్తువుపై హమీపూర్వక నాణ్యతను అందిస్తుంది. 100 శాతం బీఐఎస్‌ హాల్‌మార్క్డ్‌ బంగారం, అంతర్జాతీయంగా స్వతంత్ర ధ్రువీకరణ ప్రయోగశాలలు ధ్రువీకరించిన ఆభరణాలను మాత్రమే ఈ బ్రాండ్‌ విక్రయిస్తుంది. రిపేర్ల కోసం క్యూసీ టెక్‌రూమ్స్‌తో పాటు బంగారం స్వచ్ఛతను కొనుగోలుదారులు ఉచితంగా  తెలుసుకునేందుకు క్యారెట్‌ మీటర్‌, ఇంకా ఎన్నో సేవలను రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. ప్రతీ కొనుగోలుపై లాయల్టీ పాయింట్లను కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది.

44

ప్రతీ కలెక్షన్‌లో మైమరపింపజేసే డిజైన్లు కలిగిన రిలయన్స్ జ్యువెల్స్‌లో ప్రతీ వ్యక్తిత్వానికి, ప్రతీ సందర్భానికి ఒక ఆభరణం ఉంది.
మీ సమీపంలోని రిలయన్స్ జ్యువెల్స్‌ షోరూమ్ కనుగొనండి: https://bit.ly/RJStrs   
మా యూట్యూబ్‌ ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయండి - https://bit.ly/3CFj3Y5
మాతో కనెక్ట్‌ అవండి:
ఫేస్‌బుక్‌: https://www.facebook.com/RelianceJewels/
ఇన్‌స్టాగ్రామ్‌: https://www.instagram.com/reliancejewels/

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Recommended image2
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Recommended image3
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved