Recharge plans: అన్‌లిమిటెడ్ కాల్స్, 365 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 5 రూపాయలు మాత్రమే
Recharge plans: వైఫై వినియోగం పెరగడంతో డేటాతో పోల్చితే కాల్స్‌కి ప్రాధాన్యత ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగానే జియో అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్స్‌ను తీసుకొచ్చింది.

ట్రాయ్ సూచనలతో కొత్త మార్పులు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొన్ని రోజుల క్రితం అన్ని టెలికాం సంస్థలకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. డేటా వాడని కానీ కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే అవసరమయ్యే యూజర్ల కోసం చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకురావాలని సూచించింది. ఈ నేపథ్యంలో జియో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది.
డేటా వాడని వినియోగదారులకు
జియో కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్‌లు ముఖ్యంగా డేటా అవసరం లేని వారికి సరిపోతాయి. కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఎక్కువగా వాడే యూజర్లకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. పైగా వీటిలో ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఉండడం ద్వారా వినియోగదారులు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
రూ.448 ప్లాన్
* ఈ కొత్త ప్లాన్‌లో వినియోగదారులకు 84 రోజులపాటు సేవలు పొందొచ్చు.
* అన్ని నెట్‌వర్క్‌లలోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి.
* 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.
* వీటికి అదనంగా జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది.
రూ.1958 ప్లాన్
* ఈ ప్లాన్‌లో మొత్తం 365 రోజులపాటు వాలిడిటీ ఉంటుంది. ఈ లెక్కన రోజుకు సుమారు రూ. 5 ఖర్చు చేస్తారంతే.
* దేశవ్యాప్తంగా ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు.
* 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
* ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉంటుంది.
* వీటికి అదనంగా జియో సినిమా, జియో టీవీ యాప్‌ల యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. ఏడాది పాటు ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
ఎవరికీ ఈ ప్లాన్‌లు సరిపోతాయి?
డేటా వాడకం చాలా తక్కువగా ఉండి, కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ కోసం మాత్రమే ఫోన్ వాడే యూజర్లకు ఈ ప్లాన్‌లు బాగా పనికొస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, బిజీ ప్రొఫెషనల్స్ లేదా ఇంటర్నెట్ వినియోగం అవసరం లేని వారికి ఇవి చౌకగా, సౌకర్యంగా ఉంటాయి. అలాగే సిమ్ యాక్టివేట్ ఉండాలనుకునే వారికి కూడా ఈ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.