MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • సామాన్యుల సొంతింటి క‌ల, క‌ల‌గానే మిగిలిపోనుందా.? రియ‌ల్ ఎస్టేట్‌లో ఏంటీ గంద‌ర‌గోళం..

సామాన్యుల సొంతింటి క‌ల, క‌ల‌గానే మిగిలిపోనుందా.? రియ‌ల్ ఎస్టేట్‌లో ఏంటీ గంద‌ర‌గోళం..

Real estate: భార‌త రియ‌ల్ ఎస్టేట్ రంగంలో వింత ప‌రిస్థితి నెల‌కొంది. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనలేకపోతుండగా, డెవలపర్లు మాత్రం లగ్జరీ టవర్ల‌ను నిర్మిస్తున్నారు. అస‌లు స‌మ‌స్య ఎక్క‌డుంది.? నిపుణులు ఏం చెబుతున్నారంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 30 2025, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆకాశాన్ని అంటుతోన్న ఇళ్ల ధ‌ర‌లు
Image Credit : AI Photo/Google Gemini

ఆకాశాన్ని అంటుతోన్న ఇళ్ల ధ‌ర‌లు

2020 నుండి 2025 మధ్య భారత్‌లో ఇళ్ల ధరలు ప్రతి ఏడాది సగటున 10 శాతం పెరిగాయి. కానీ అదే సమయంలో ఉద్యోగుల జీతాలు కేవలం 5 శాతం మాత్రమే పెరిగాయని గ‌ణంకాలు చెబుతున్నాయి. ఈ అసమాన పెరుగుదలతో సాధారణ కుటుంబాలకు ఇల్లు కొనడం దాదాపు అసాధ్యంగా మారింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో ఒక సాధారణ ఫ్లాట్ కొనాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన ఆదాయం మొత్తం 15 సంవత్సరాల పాటు వెచ్చించాల్సి వస్తోంది. ఇక మరింత త‌క్కువ ఆదాయం ఉన్న వారిలో ఇది ఏకంగా 100 ఏళ్లు ప‌ట్టొచ్చని అంచ‌నా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అదృశ్య‌మ‌వుతోన్న అందుబాటు ధ‌ర‌లో ఇల్లు
Image Credit : Getty

అదృశ్య‌మ‌వుతోన్న అందుబాటు ధ‌ర‌లో ఇల్లు

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్కెట్లో చవక ఇళ్లు దొరకడం దాదాపు అసాధ్యంగా మారింది. హైదరాబాద్‌లో చవక ఇళ్ల లభ్యత 70% తగ్గింది. ముంబైలో 60% తగ్గింది. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో అయితే 50 శాతం త‌గ్గింది. దీని అర్థం బిల్డ‌ర్లు మధ్యతరగతి కోసం కాకుండా కేవ‌లం ధ‌నికుల కోస‌మే ఇల్ల నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది.

Related Articles

Related image1
క‌లికాలం కాక‌పోతే ఏంటిది.? వైన్స్ షాప్‌లో మ‌ద్యం కొంటున్న విద్యార్థినులు. వైర‌ల్ వీడియో..
Related image2
తెలంగాణ‌లో మొంథా బీభ‌త్సం.. 16 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌, స్కూళ్ల‌కు సెల‌వులు
35
లగ్జరీ ట‌వ‌ర్ల‌దే హ‌వా
Image Credit : AI Photo/Google Gemini

లగ్జరీ ట‌వ‌ర్ల‌దే హ‌వా

ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా అమ్ముడ‌వుతోన్న ఇళ్ల‌లో 62 శాతం కోటి రూపాయ‌ల‌కు పైగా ఉన్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఇవి సాధారణ ఉద్యోగులు లేదా మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారుతోంది. బిల్డర్లు అల్ట్రా ప్రీమియం, సిగ్నేచ‌ర్ రెసిడెన్స్ వంటి పేర్లతో హై ఎండ్ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెడుతున్నారు.

45
ఈ ఇళ్ల‌ను ఎవరు కొంటున్నారంటే.?
Image Credit : Google Gemini AI

ఈ ఇళ్ల‌ను ఎవరు కొంటున్నారంటే.?

ఈ లగ్జరీ ఫ్లాట్లు ప్రధానంగా NRIలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, భార‌త్‌లో నివసిస్తున్న మిలియనీర్లు కొనుగోలు చేస్తున్నారు. 2024లో భారత రియల్ ఎస్టేట్‌లో $8.9 బిలియన్ల పెట్టుబ‌డులు వ‌స్తే వీటిలో 63 శాతం విదేశీ పెట్టుబడిదారులే కావ‌డం గ‌మ‌నార్హం.

55
అమ్మకాలు తగ్గినా, ధరలు మాత్రం..
Image Credit : Getty

అమ్మకాలు తగ్గినా, ధరలు మాత్రం..

2024లో అమ్మకాల సంఖ్య 20–25% తగ్గినా, ఇళ్ల ధరల్లో పెద్దగా తగ్గుదల లేదు. ఎందుకంటే ఈ ఇళ్లు కొనేవారు ధనవంతులు.. వీరు ఇళ్ల‌ను త్వరగా అమ్మేయాల్సిన అవసరం లేదు. దీంతో మార్కెట్‌లో క్ర‌య‌విక్ర‌యాల్లో స్థిర‌త్వం ఏర్ప‌డింది. కానీ చవక ఇళ్ల కొరత పెరిగిపోతోంది. ఇది భవిష్యత్తులో పట్టణాల్లో గృహ సంక్షోభానికి దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
క‌లికాలం కాక‌పోతే ఏంటిది.? వైన్స్ షాప్‌లో మ‌ద్యం కొంటున్న విద్యార్థినులు. వైర‌ల్ వీడియో..
Recommended image2
తెలంగాణ‌లో మొంథా బీభ‌త్సం.. 16 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌, స్కూళ్ల‌కు సెల‌వులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved