జనవరి 1 నుంచి లక్షల్లో బ్యాంక్ అకౌంట్స్ పనిచేయవు. అందులో మీవి కూడా ఉన్నాయా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి మూడు రకాల బ్యాంకు అకౌంట్స్ మూసి వేస్తోంది. అందులో మీ బ్యాంకు అకౌంట్ కూడా ఉందేమో చెక్ చేసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త ఆదేశాల ప్రకారం గంగా జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ అవబోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మూడు రకాల బ్యాంక్ అకౌంట్స్ మూసివేయాలని RBI డెసిషన్ తీసుకుంది. బ్యాంకింగ్ లో టెక్నాలజీని, డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆ మూడు రకాల బ్యాంకు అకౌంట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
1. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగని అకౌంట్స్ ని క్లోజ్ చేస్తారు. అంతేకాకుండా ఒక సంవత్సరం పాటు అసలు అకౌంట్ గురించి పట్టించుకోకుండా వదిలేసిన అకౌంట్స్ కూడా పనిచేయవు.
హ్యాకర్లు, అక్రమ డబ్బు బదిలీలకు ఇలాంటి ఇన్ యాక్టివ్ బ్యాంకు అకౌంట్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తారట. అందువల్ల ఇలాంటి ఖాతాలు ఏ బ్యాంకుల్లో ఉన్నా మూసి వేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ ఖాతాలను మూసివేయడం ద్వారా RBI ఆర్థిక నేరాలను నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2. మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ మెయింటెయిన్ చేస్తుంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్స్ యాక్టివేషన్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మీకు తెలియకుండానే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లలో ఏదో ఒకటి క్లోజ్ అయిపోవచ్చు.
భవిష్యత్తులో మీకు అవసరమైన ఖాతాను కోల్పోకుండా ఉండటానికి వెంటనే మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి. మీకు ముఖ్యమైన అకౌంట్ వర్కింగ్ లో ఉండాలంటే వెంటనే ట్రాన్సాక్షన్స్ ప్రారంభించండి. క్రమం తప్పకుండా లావాదేవీలు చేయడం వల్ల మీ ఖాతాలు చురుగ్గా, సురక్షితంగా ఉంటాయి.
3. చాలా కాలంగా ట్రాన్సాక్షన్స్ జరగని జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూడా మూసివేయాలని RBI ప్రకటించింది. పేదల ఆర్థిక డవలప్‌మెంట్ కోసం ఇలాంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఎంకరేజ్ చేస్తే వాటిని నిరుపయోగంగా ఉంచడం వల్ల సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అకౌంట్స్ మిస్ యూజ్ కాకుండా చూసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మీకు కూడా చాలా కాలంగా ఉపయోగించని జీరో బ్యాలెన్స్ ఖాతా ఉంటే దాన్ని తిరిగి యాక్టివేట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. మీ బ్యాంక్‌కి వెళ్లి ఖాతాను యాక్టివేట్ చేయమని వెంటనే రిక్వస్ట్ పెట్టండి.
ఏంచేయాలి..
యాక్టివేషన్ లో లేనివి, రెండు అంతకంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్నవి, జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో మీకు కూడా ఏమైనా ఉంటే వెంటనే అవసరమైన చర్యలు తీసుకోండి. లేకుంటే చాలా నష్టపోతారు. ఇలాంటి అకౌంట్స్ వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలను నివారించడానికే RBI కృషి చేస్తోంది. ఇలాంటి అకౌంట్స్ ని మళ్లీ మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే KYC (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) విధానాలను మళ్లీ పూర్తి చేస్తే సరిపోతుంది. మీ బ్యాంకులకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి తర్వాత ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసి ఉపయోగంలోకి తెచ్చుకోండి.