MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Indigo: రూ.1616 కే ఇండిగో విమానంలో ప్రయాణం చేసే చాన్స్...ఎలాగో తెలుసుకోండి..

Indigo: రూ.1616 కే ఇండిగో విమానంలో ప్రయాణం చేసే చాన్స్...ఎలాగో తెలుసుకోండి..

దేశీయ విమానయన సంస్థ తన 16వ వార్షికోత్సవం సందర్బంగా,  రూ.1616 ప్రారంభ ధరకే విమానయానం చేసే సౌకర్యం కల్పించింది. ఈ కొత్త రేట్లతో ఇండిగో  స్వీట్ 16 ఆఫర్‌ బుకింగ్ ప్రారంభించింది.

Krishna Adhitya | Published : Aug 03 2022, 01:01 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో స్కైస్‌లో 16 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుంది. తన 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ విమానయాన సంస్థ 'స్వీట్ 16' (IndiGo sweet 16 anniversary sale)) పేరుతో వార్షిక ఆఫర్‌లను ప్రవేశపెట్టింది.

26
Asianet Image

కంపెనీ అన్ని దేశీయ రూట్లలో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్ ఆగస్టు 3న ప్రారంభమై ఆగస్టు 5న ముగుస్తుంది. 18 ఆగస్టు 2022 మరియు 16 జూలై 2023 మధ్య ప్రయాణానికి ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. 

36
Asianet Image

ఎయిర్‌లైన్ 16 సంవత్సరాల వార్షికోత్సవం తరువాత, రూ.1616 నుండి సేవలు అందించబడతాయి. ఆగస్టు 5 వరకు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇండిగో HSBC క్రెడిట్ కార్డ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది. కా-చింగ్ కార్డ్‌లపై 1000 రివార్డ్ పాయింట్‌లు అందిస్తున్నారు.

46
Asianet Image

IndiGo Chief Strategy and Revenue Officer సంజయ్ కుమార్ మాట్లాడుతూ, "విమానయాన సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన, అవాంతరాలు లేని సేవలను అందించడంలో విజయవంతమైన పదహారేళ్ళను పూర్తి చేసుకుంది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి, మేము మా వినియోగదారులకు డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు.  

56
Asianet Image

ఇండిగో 4 ఆగస్టు 2006న ఢిల్లీ నుండి గౌహతి మీదుగా ఇంఫాల్‌కు సర్వీసును ప్రారంభించింది. ఇండిగో కంపెనీని అమెరికన్ వ్యాపారవేత్త, ఎన్నారై రాకేష్ గంగ్వాల్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రాహుల్ భాటియా ప్రారంభించారు. ఇండిగో తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని అందించడంతో క్రమంగా భారతదేశంలో ప్రముఖ విమానయాన సంస్థగా మారింది.

66
Asianet Image

ఐదేళ్ల కార్యకలాపాల తర్వాత, ఇండిగో జనవరి 2011లో అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం లైసెన్స్‌ని పొందింది. ఇండిగో మొదటి అంతర్జాతీయ సేవ 1 సెప్టెంబర్ 2011న న్యూఢిల్లీ నుండి దుబాయ్‌కి వెళ్లింది. అంతర్జాతీయ సేవలకు డిమాండ్ పెరగడంతో జెట్ ఎయిర్‌వేస్‌ను అధిగమించి ఇండిగో అధికారికంగా భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది.

Krishna Adhitya
About the Author
Krishna Adhitya
వ్యాపారం
 
Recommended Stories
Top Stories