- Home
- Business
- ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చడం ఖాయం.. ప్రింటెడ్ చాక్లెట్ బిజినెస్‌తో నెలకు లక్ష పక్కా
ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చడం ఖాయం.. ప్రింటెడ్ చాక్లెట్ బిజినెస్‌తో నెలకు లక్ష పక్కా
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇదొక యాడ్ మాత్రమే కాదు. నిజంగా ఒక మంచి ఐడియా మన జీవితాన్ని మార్చడం ఖాయం. వ్యాపారానికి కూడా ఇది వర్తిస్తుంది. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కస్టమైజ్డ్ గిఫ్టులకు పెరుగుతోన్న ఆదరణ
ప్రస్తుత కాలంలో కస్టమైజ్డ్ గిఫ్టింగ్ ట్రెండ్ ఎక్కువైంది. ముఖ్యంగా ప్రింటెడ్ చాక్లెట్లు పుట్టినరోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కార్పొరేట్ గిఫ్టింగ్ వంటి సందర్భాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇది చిన్న పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారం కావడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. దీనిలో పెట్టుబడి, లాభాలు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలు చూద్దాం.
ప్రింటెడ్ చాక్లెట్లకు ఎందుకంత డిమాండ్.?
ప్రస్తుతం గిఫ్టింగ్ కల్చర్ పెరిగింది. వ్యక్తిగత మెసేజ్‌లు, ఫోటోలు, పేర్లు ఉండే కవర్లతో చాక్లెట్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పిల్లల పుట్టిన రోజులు, వివాహాలు, స్నేహితుల వేడుకలు, కార్పొరేట్ ఈవెంట్స్‌లో ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియాలో "యూనిక్ గిఫ్ట్" లా కనిపించడం వల్ల కూడా ట్రెండ్ పెరుగుతోంది.
పెట్టుబడి ఎంత అవసరం?
* ప్రింటింగ్ మెషిన్ – రూ. 70,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు (హై క్వాలిటీ కలర్ ప్రింటింగ్ కోసం).
* ప్యాకేజింగ్ మెటీరియల్స్ – రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు అవుతుంది.
* చాక్లెట్ తయారీ/సప్లైకి మొదట్లో రూ. 10 నుంచి రూ. 20 వేల ఖర్చవుతుంది.
* ఇలా మొత్తం మీద ఈ వ్యాపారాన్ని సుమారు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల్లో ప్రారంభించవచ్చు.
లాభాలు ఎలా ఉంటాయి.?
* ఒక ప్రింటెడ్ చాక్లెట్ కవర్ ఖర్చు సుమారు రూ.10 నుంచి రూ. 15 ఖర్చవుతుంది.
* మార్కెట్‌లో వీటిని రూ. 25 నుంచి రూ. 40 వరకు విక్రయించవచ్చు.
* పెద్ద ఈవెంట్స్‌లో ఒక్క ఆర్డర్‌కు 200–500 చాక్లెట్లు అవసరం అవుతాయి.
* ఇలా చూస్తే ఒక్క ఆర్డర్ నుంచే రూ. 5,000 నుంచి రూ.15,000 వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. నెలలో ఒక్క పది ఆర్డర్లు వచ్చినా కనీసం రూ. లక్ష ఆర్జించవచ్చు.
మార్కెటింగ్ స్ట్రాటజీలు
* సోషల్ మీడియా ప్రమోషన్ – ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు.
* ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో టైఅప్ – పెళ్లిళ్లు, పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్స్‌లో ఆర్డర్లు వస్తాయి.
* ప్రత్యేక ఆఫర్లు – పండుగల సమయంలో గిఫ్ట్ ప్యాక్స్ రూపంలో ఆఫర్లు ఇవ్వాలి.
* ఆన్‌లైన్ స్టోర్ – చిన్న వెబ్‌సైట్ లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా అమ్మకాలు చేయవచ్చు.
భవిష్యత్తు అవకాశాలు
* పెళ్లిళ్లు, బర్త్‌డేలకు మాత్రమే కాకుండా కార్పొరేట్ గిఫ్టింగ్ మార్కెట్ కూడా చాలా పెద్దది.
* కస్టమైజ్డ్ గిఫ్ట్స్ డిమాండ్ తగ్గదని నిపుణులు చెబుతున్నారు.
* దీన్ని ఫ్రాంచైజీ మోడల్‌గా కూడా విస్తరించవచ్చు.
* తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది.