- Home
- Business
- సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులను అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే రూ. 2 లక్షల వడ్డీ పొందొచ్చు
సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులను అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే రూ. 2 లక్షల వడ్డీ పొందొచ్చు
Post office: సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులు ఉంటే ప్రయోజనం ఉండదు. ఈ మొత్తాన్ని స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఇందులో ఎంతోకొంత రిస్క్ ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే ఓ స్కీమ్ గురించి తెలుసుకుందాం.

సురక్షిత పెట్టుబడి
షేర్ మార్కెట్‌లో వచ్చే లాభాలు ఆకర్షణీయంగా ఉన్నా, అందులో రిస్క్ ఎక్కువ. ఆ ప్రమాదం వద్దనుకునే వారికి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇప్పటికీ భరోసా కలిగించే మార్గం. తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడి కావాలనుకునే పెట్టుబడిదారులకు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ మంచి ఎంపికగా నిలుస్తోంది.
అసలేంటీ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్.?
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌ను POTD అని కూడా పిలుస్తారు. ఇందులో ఒకేసారి డబ్బు డిపాజిట్ చేసి నిర్ణీత కాలానికి పెట్టుబడి పెట్టాలి. ఈ స్కీమ్‌ను 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కాలానికి తీసుకోవచ్చు. ఇందులో 5 సంవత్సరాల ప్లాన్ ఎక్కువగా ప్రజాదరణ పొందింది.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.?
ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
* 1 సంవత్సరం డిపాజిట్‌కు 6.9 శాతం
* 2 సంవత్సరాల డిపాజిట్‌కు 7.0 శాతం
* 3 సంవత్సరాల డిపాజిట్‌కు 7.1 శాతం
* 5 సంవత్సరాల డిపాజిట్‌కు 7.5 శాతం
ఈ వడ్డీ రేట్లలో 5 సంవత్సరాల ప్లాన్ ఎక్కువ లాభం ఇచ్చేది కావడంతో పెట్టుబడిదారులు దీనిపైనే ఆసక్తి చూపుతున్నారు.
రూ. 2 లక్షల వడ్డీ రావాలంటే.?
ఒక వ్యక్తి ఈ స్కీమ్‌లో 5 సంవత్సరాల కాలానికి రూ.4,50,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఏడాదికి 7.5 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.6,52,477 లభిస్తాయి. అంటే అసలు పెట్టుబడిని తీసేస్తే కేవలం వడ్డీ రూపంలోనే రూ.2,02,477 లాభం వస్తుంది. ఇలా ఎలాంటి రిస్క్ లేకుండా 5 ఏళ్లలో వడ్డీ రూపంలోనే రూ. 2 లక్షలకు పైగా పొందొచ్చన్నమాట.
ట్యాక్స్ బెనిఫిట్ కూడా..
ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ స్కీమ్ డబుల్ లాభం ఇస్తుంది. 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ ఎంచుకుంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. ఈ ఖాతాను సింగిల్ గానీ జాయింట్‌గా ఓపెన్ చేయొచ్చు.

